బాదుదే బాదుడు అంటూ ఏపీ అంతా ఒకటికి పది సార్లు చంద్రబాబు ప్రతిపక్షంలో తిరిగిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ధరల బాదుడుతో జగన్ నడ్డి విరుస్తున్నారు అని ఆనాడు బాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇప్పుడు దాని కంటే దారుణంగా ధరలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో ఏమి తినేటట్లు లేదు, కొనేటట్లు లేదు అని సామాన్యుడు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. కూరగాయల ధరలు సెంచరీలు కొడుతూంటే నిత్యావసరాలు అయిన్న పప్పు దినుసులు ధరలు డబుల్ సెంచరీ కొడుతున్నాయి. వంట నూనెలు సలసల మరగుతున్నాయి.
అయితే అమాంతం పెరిగిన ఈ ధరల సంగతి కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష వైసీపీ విమర్శిస్తోంది. క్వార్టర్ మందు బాటిల్ నాణ్యమైనది 99 రూపాయలకే సుమా అని తెగ ఊదరగొడుతూ పబ్లిసిటీ చేసుకుంటోందని వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ సెటైర్లు పేల్చారు.
మంచి మద్యం సంగతి తరువాత నింగిని అంటిన ధరల విషయం పట్టించుకోండి అని ఆయన ప్రభుత్వానికి సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో నాలుగు వేల మంది కార్మికులను తొలగించినా చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదని అన్నారు. నాడు మాట ఇచ్చిన సంగతి పవన్ మరచారా అని ప్రశ్నించారు.
అసలు స్టీల్ ప్లాంట్ గురించిన సోయి మీకు ఉందా అని నిలదీశారు. అయిదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు దేముడెరుగు రెండున్నర లక్షల మంది వాలంటీర్లను రోడ్డున పడేశారని, మద్యం షాపులలో పనిచేసే పదిహేను వేల మందికి ఉపాధి లేకుండా చేశారని బొత్స మండి పడ్డారు.
విశాఖలో వైసీపీ ప్రభుత్వం కేవలం ఆరు వందల కోట్ల పెట్టుబడితో రెండు వేలమందికి ఉపాధిని కల్పించేలా ఇనార్బిట్ మాల్ ని తీసుకుని వచ్చిందని బొత్స గుర్తు చేశారు. 1300 కోట్ల విలువ చేసే భూములను లూలూకు ఇచ్చి ఆరు వందల కోట్ల పెట్టుబడి పెట్టించడం కాదని ఎద్దేవా చేశారు. విశాఖ అభివృద్ధి మీద చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Jerusalem పరమ పవిత్రం అంటూ సోది కబుర్లు చెప్పే మధ్యప్రాశ్చయం ఇప్పుడు Iran దాడుల్లో ధ్వంసమైపోతే అప్పుడు అన్ని మతాల వారూ అక్కడే ఒకరినొకరు పట్టుకొని వగస్తారేమో?
Vaadu cheppindi neeku ardam ayyindaa? Leka neeku munde script ichara?
Call boy works 9989793850
vc available 9380537747
Veedu oka leader vadini support chesthu neevu article rasthavu
Eenadu.. Andhra Jyothi articles chadukommma.. meeku Ave correct
అసలు బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడతాడో ఎవరికీ అర్ధం కాదు, విచత్రం ఏమంటే, Great andhra Reporter కి అర్ధం అయ్యింది..🤣🤣🤣