ఆచార్య కథ మళ్లీ మొదటికొచ్చింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ శాటిలైట్ డీల్ తోనే మొదలైంది. మొదటి షెడ్యూల్ కూడా పూర్తికాకుండానే శాటిలైట్ రైట్స్ లాక్ చేశారు. తీరా అంతా ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు అదే డీల్ మళ్లీ మొదటికొచ్చింది.
సినిమాకు కొబ్బరికాయ కొట్టిన వెంటనే జెమినీ టీవీ రంగప్రవేశం చేసింది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యేసరికే (దాదాపు ఏడాది కిందటే) శాటిలైట్ రైట్స్ కోసం కర్చీఫ్ వేసుకుంది. ఏమైందో ఏమో ఇప్పుడు ఆ డీల్ నుంచి వెనక్కి తగ్గింది ఆ ఛానెల్.
దీంతో ఆచార్య శాటిలైట్ రైట్స్ మళ్లీ ఇప్పుడు ఫ్రెష్ గా ఓపెన్ అయ్యాయి. ఈసారి శాటిలైట్ రైట్స్ మాత్రమే ఇవ్వకుండా.. కుదిరితే శాటిలైట్, డిజిటల్ రైట్స్ తో పాటు డబ్బింగ్ రైట్స్ కలిపి ఒకేసారి అమ్మాలని నిర్మాతలు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఆచార్య సినిమాకు సంబంధించి ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ మొదలైంది. నైజాం ఆల్రెడీ అమ్ముడుపోయింది. రేటుపై అనుమానాలున్నప్పటికీ ఓవర్సీస్ కూడా లాక్ అయింది. ఇప్పుడు ఇదే ఊపులో మరో 2 వారాల్లో శాటిలైట్+డిజిటల్ డీల్స్ కూడా క్లోజ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు నిర్మాత నిరంజన్ రెడ్డి.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిడివి పెద్దగా ఉన్న ఓ ప్రత్యేక పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. మణిశర్మ సంగీత దర్శకుడు. కాజల్ హీరోయిన్.