ఫస్ట్‌ లుక్‌: ఒక లైలా కోసం

‘మనం’ తర్వాత నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘ఒక లైలా కోసం’ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదలైంది. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేం కొండా విజయ్‌కుమార్‌ ఈ చిత్రానికి దర్శకుడు. అన్నపూర్ణా స్టూడియోస్‌ పతాకంపై…

‘మనం’ తర్వాత నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘ఒక లైలా కోసం’ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదలైంది. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేం కొండా విజయ్‌కుమార్‌ ఈ చిత్రానికి దర్శకుడు. అన్నపూర్ణా స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తోన్న ‘ఒక లైలా కోసం’ సినిమాలో నాగచైతన్య సరసన పూజా హెగ్దే నటిస్తోంది. పూజా హెగ్దే ప్రస్తుతం నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ హీరోగా తెరంగేటర్ర చేస్తోన్న ‘గొల్లభామ’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది పూజా హెగ్దే. 

నితిన్‌తో ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమా తెరకెక్కించి, మంచి విజయాన్నే అందుకున్న విజయ్‌కుమార్‌ కొండా, ఈ ‘ఒక లైలా కోసం’ సినిమాతో మళ్ళీ ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తాడేమో వేచి చూడాలి.