టీమిండియా క్రికెట‌ర్ల‌కు నిద్ర‌మాత్ర‌లు ఇవ్వాల‌ట‌!

పాకిస్తాన్ జ‌ట్టు గెలవాలంటే టీమిండియా క్రికెటర్ల‌కు నిద్ర మాత్ర‌లు ఇవ్వాల‌ట‌! ఈ స‌ల‌హా పాకిస్తాన్ మాజీ పేస‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ ఇస్తున్న స‌ల‌హా. అయితే ఇదంతా స‌ర‌దా సంభాష‌ణే. ఇవాళ సాయంత్రం 7.30 గంట‌ల‌కు…

పాకిస్తాన్ జ‌ట్టు గెలవాలంటే టీమిండియా క్రికెటర్ల‌కు నిద్ర మాత్ర‌లు ఇవ్వాల‌ట‌! ఈ స‌ల‌హా పాకిస్తాన్ మాజీ పేస‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ ఇస్తున్న స‌ల‌హా. అయితే ఇదంతా స‌ర‌దా సంభాష‌ణే. ఇవాళ సాయంత్రం 7.30 గంట‌ల‌కు దాయాదులైన భార‌త్‌, పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ కోసం ప్ర‌పంచ‌మంతా ఎదురు చేస్తోంది. 

టీ20 క్రికెట్‌లో మొద‌టి నుంచి పాకిస్తాన్‌పై భార‌త్ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో భార‌త్ గెలుస్తుంద‌ని ఎక్కువ మంది అంటున్నారు.

పాకిస్తాన్‌, భార‌త్ మ‌ధ్య కీల‌క పోరు జ‌ర‌గ‌నున్న ప‌రిస్థితుల్లో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌ జట్టు గెల‌వాలంటే ఏం చేయాలో ఆయ‌న‌ కొన్ని సలహాలిచ్చారు.

 మొదట‌గా భారత ఆటగాళ్లకు నిద్రమాత్రలు ఇవ్వడం. రెండోది, రెండ్రోజుల పాటు కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ వాడకుండా ఆపడం. మూడోది , టీమిండియా మెంటార్ ధోనీ బ్యాటింగ్‌కు రాకుండా అడ్డుకోవడం అని ఆయ‌న స‌ల‌హాలివ్వ‌డం గ‌మ‌నార్హం. ఇప్పటికీ ఆ జట్టులో అద్భుత ఫామ్‌లో ఉన్న ఆటగాడు అతనే  అని అక్తర్ వ్యాఖ్యానించారు.

స‌ర‌దా కామెంట్స్‌ త‌ర్వాత ఆయ‌న త‌న జ‌ట్టు విజ‌యం సాధించాలంటే చేయాల్సిన ప‌నేంటో సీరియ‌స్ సంగ‌తులు చెప్పారు.

‘పాక్ జట్టు మంచి ఆరంభం కోసం చూడాలి. మొదటి 5-6 ఓవర్ల పాటు బంతికి ఒక్కో పరుగే చేసినా సరే డాట్‌ బాల్స్ లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత రన్‌రేట్ పెంచాలి. మంచి స్కోర్ సాధిస్తే దాన్ని డిఫెండ్ చేసుకోవడం సులభం. బౌలర్లు వికెట్ల కోసం ప్రయత్నించాలి’ అని అక్తర్ సలహా ఇచ్చారు. 

అయితే ఫీల్డ్‌లోకి దిగిన త‌ర్వాత స‌ల‌హాలు ఎంత మాత్రం ప‌నిచేస్తాయో అక్త‌ర్‌కు బాగా తెలుసు. పిచ్ స్వ‌భావం ఆట తీరునే మార్చేస్తుంద‌ని అనేక సంద‌ర్భాల్లో రుజువైంది. ఇవాళ సెంట్‌మెంట్ ప్ర‌కారం భార‌త్ గెలుస్తుందా?  లేక పాకిస్తాన్ అద్భుతం సృష్టిస్తుందా? అనేది మ‌రికొన్ని గంట‌ల్లో తేల‌నుంది.