రైతు కుటుంబం ఆత్మ‌హ‌త్య ప్ర‌భుత్వాన్ని క‌దిలించ‌లేదా?

రైతు కుటుంబ ఆత్మ‌హ‌త్య‌ల‌కు ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాల్సి వుంటుంద‌నే భ‌యం అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని సింహాద్రిపురం మండ‌లం దిద్దెకుంట గ్రామంలో నాగేంద్ర అనే రైతు కుటుంబం అప్పుల బాధ‌తో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. రైతు దుస్థితిని ఈ కుటుంబ చావులు తెలియ‌జేస్తున్నాయి. ఎక్క‌డో ఉండి ప్ర‌భుత్వ పెద్ద‌లు విచారం వ్య‌క్తం చేయ‌డం మిన‌హాయిస్తే, ఇంత వ‌ర‌కూ సంఘ‌ట‌నా స్థ‌లానికి వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి లేదా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వెళ్లిన దాఖ‌లాలు లేవు.

ఇదే రాజ‌కీయం చేయ‌డానికి మాత్రం ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆగ‌మేఘాల‌పై క‌డ‌ప‌కు వచ్చాడ‌ని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నారు. గాలివీడు ఎంపీడీవో జ‌వ‌హ‌ర్‌బాబుపై వైసీపీ నేత‌లు దాడి చేయ‌డాన్ని పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ సీనియ‌స్‌గా తీసుకున్నారు. క‌డ‌ప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధిత ఎంపీడీవోను ఆయ‌న ప‌రామ‌ర్శించి, అండ‌గా వుంటామ‌ని ధైర్యం చెప్పారు. ఇదే సంద‌ర్భంలో వైసీపీ నేత‌ల తోలు తీసి, కింద కూచో పెడ‌తాన‌ని ఆయ‌న హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

ఇదే ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో రైతు త‌న భార్య‌, పిల్ల‌ల‌కు ఉరి వేసి, తాను అదే ప‌ని చేసి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందారు. న‌లుగురు రైతు కుటుంబ స‌భ్యులు చావులు కూట‌మి ప్ర‌భుత్వాన్ని క‌దిలించ‌లేదా? సీఎం చంద్ర‌బాబు, లేదా వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎందుక‌ని అక్క‌డికి వెళ్ల‌లేదు. ఎటూ క‌డ‌ప‌కు వెళ్లిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, దిద్దెకుంట‌కు ఎందుకు వెళ్ల‌లేక‌పోయార‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఎందుకంటే, రైతు కుటుంబ ఆత్మ‌హ‌త్య‌ల‌కు ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాల్సి వుంటుంద‌నే భ‌యం అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏడాదికి రూ.20 వేలు రైతు భ‌రోసా కింద ఇస్తామ‌ని హామీ ఇచ్చి, రైతుల‌తో గంప‌గుత్త‌గా ఓట్లు వేయించుకుని, చ‌డీచ‌ప్పుడు లేకుండా ప్ర‌భుత్వం వుంద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. దిద్దెకుంట‌కు ప్ర‌భుత్వ పెద్ద‌లు వెళితే, రైతులు నిల‌దీస్తార‌నే భ‌యం అంటున్నారు. ఇదే ఎంపీడీవోపై వైసీపీ నేత‌లు దాడి చేయ‌డంతో, రాజ‌కీయం చేయ‌డానికి అస్త్రం ల‌భించింద‌ని ప‌వ‌న్ హ‌డావుడి చేశార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

12 Replies to “రైతు కుటుంబం ఆత్మ‌హ‌త్య ప్ర‌భుత్వాన్ని క‌దిలించ‌లేదా?”

  1. ముందు ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న లోకల్ ఎమ్మెల్యే మన అన్న ఎం చేసారు…..కనీసం పరామర్శించారా ???పోనీ అన్న పరామర్శిస్తే భయపడి (???!!!) ప్రభుత్వం సహాయం చేస్తుందేమో కదా…????కనీసం అన్న కి తెలుసా అసలు అన్న ఎక్కడున్నారో తెలుసా ???

  2. Why don’t govt come up with a farmer corporation.. initially govt can form farmer/kisan corporation with 1000cr as initial fund and can invite donations . This could be a win win situation for both the parties. Govt can define rules and regulations inviting opposition to be part of the body to make sure that there is a transparency

Comments are closed.