దర్శకుడు రాజమౌళి ఇప్పుడు వెయిటింగ్ లో వున్నారు. హీరోల కోసం కాదు, మరో సినిమా స్టార్ట్ చేయడానికి కాదు. హీరో పవన్ కళ్యాణ్ అపాయింట్ మెంట్ కోసం. వారం రోజులు అయింది నిర్మాత డివివి దానయ్య ద్వారా పవన్ కళ్యాణ్ కు కబురు చేసి, రాజమౌళి కలవాలనుకుంటున్నారు అంటూ దానయ్య కబురు చేసినట్లు బోగట్టా.
భీమ్లానాయక్ సినిమా జనవరి 12న విడుదల అయితే ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ అవుతుందని జంకుతున్నారు. ఎంత వారం రోజులు సోలో రిలీజ్ దొరికినా ఎగ్జిబిటర్లు డబ్బులు కట్టడం దగ్గర, సంక్రాంతి నుంచి కలెక్షన్లు పంచుకోవాల్సి రావడం దగ్గర ఇబ్బంది ఎదురవుతుందని అంచనా వేస్తున్నారు.
అదే కనుక భీమ్లా నాయక్ రాకపోతే పండగకు సోలోగా ఫుల్ గా దున్నేసుకోవచ్చు. ఆంధ్ర నుంచి 300 కోట్లు, తెలంగాణ నుంచి 150 కోట్లు రాబట్టేసి, లాభాలు చేసేసుకోవచ్చు. అందుకే భీమ్లా నాయక్ ను వెనక్కు పంపాలని ప్రయత్నిస్తున్నారు.
అందులో భాగంగా హీరో పవన్ కళ్యాణ్ ను ఒప్పించడం కోసం రాజమౌళి ఆయన అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. అయితే అపాయింట్ మెంట్ కొరి అయిదారు రోజులు అవుతున్నా ఇప్పటి వరకు అటు నుంచి స్పందన లేదని తెలుస్తోంది.
భీమ్ల నాయక్ ను సంక్రాంతి బరిలోకి దింపాలని పవన్ కళ్యాణ్ నే పట్టుదలగా వున్నారు. అందువల్ల ఆయనను ఒప్పిస్తేనే సినిమా వాయిదా సాధ్యం అవుతుంది. అందుకే రాజమౌళి ఈ వ్యవహారానికి దిగినట్లు తెలుస్తోంది.