ఇకపై ఎవరు ఇలా చేసిన శిక్ష తప్పదు అనేలాగా చేశారు విశాఖ పోలీసులు. తప్పుడు సమాచారం అందిస్తూ ప్రభుత్వ నిధులను ఖర్చు పెట్టిస్తున్నా వారిపై విశాఖ పోలీసులు పెట్టిన కేసులు చూస్తే తప్పకుండా అలాంటి వారికి వార్నింగ్ లాగే కనపడుతుంది. ఇకనైనా అలాంటి వారికి తప్పు చేయాలంటే భయం పుట్టె లాగా ఉంది.
ప్రభుత్వాని తప్పు దారి పట్టించి, భర్తను ఏమార్చి ప్రియుడితో వెళ్లిపోయి, రెండు రోజులు పాటు ఆచూకీ లేకుండా ఏమార్చింది. ప్రభుత్వంతో ఆమె ఆచూకీ కొసం అక్షరాల కోటీ రూపాయిలకు పైగా ఖర్చు చేయించిన సాయిప్రియా అలియస్ విశాఖ సాయిప్రియ మరోసారి వార్తలోకి ఎక్కారు.
ప్రభుత్వని తప్పు దారి పట్టించిన సాయిప్రియ, ఆమె ప్రియుడిపై విశాఖ పోలీసులు కోర్టు అనుమతితో కేసు పెట్టారు. ఐపీసీ 420, 417, 494, 202 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రభుత్వ వర్గాలను మిస్ లీడ్ చేసిన సాయిప్రియపై భర్తకు విడాకులు ఇవ్వకుండనే రెండో పెళ్లి చేసుకోవడం, తన గురించి అందరూ వెతుకుతున్నారని తెలిసీ కూడా బాధ్యతారాహిత్యంగా క్షేమ సమాచారం ఇవ్వకపోవడంపై కేసులు పెట్టారు.