బీజేపీ నేతలు ఈ మధ్య కాలంలో చంద్రబాబు 'యూ టర్న్' పాలసీని ఫాలో అవ్వుతున్నట్లు కనపడుతోంది. ఒకసారి అమరావతిలో మాత్రమే అభివృధి జరగాలంటారు. మరో ప్రాంతానికి వెళ్లీ మరో మాట మాట్లాడుతుంటారు. ఒక వైపు అమరావతి పాదయాత్రకు సపోర్టు చేస్తునే రాయలసీమ, ఉత్తరాంధ్ర గురించే మాట్లాడుతున్నారు.
ఇవాళ బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవిల్ నరసింహరావు మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ పై బీజేపీ నాయకత్వం ఇప్పటికి కూడా కట్టుబడి ఉందని, హైకోర్టు అనేది రాష్ట్రం చేతుల్లోనే ఉందని, కర్నూల్‌లో హైకోర్టు ఏర్పాటు చేయాడానికి రాష్ట్రం ముందుకు వస్తే కేంద్రం కూడా సపోర్టు చేస్తుందన్నారు.
అమరావతి ఎకైక రాజధానికే కట్టుబడి ఉన్నాం అంటూనే పరిపాలన మాత్రమే ఒక చోట ఉండి, మిగతా ప్రాంతాల్లో కూడా అభివృధికి కట్టుబడి ఉన్నామని జీవిల్ తెలిపారు. అప్పట్లో అందరూ ముఖ్యమంత్రులు హైదరాబాద్ కోసం మాత్రమే అభివృధి చేసి మిగతా ప్రాంతాలను అన్యాయం చేయడం వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారాన్నారు.
రాయలసీమలో హైకోర్టు ఒప్పుకున్నప్పుడు కేంద్రం నుండి పర్మిషన్ ఇప్పించి కేంద్రం చేతులతోనే హైకోర్టు కర్నూల్ లో ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రజలు బీజేపీని గుర్తుంచుకుంటారు కాదా అని అంటూన్నారు రాయలసీమ మేదావులు.