Advertisement

Advertisement


Home > Movies - Press Releases

'తిమ్మరుసు' ప్రారంభం

'తిమ్మరుసు' ప్రారంభం

'బ్లఫ్‌ మాస్టర్‌', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి  విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో  ఎదుగుతూ వస్తున్న సత్యదేవ్ హీరోగా కొత్త చిత్రం 'తిమ్మరుసు'. 

ఈ చిత్రం  హైదరాబాద్‌లో లాంఛనంగా ఆదివారం ప్రారంభమైంది.  ముహూర్తపు సన్నివేశానికి చిత్ర సినిమాటోగ్రాఫర్‌ అప్పూ ప్రభాకర్‌ క్లాప్‌ కొట్టారు. రాజా, వేదవ్యాస్‌ స్క్రిప్ట్‌ను అందజేశారు.  

ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌ నిర్మాత సృజన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న 'తిమ్మరుసు' చిత్రానికి శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - " కెరీర్‌ ప్రారంభం నుండి వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ హీరోగా, నటుడిగా..సత్యదేవ్‌ తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. అలాంటి హీరో సత్యదేవ్‌తో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది.

'తిమ్మరుసు' సినిమా విషయానికి వస్తే ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ. సత్యదేవ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇది. మంచి టీమ్‌ కుదిరింది. నిరవధికంగా జరిగే లాంగ్‌ షెడ్యూల్‌లో సినిమా చిత్రీకరణ పూర్తి చేసేలా ప్లాన్‌ చేశాం అన్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?