సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టైయాన్- ది హంటర్’. దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదల కాబోతోంది. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆడియో వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ సాధారణంగా సినిమా హిట్ కావాలంటే ఓ మ్యాజిక్ జరగాలి. అన్నీ అలా కుదరాలి. జైలర్ మూవీ హిట్ తర్వాత నేను కథలు విని, కొన్నాళ్లకు కథలు పెద్దగా వినటం మానేశాను. ఆ సమయంలో సౌందర్య నా దగ్గరకు వచ్చి జ్ఞానవేల్ దగ్గర మంచి లైన్ ఉందని, వినమని నాతో చెప్పింది.
జ్ఞానవేల్‌తో ఫోన్లో మాట్లాడి కలిశాను. రెండు రోజుల్లో మళ్లీ ఫోన్ చేసి నేను లోకేష్, నెల్సన్ స్టైల్లో కమర్షియల్ సినిమా చేయలేను.. నా స్టైల్లో నేను చేస్తానని అన్నారు. నాకు కూడా అదే కావాలని నేను అనటంతో ఆయన కథను తయారు చేశారు. సుభాస్కరన్‌తో మాట్లాడి అమితాబ్‌ను ఒప్పించారు. అలా ఆయన టీమ్‌లో భాగమయ్యారు. ఫహాద్ ఫాజిల్ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ పాత్రను తనెలా చేస్తాడోనని అనుకున్నాను. తను చాలా సింపుల్‌గా యాక్ట్ చేసేశాడు. రామానాయుడు మనవడిగా రానా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను చాలా మంచి యాక్టర్. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, జ్ఞానవేల్ ఇంకా గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను` అన్నారు.
అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ రజినీకాంత్ పాత్ర గురించి, నా పాత్ర గురించి తెలిసిన తర్వాత నేను జ్ఞానవేల్ నెరేషన్ నచ్చి సినిమా చేయటానికి ఒప్పుకున్నాను. రజినీకాంత్‌తో యాక్ట్ చేయటానికి గొప్పగా, గర్వంగా భావిస్తున్నాను. తను మనందరికీ ఓ మంచి గిఫ్ట్. గ్రేట్ హ్యుమన్ బీయింగ్. చాలా సింపుల్‌గా కనిపిస్తారు. అక్టోబర్ 10న వేట్టైయాన్ రిలీజ్ అవుతుంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ మాట్లాడుతూ జై భీమ్` మూవీ హిట్ అయిన తర్వాత మంచి అవకాశం వస్తుందని తెలుసు. కానీ ఇలాంటి గొప్ప అవకాశం వస్తుందని అనుకోలేదు. రజనీ కాంత్ కు సన్నివేశాలు రాసే సమయంలో ఆయన మాత్రమే చేయగలడు అనేలా మాస్ సన్నివేశాలు కుదిరాయి. కథ రాసుకునే సమయంలోనే అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రానా.. ఇలా అందరినీ ఉహించుకునే రాసుకున్నాను. అభిమానులు సినిమాను ఊహించుకున్న దాని కంటే ఎక్కువగానే వేట్టైయాన్ సినిమా ఉంటుంది. ప్రతి చిన్న మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తారు“ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మాట్లాడుతూ వేట్టైయాన్ సినిమా చేసిన రజనీకాంత్ కు, లైకా ప్రొడక్షన్స్‌కి ధన్యవాదాలు. జ్ఞానవేల్‌తో సినిమా అనగానే తను నాకు సెట్ అవుతాడా? అని ఆలోచించాను. కానీ తనను కలిసిన తర్వాత నాకు కొత్తగా అనిపించింది. రజినీకాంత్ ను ఓ ఇన్‌టెన్స్ క్యారెక్టర్‌లో కొత్తగా చూస్తారని అన్నారు.
మంజు వారియర్ తదితరులు ప్రసంగించారు.ఇంకా ఈ కార్యక్రమంలో ఎడిటర్ కె.కదిర్, ప్రొడక్షన్ డిజైనర్ ఫిలోమన్, అభిరామి, రితికా సింగ్, దుసారా విజయన్, భరత్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు.
జండూ బాం అమ్మకాలు షురూ
త్వరలో ” వేట్రైయూన్- ద హంటర్” అనే అరవ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను తెలుగుభాషలో తీసిన చిత్రంగా భావించి సూపర్ హిట్ చేయండి.
అయినా థియేటర్లో చూడం