వారికి నో అన్నారు.. మనోళ్లు అడగరు!

ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఎవ్వరి ఒత్తిళ్లకైనా లొంగుతుందా లేదా అనే విషయంలో ఏదైనా చర్చ ఉంటే.. ఎవ్వరైనా సరే.. చంద్రబాబు నాయుడు ఒత్తిడికి లొంగి తీరాల్సిందే అని చెప్తారు. కేంద్రంలో రాజ్యమేలుతున్న మోడీ…

ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఎవ్వరి ఒత్తిళ్లకైనా లొంగుతుందా లేదా అనే విషయంలో ఏదైనా చర్చ ఉంటే.. ఎవ్వరైనా సరే.. చంద్రబాబు నాయుడు ఒత్తిడికి లొంగి తీరాల్సిందే అని చెప్తారు. కేంద్రంలో రాజ్యమేలుతున్న మోడీ సర్కారులో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం ఉంది. వారు పక్కకు తప్పుకుంటే ప్రభుత్వ మనుగడ కష్టం. ఇలాంటి పరిస్థితిని చంద్రబాబు తన రాష్ట్ర ప్రయోజనాలకు వాడుతారా, సొంత ప్రయోజనాలకు వాడుతారా అనేది చూడాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ఆయన పాటిస్తున్న మౌనం అలాంటి అనుమానాలను కలిగిస్తున్నది.

కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. ఎన్డీయేలో భాగస్వామి అయిన జేడీయూ తమ బీహార్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలనే డిమాండ్ ప్రారంభించింది. బీహార్ కు ఎట్టి పరిస్థితుల్లో హోదా కావాలని.. ఒకవేళ అలా ఇవ్వడం కేంద్రానికి ఇబ్బందికరం అయితే కనీసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అడుగుతున్నారు. అదే విషయాన్ని ఇవాళ లోక్ సభలో చర్చకు తెచ్చారు.

బీహార్ సహా వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చే ప్రణాళిక ఉందా? అని జేడీయూ ఎంపీ అడిగారు. ప్రభుత్వం మాత్రం రాతపూర్వకంగా అలాంటి ఆలోచనే లేదని నో చెప్పింది. ముందే ఆల్టర్నేటివ్ సూచనగా ప్యాకేజీ దక్కినా చాలని అడిగిన వాళ్లు.. ఇప్పుడిక ప్యాకేజీ కోసం పట్టుబడతారేమో చూడాలి.

ఒకవైపు బీహార్ వాళ్లు అడిగి లేదనిపించుకున్నారు. మన నాయకుడు మాత్రం కేంద్రంలో కీలకంగా ఉండి కూడా అసలు అడగడమే లేదని ఏపీ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మోడీపై ఒత్తిడి తేగల ఏకైక నాయకుడిగా చంద్రబాబు ఉన్నారు. అయినా సరే ఆ బలాన్ని ఆయన రాష్ట్రం కోసం వినియోగించడం లేదనేది అందరి ఆలోచన. ఆయనకు ప్రస్తుతం ఉన్న ఆ బలం రాష్ట్ర ప్రజలు ఇచ్చిందే కదా.. రాష్ట్రం కోసం వాడవచ్చు కదా అని అనుకుంటున్నారు.

చంద్రబాబు నాయుడు గానీ.. తెదేపా ఎంపీలు గానీ.. ప్రత్యేకహోదా అనే పాయింట్ జోలికి వెళ్లేలా కనిపించడం లేదు. మరొకవైపు జగన్మోహన్ రెడ్డి.. తన పార్టీ ఎంపీలకు పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేకహోదా కోసం పోరాడాల్సిందిగా సూచన చేసి పంపారు. అయితే జగన్ తీరు కూడా విమర్శల పాలవుతోంది. 2019 ఎన్నికలకు పూర్వం ఆయన ఏకంగా తన పార్టీ లోక్ సభ సభ్యులు అందరితో ప్రత్యేకహోదా కోసం రాజీనామాలు చేయించారు.

2019లో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అయిదేళ్ల పాటు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు తాను ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మళ్లీ హోదాకోసం పోరాడాలని ఎంపీలతో అంటున్నారు. ఆయన ఆలోచనలో స్థిరత్వం లేదని ప్రజలు అనుకుంటున్నారు.

13 Replies to “వారికి నో అన్నారు.. మనోళ్లు అడగరు!”

  1. ప్రభుత్వం మనుగడకు 272 సీట్లు అవసరం.

    ప్రస్తుతం NDA కు 294 సీట్లు ఉన్నాయి.

    తెలుగుదేశం కు ఉన్న 16 + నితీశ్ కుమార్ కు ఉన్న 12 కలిపితే మొత్తం 28 సీట్లూ బయటకు పోతే 272 మైనస్ 28 = 264.

    ఆ 264 కు జగన్ 4 + నవీన్ పట్నాయక్ 1 + అకాలీదళ్ 1 కలిపితే NDA కు 270 ఉంటాయి.

    తగ్గేది రెండంటే రెండు సీట్లు. ఆ 2 సీట్లు పొందటం కష్టమా ?

    ఆ రహస్యం బాబోరుకు తెలుసు కాబట్టి 2018 లో చేసిన ధైర్యం ఇప్పుడు చేయకపోవచ్చు

  2. గతం లో బాబు కాంగ్రెస్ ఎలా తిట్టాడు, ఎలా పొత్తు పెట్టుకున్నాడు, ఎలా మద్దతు ఇవ్వలేదని అబద్దం చెప్పాడో బోలెడు వీడియోలు వున్నాయి. దానికి మాత్రం పచ్చ సాని పుత్రులు నోట్లో ఐస్ క్రీం పెట్టుకుంటారు.

    1. Please sir. Senseless to compare previous with current. BJP was in full power previously. Now, if TDP comes out, NDA will be out. Now, CBN has better chance to get what he wants. Unfortunately, he don’t want anything other than Amaravathi. That’s it

      1. అవునా అయితే 2019 లో జగన్ ఒక్క చాన్సు అని ఇచ్చిన హామీలు పోలవరం , వైజాగ్ స్టీల్ ప్లాంట్ , cps రద్దు , 3 క్యాపిటల్స్ , జాబ్ కేలండర్ ,సంపూర్ణ మధ్య నిషేధం , కేంద్రం మెడలు వంచటం అన్ని ఉత్తిత్తివేన ?

  3. వాడొక వేస్టుగాడు……. పచ్చళ్ళు ఎంత కీర్తించినా వాడు చరిత్రలో ద్రో*హిగా నిలిచిపోతాడు…

  4. ఇప్పుడు ప్రత్యేకహోదా అడగటమంటే బోడిగుండమీద అక్షింతలేయటమే .ప్రత్యేకహోదా అనేది బిజెపి వూహల్లోకూడలేదు .కాబట్టి ప్రత్యామ్నాయంగా మరోకటి మేలు .చందంరబాబుగారికి ఈమాత్రంతెలియనిదేంకాదు .దేనికైనాసమయంరావాలి . కాదని మద్దతు ఉపసంహరించుకుంటారా బిజెపికి పోయేదేంలేదు .మళ్ళీ ఎన్నికలకు రెడి .ఊ మద్దతిచ్చినవాళ్ళపరిస్థితే ఉన్నదీపాయె ఉంచుకున్నదీపాయె .

Comments are closed.