విశ్వంలో కామెడీకి 8 నెలలు టైమ్ తీసుకున్నాను

తెలుగు సినిమాల్లో కామెడీకి ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుల్లో శ్రీనువైట్ల ఒకరు. ఈయన తీసిన కామెడీ సన్నివేశాలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి డైరక్టర్ నుంచి మూవీ వస్తుందంటే, ఆడియన్స్ కచ్చితంగా…

తెలుగు సినిమాల్లో కామెడీకి ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుల్లో శ్రీనువైట్ల ఒకరు. ఈయన తీసిన కామెడీ సన్నివేశాలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి డైరక్టర్ నుంచి మూవీ వస్తుందంటే, ఆడియన్స్ కచ్చితంగా కామెడీ ఆశిస్తారు. అందుకే విశ్వం సినిమా కోసం 8 నెలలు టైమ్ తీసుకున్నానని తెలిపాడు వైట్ల.

“సినిమా చేద్దామని గోపీచంద్ అడిగినప్పుడు.. నా దగ్గర ఆల్రెడీ ఉన్న 3 స్టోరీ లైన్స్ చెప్పాను. మూడూ గోపీచంద్ కు నచ్చాయి కానీ తనకు సూట్ అవ్వవని అన్నాడు. అప్పుడు ఆ స్ట్రగుల్ నుంచి వచ్చిన కథ విశ్వం. 2022లో ఇదంతా జరిగింది. అయితే ఈ కథలో నా మార్క్ కామెడీని పెట్టడం కష్టమైంది. దీని కోసం 8 నెలలు టైమ్ తీసుకున్నాను. అందుకే గోపీచంద్ సినిమా స్టార్ట్ చేద్దామని అడిగిన తర్వాత కూడా వద్దు, మరో సినిమా చేసుకోమని నేనే చెప్పాను.”

తన గత సినిమాల్లో థీమ్స్ రొటీన్ అయ్యాయనే విషయాన్ని వైట్ల అంగీకరించాడు. తనతో పాటు చాలామంది దర్శకుడు ఒకే తరహా థీమ్స్ తీసుకోవడం వల్ల తనకు ఫ్లాపులొచ్చాయంటున్నాడు.

“నా సినిమాల్లో థీమ్స్ ను రిపీట్ గా ఫీలయ్యారు ఆడియన్స్. ఒక ఇంట్లోకి హీరో వెళ్లి కామెడీ చేయడం అనేది నాతో పాటు చాలామంది దర్శకులు చేయడం వల్ల రిపీట్ గా భావించారు. దీంతో నా సినిమాలు తేడా కొట్టాయి. నేను కూడా అది గుర్తించాను. అందుకే విశ్వం సినిమా కోసం ఫ్రెష్ థీమ్ తీసుకున్నాం. ఈ థీమ్ లోకి నా నుంచి ఆశించే కామెడీ-యాక్షన్ చొప్పించాను.”

పరిశ్రమకొచ్చి పాతికేళ్లు పూర్తి చేసుకున్న ఈ దర్శకుడు.. కొత్తగా ఏదో సాధించాలనే ఆలోచన తనకు లేదని, సినిమాలు తీయడమే తన ప్యాషన్ అని అంటున్నాడు.

11 Replies to “విశ్వంలో కామెడీకి 8 నెలలు టైమ్ తీసుకున్నాను”

Comments are closed.