కాంగ్రెస్ లో ఎవరికీ అవమానం జరుగుతుందో?

పీవీ నరసింహా రావు మరణించినప్పుడు సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు ఎలా దారుణంగా అవమానించారో అందరికీ తెలుసు.

సాధారణంగా ప్రాంతీయ పార్టీలను కుటుంబ పార్టీలంటారు. కానీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ పార్టీయే. ఆ కుటుంబం ఒకప్పుడు నెహ్రు కుటుంబం, తరువాత ఇందిరా గాంధీ కుటుంబం, ఆ తరువాత రాజీవ్ గాంధీ కుటుంబం. ఇప్పుడు సోనియా గాంధీ కుటుంబం.

పార్టీ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబానికి చెందని నాయకుడున్నా సరే పెత్తనం మాత్రం ఆ కుటుంబానిదే ఉంటుంది. వాళ్ళ కనుసన్నల్లో ఉన్నంతవరకు పదవికి ఢోకా ఉండదు. స్వతంత్రంగా వ్యవహరిస్తేనే తిప్పలు. అవమానాల పాలుచేస్తారు.

మొన్న మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్ధిక మంత్రిగా పేరుప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి కారణం అప్పటి ప్రధాని పీవీ నరసింహా రావు. ఆయన ఏరికోరి మన్మోహన్ సింగ్ ను ఆర్దికమంత్రిగా నియమించుకున్నారు. వారిద్దరూ కలిసి కష్టాల్లో ఉన్న భారత దేశం ఉజ్వలంగా వెలిగేలా చేశారు.

సోనియా గాంధీ చలవ కారణంగా మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. మన్మోహన్ మేధావి. కాదనం. కానీ సోనియా గాంధీకి వంద శాతం విధేయుడిగా ఉన్నారు. పేరుకు మన్మోహన్ ప్రధాని అయినప్పటికీ తెరచాటున సోనియా గాంధీయే ప్రధానిగా ఉండేవారు. ఈ విధేయత కారణంగానే ఆయన పదేళ్లు ప్రధానిగా ఉండగలిగారు.

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులెవరూ ఆయన పేరు తలుచుకోరు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియమ్మ అంటారు. కానీ ప్రధానిగా తెలంగాణ బిల్లును పార్లమెంటులో పాస్ చేయించడంలో మన్మోహన్ కృషి తక్కువేమీ కాదు.

ఆయన మరణించగానే ఢిల్లీలో ఆయనకు స్మారకం నిర్మించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. కాంగ్రెస్ డిమాండ్ చేయకముందే కేంద్ర ప్రభుత్వం స్మారకం నిర్మించాలని నిర్మించాలని నిర్ణయించింది. ప్రధానిగా దేశాన్ని కష్టాల నుంచి గట్టెక్కించి వినూత్న విధానాలతో పునాదులు వేసిన పీవీ నరసింహా రావు మరణించినప్పుడు సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు ఎలా దారుణంగా అవమానించారో అందరికీ తెలుసు.

కారణం ….ఆయన ప్రధానిగా స్వతంత్రంగా వ్యవహరించడమే. ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకోవడమే. జర్నలిస్టు వినయ్ సీతాపతి హాఫ్ లయన్ పుస్తకంలో పీవీకి జరిగిన దారుణ అవమానాన్ని గురించి కూలంకషంగా రాశారు. కాంగ్రెస్ పార్టీ పీవీని మాత్రమే అవమానించలేదు.

రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీని కూడా అవమానించిందని ఆయన కూతురు శర్మిష్ఠ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మన్మోహన్ సింగ్ కు విడిగా స్మారకం నిర్మించాలని కాంగ్రెస్ ప్రతిపాదించిన నేపథ్యంలో ఆమె తన తండ్రికి జరిగిన అవమానాన్ని వివరించింది.

ప్రణబ్ ముఖర్జీ మరణించినప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కనీసం సంతాప సమావేశం నిర్వహించాలన్న ఆలోచన కూడా చేయలేదు. రాష్ట్రపతులకు సంతాప సమావేశాలు నిర్వహించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో లేదని అన్నారట. మరో రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ చనిపోయినప్పుడు సంతాప సమావేశం నిర్వహించారు.

అప్పుడు ప్రణబ్ ముఖర్జీయే సంతాప సందేశం రాశారు. ప్రణబ్ ముఖర్జీ కూడా సోనియాకు విధేయుడిగా ఉండటానికి ఇష్టపడకపోయి ఉండొచ్చు. రాజనీతిజ్ఞులను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గౌరవించదని శర్మిష్ఠ అన్నారు. పీవీ మరణించినప్పుడు జరిగిన అవమానాన్ని కూడా ఆమె గుర్తు చేశారు.

5 Replies to “కాంగ్రెస్ లో ఎవరికీ అవమానం జరుగుతుందో?”

  1. PV Naarasimharao Manmohan Singh Pranab Mukherjee reached highest positions despite having no mass base and that was purely because of their capabilities and the Congress structure enabled their rise. Can we see that happen in family led regional parties? Why was and is still Advani being treated with such disrespect by BJP?

Comments are closed.