సోషల్ మీడియా ద్వారా పేరు సంపాదించుకొని అదే సోషల్ మీడియా అతి వల్ల తన ఉపాధిని కొల్పోయిన స్ట్రీట్ పుడ్ వ్యాపారి కుమారీ అంటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని ఆమె హోటల్‌ను మూసేయించిన పోలీసుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డీజీపీ మరియు కార్పొరేషన్ అధికారులను సీఎం అదేశించారు.
ప్రజాపాలన అంటే చిరు వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉండటమే అని తెల్చి చెప్పారు. దానితో పాటు సీఎం సైతం ఆమె చేతి వంటను రుచి చూడనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సీఎం రేవంత్ కూడా కుమారీ అంటీ స్టాల్‌కు వెళ్లితే మాత్రం ఆమెకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.
కాగా పోలీసులు స్టాల్ మూసేసినప్పటి నుండి సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుతో పాటు రేవంత్‌ని టార్గెట్ చేయడం తెలిసిందే. మరోవైపు సామన్య జనాలు కూడా ఎంతో మంది.. రోడ్డు పక్కన టేబుళ్లు వేసి, కుర్చీలు వేసి మరీ వ్యాపారాలు చేసున్న రాని సమస్య కుమారీ అంటీ వల్లే వచ్చినా అని ప్రశ్నలు కురిపిస్తున్నారు.