విదేశాల్లో షో లు చేయడం అన్నది మన తెలుగు మ్యూజిక్ డైరక్టర్లకు కొత్త కాదు. మణిశర్మ, దేవీశ్రీప్రసాద్, థమన్ ఇలా చాలా మందికి విదేశీ వేదికలు కొత్త కాదు. అయితే కరోనా కారణంగా ఇలాంటి ఈవెంట్లు అన్నీ మరుగున పడిపోయాయి.
కరోనా రెండో దశ తరువాత, అమెరికాలో దాదాపు కరోనా ప్రభావం తగ్గిపోయింది అని తెలుస్తున్న నేపథ్యంలో టాప్ మ్యూజిక్ డైరక్టర్ థమన్ అక్కడ ప్రోగ్రామ్స్ చేయబోతున్నారు.
దీనికి సంబంధించిన ప్రోమోను హీరో అల్లు అర్జున్ విడుదల చేసారు. ఓ కాన్సెప్ట్ తో తయారు చేసిన ఈ ప్రోమో వీడియో అదిరిపోయిందనే చెప్పాలి.
త్రివిక్రమ్ లాంటి బ్రిలియంట్ బ్రెయిన్ ఈ ప్రోమో కట్ కు ఐడియా ఇచ్చి వుంటుందేమో అన్న చిన్న అనుమానం కలిగేలా వుంది.
డ్రమ్స్ శివమణి, బ్యూటిఫుల్ సింగర్ హారిక కూడా ధమన్ తో పాటు ఈ వీడియోలో కనిపించారు. అమెరికాలోని వివిధ లోకేషన్లలో ఈ స్టేజ్ షో లు జరగబోతున్నాయి.