చెవిరెడ్డిపై పోక్సో కేసు.. బిగ్ ట్విస్ట్‌!

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డిపై న‌మోదైన పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చంద్ర‌బాబు స‌ర్కార్ ప్ర‌త్య‌ర్థుల‌పై క‌క్ష‌పూరితంగా కేసులు న‌మోదు చేస్తోంద‌న్న ఆరోప‌ణ‌ల‌కు బ‌లం క‌లిగించేలా తాజా ప‌రిణామాలున్నాయి. Advertisement తిరుప‌తి…

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డిపై న‌మోదైన పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చంద్ర‌బాబు స‌ర్కార్ ప్ర‌త్య‌ర్థుల‌పై క‌క్ష‌పూరితంగా కేసులు న‌మోదు చేస్తోంద‌న్న ఆరోప‌ణ‌ల‌కు బ‌లం క‌లిగించేలా తాజా ప‌రిణామాలున్నాయి.

తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని ఎర్రావారిపాలెం మండలంలోని య‌ల‌మంద‌లో ప‌దో త‌ర‌గ‌తి ద‌ళిత విద్యార్థినిపై దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ దాడి రాజ‌కీయ రంగు పులుముకుంది. చివ‌రికి చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డిపై పోక్సో కేసు న‌మోదు చేసే వ‌ర‌కూ ప‌రిణామాలు వెళ్లాయి. త‌న‌పై అన్యాయంగా కేసు న‌మోదు చేశార‌ని. క‌నీసం ముంద‌స్తు బెయిల్‌కు కూడా అప్లై చేసుకోన‌ని భాస్క‌ర్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఆప‌ద‌లో ఉన్న ద‌ళిత కుటుంబానికి సాయం చేయ‌డానికి వెళ్ల‌డ‌మే త‌ప్పా? అని చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి ప్రశ్నించ‌డం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో పోక్సో కేసులో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. బాధిత విద్యార్థిని త‌ల్లిదండ్రులు మీడియా ముందుకొచ్చారు. తిరుప‌తిలో వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి నేతృత్వంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి మాట్లాడుతూ దళితుల‌కు తాను మొద‌టి నుంచి అండ‌గా వుంటున్న‌ట్టు చెప్పారు. అందుకే య‌ల‌మంద‌కు చెందిన బాధిత విద్యార్థిని త‌ల్లిదండ్రులు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి, పోక్సో కేసు విష‌య‌మై వాస్త‌వాలేంటో చెప్పార‌న్నారు.

నిజానిజాలేంటో లోకానికి తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతో వాళ్ల‌ను మీడియా ముందుకు తెచ్చిన‌ట్టు నారాయ‌ణ‌స్వామి తెలిపారు. బాధిత విద్యార్థిని తండ్రి మీడియాతో మాట్లాడుతూ….

“నేను ఎవ‌రి మీద ఫిర్యాదు చేయ‌లేదు. నా కుమార్తెపై దాడి జ‌రిగింద‌ని మేమే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డికి ఫోన్ చేసి చెప్పాం. మా కోస‌మే ఆయ‌న వ‌చ్చారు. మీడియాలో పాప‌పై ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో, వాటిని ఆపేందుకు ఖాళీ పేప‌ర్ల‌పై సంత‌కం చేయాల‌ని పోలీసులు చెప్పారు. అందులో ఏమున్న‌దో మాకు తెలియ‌దు. నా బిడ్డ‌కు సాయం చేయ‌డానికి వ‌చ్చిన వాళ్ల‌పై నేనెందుకు కేసు పెడ‌తాను? అది పాపం క‌దా?” అని ఆయ‌న అన్నారు.

దీంతో చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డిపై న‌మోదైన పోక్సో కేసు తెర వెనుక ఏం జ‌రిగిందో జనానికి తెలిసొచ్చింద‌ని భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అన్నారు. ప్ర‌భుత్వం చేతిలో వుంది క‌దా? అని ఇష్టానుసారం కేసులు పెట్ట‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు. భాస్క‌ర్‌రెడ్డిపై పోక్సో కేసు తామే పెట్ట‌నే లేద‌ని బాధిత విద్యార్థిని తండ్రి నిజాలు చెప్ప‌డానికి ముందుకు రావ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. ఇలా వాస్త‌వాలు మ‌రుగున ప‌డి ఎన్ని త‌ప్పుడు కేసులు న‌మోదు అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇప్ప‌టికైనా సీఎం చంద్ర‌బాబు అక్ర‌మ కేసులు న‌మోదు చేయ‌డాన్ని విర‌మించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు

4 Replies to “చెవిరెడ్డిపై పోక్సో కేసు.. బిగ్ ట్విస్ట్‌!”

Comments are closed.