ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..?

భారతీయులు ఎగిరిపోవాలనుకుంటున్నారు. అవును.. అంతర్జాతీయ ప్రయాణాలకు సిద్దమవుతున్నారు. సూట్ కేస్ సర్దుకుని విహార యాత్రలకు సై అంటున్నారు. కరోనా తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు మొదలయ్యాయి. కరోనా భయంతో చాలామంది స్వచ్ఛందంగానే వెనకగుడేశారు.  Advertisement…

భారతీయులు ఎగిరిపోవాలనుకుంటున్నారు. అవును.. అంతర్జాతీయ ప్రయాణాలకు సిద్దమవుతున్నారు. సూట్ కేస్ సర్దుకుని విహార యాత్రలకు సై అంటున్నారు. కరోనా తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు మొదలయ్యాయి. కరోనా భయంతో చాలామంది స్వచ్ఛందంగానే వెనకగుడేశారు. 

ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నట్టు అర్థమవుతోంది. సెకండ్ వేవ్ తర్వాత భారత్ లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయుల్లో 72శాతం మంది విదేశీ పర్యటనలకు సిద్దమవుతున్నట్టు సర్వేల సారాంశం.

ఆసియాకే తొలి ఓటు..

భారత్ సహా ఇతర దేశాల పర్యాటకులంతా వచ్చే ఏడాది నుంచి తమ యాత్రలను ప్లాన్ చేసుకుంటున్నట్టు సర్వేలో వెల్లడైంది. అయితే వీరిలో చాలామంది డెస్టినేషన్ ఆసియా దేశాలే. ఆసియాలోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని అందరూ ఉత్సాహం చూపిస్తున్నారు. 

భారతీయ పర్యాటకుల్లో 50శాతం మంది విదేశాలకు వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తుండగా.. 57శాతం మంది దేశీయంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను చుట్టి రావాలనుకుంటున్నారు.

ట్రావెల్ ఆంక్షలపై అసహనం..

పర్యాటకులు ఉత్సాహంగానే ఉన్నా చాలా దేశాలు ఇప్పటికీ అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. పర్యాటకమే ప్రధాన ఆదాయ వవరులుగా ఉన్న దేశాలు మాత్రం కాస్త ముందుగానే నిబంధనలు సడలించాయి. అయితే సదరు దేశంలో ఆమోదం పొందిన వ్యాక్సిన్లు రెండు డోసులు తీసుకున్న వాళ్లకే అనుమతి. లేకపోతే ప్రయాణం చేయడం కష్టం. దీంతో చాలామంది పర్యాటకులు తమ ఉత్సాహాన్ని వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేసుకున్నారు.

మరోవైపు విదేశాలకు వెళ్లినప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తితే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భావన కూడా కొంతమందిలో ఉంది. వచ్చే ఏడాదికి ఇలాంటి పరిస్థితులన్నీ సర్దుకుంటాయని, పూర్తి స్థాయిలో ప్రయాణాలు, పర్యాటకం మొదలవుతుందని భావిస్తున్నారు.