Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎక్కువ సినిమాలు.. తక్కువ మెరుపులు

ఎక్కువ సినిమాలు.. తక్కువ మెరుపులు

ఒకటి కాదు, రెండు కాదు.. ఈ వారాంతం ఏకంగా 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ ఇందులో ఓ మోస్తరు అంచనాలు పెంచే సినిమా ఒక్కటి కూడా లేదు. చెప్పుకోవడానికి 7 సినిమాలు థియేటర్లలోకొస్తున్నా, వెళ్లి చూడాలనిపించే మూవీ ఒక్కటంటే ఒక్కటీ లేదు.

మంచు విష్ణు నటించిన ఓటర్, ప్రియదర్శి లీడ్ రోల్ చేసిన మల్లేశం సినిమాలు రేపు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఓటర్ ను పట్టించుకున్న నాథుడు లేడు. హీరో, దర్శకుడు పట్టింపులకు పోయి ఎవరికి వారు సినిమాను గాలికొదిలేశారు. కోర్టుకు కూడా వెళ్లారు. దీంతో నిర్మాతే కిందామీద పడి సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.

అటు ప్రియదర్శి చేసిన మల్లేశం సినిమాకు ప్రచారం బాగానే కల్పిస్తున్నారు కానీ ఆశించిన స్థాయిలో బజ్ రావడంలేదు. ఇప్పటికే చాలామంది క్రిటిక్స్, ప్రముఖులకు ఈ సినిమాను చూపించారు. అంతా మెచ్చుకుంటున్నారు కానీ సినిమాలో కమర్షియల్ వాల్యూస్ లేవనేది ఇంటర్నల్ టాక్.

ఇక ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ, ఫస్ట్ ర్యాంక్ రాజు అనే మరో రెండు సినిమాలు కూడా రేపు రిలీజ్ అవుతున్నాయి. నవీన్ పొలిశెట్టి నటించిన ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ సినిమాకు ప్రచారం ఊదరగొడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కూడా బాగానే సంపాదించగలిగారు. రిజల్ట్ ఎలా ఉండబోతోందనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. అటు ఫస్ట్ ర్యాంక్ రాజు అనే రీమేక్ సినిమా కూడా లైన్లో ఉంది. కానీ దీన్ని పట్టించుకునే వాళ్లు తక్కువ.

ఈ సినిమాలతో పాటు స్టువర్టుపురం, గజేంద్రుడు, స్పెషల్ అనే మరో 3 సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో అజయ్ నటించిన స్పెషల్ సినిమాను కూడా రిలీజ్ కు ముందే చాలా ప్రివ్యూలు వేశారు. కాన్సెప్ట్ అయితే బాగుందంటున్నారు చాలామంది. థియేట్రికల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

ఇక స్టువర్టుపురం, గజేంద్రుడు సినిమాలు ఆఖరి నిమిషంలో విడుదలకు సిద్ధమై చాలీచాలని థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల్ని చూడాలనుకున్నా ఏ థియేటర్ లో ఉందో వెదుక్కోవాల్సిన పరిస్థితి. ఇలా ఈ వీకెండ్ ఏకంగా 7 సినిమాలు వస్తున్నాయి. ఇందులో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.

ప్రయత్నాలు ఆపని అఖిలప్రియ.. మరి జగన్ కరుణిస్తాడా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?