ప్రతి హీరోయిన్ కు ప్రత్యేకంగా డైట్ ప్లాన్ ఉంటుంది. డైటీషియన్ చెప్పినట్టే తింటారు. అలా ఫిజిక్ ను, దాంతో పాటు అందాన్ని కాపాడుకుంటారు. అయితే అందరు హీరోయిన్లు ఇలానే ఉంటారనుకుంటే పొరపాటు. ఉదాహరణకు మృణాల్ నే తీసుకుంటే, ఈమెకు డైట్ ప్లాన్ అంటూ ఏమీ లేదు. హ్యాపీగా ఏదైనా తినేస్తానని చెబుతోంది.
అవును.. మృణాల్ ఠాకూర్ కు డైట్ ప్లాన్ అంటూ లేదు. నచ్చిన ఫుడ్ తింటుందట. కాకపోతే మరుసటి రోజు తిన్న లిస్ట్ అంతా ట్రైనర్ కు చెప్పి, అతడు చెప్పినట్టు వర్కవుట్స్ చేస్తుందట. అదీ ఈమె సౌందర్య రహస్యం.
తనది సగటు భారతీయ మహిళ శరీర సౌష్టవం అంటోంది మృణాల్. కొంతమందిలా సైజ్ జీరో షేప్ లోకి మారడం తన వల్ల కాదంటోంది. చిన్నప్పట్నుంచి తినే ఉత్తరాది భోజనాన్నే ఇప్పటికీ తింటుందట. ముంబయిలో షూట్ అయితే, ఇంటి నుంచే భోజనం వస్తుందట.
ఇక ముంబయి దాటి షూటింగ్ కు వెళ్తే.. తను తినే ఆహారంలో అన్ని పోషక విలువలు ఉండేలా చూసుకుంటుందట. తక్కువ తిని ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకుంటుందట. ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ విషయాలన్నీ వెల్లడించింది మృణాల్.
కొన్ని రోజుల కిందట ఆమె తన వయసును కూడా బయటపెట్టింది. ఆమె వయసు 31 ఏళ్లు. అప్పట్లో మొహమాటపడకుండా తన వయసు చెప్పిన ఈ బ్యూటీ, ఇప్పుడు తన డైట్ ప్లాన్ కూడా బయటపెట్టింది.