ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్

దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సినిమా లవ్ స్టోరి. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తోంది. కారణం..లవ్ స్టోరి ఒక్కో పాట ఆణి…

దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సినిమా లవ్ స్టోరి. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తోంది. కారణం..లవ్ స్టోరి ఒక్కో పాట ఆణి ముత్యాల్లా తయారై శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి.

రెండు వారాల కిందట రిలీజ్ చేసిన 'సారంగ దరియా' పాట ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ క్లబ్ లో చేరింది. ఫిబ్రవరి 28న సమంత చేతుల మీదుగా విడుదలైన సారంగ దరియా పాట కేవలం 14 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ మార్క్ చేరుకుంది.

సాయి పల్లవి చేసిన పాట రౌడీ బేబీ ఒక్కటే 8 రోజుల్లో ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ కు రీచ్ అయి సారంగ దరియా కంటే ముందుంది. మిగతా సూపర్ హిట్ సాంగ్స్ బుట్ట బొమ్మ, రాములో రాములా పాటలు సారంగ దరియా స్పీడ్ కంటే వెనకబడ్డాయి. బుట్ట బొమ్మ పాటకు 50 మిలియన్ వ్యూస్ వచ్చేందుకు 18 రోజులు పట్టగా, రాములో రాములా పాటకు 27 రోజులు పట్టింది. ఏప్రిల్ 16న ''లవ్ స్టోరి'' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ''లవ్ స్టోరి'' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్ : మార్తాండ్ కె.వెంకటేష్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి, పిఆర్ఓ : జి.ఎస్.కె. మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు, రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

ఇంత మాస్ క్యారెక్ట‌ర్ నా కెరియ‌ర్ లో ఎప్పుడు చేయ‌లేదు

బాబుకు సిగ్గుంటే కృష్ణా జిల్లాలో అడుగుపెట్టొద్దు