ఆంధ్రప్రదేశ్‌ను అప్పులపాలు చేస్తున్న కూటమి సర్కార్‌పై మాజీ ఆర్థికశాఖ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో తమ ప్రభుత్వంపై టీడీపీ, జనసేన నేతలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెడుతోందని, రాష్ట్రం శ్రీలంక, పాకిస్తాన్‌లా మారుస్తోందని దుయ్యబట్టడాన్ని గుర్తు తెచ్చారు. ఇవాళ మీడియాతో బుగ్గన మాట్లాడుతూ అప్పులు చేయడంలో కూటమి సర్కార్ దూసుకెళ్తోందని వ్యంగ్యంగా అన్నారు.
జూన్‌లో రూ.6 వేల కోట్లు, జూలైలో రూ.10 వేల కోట్లు, ఆగస్టులో రూ.3 వేల కోట్లు, సెప్టెంబర్‌లో రూ.4 వేల కోట్లు, అక్టోబర్‌లో రూ.6 వేల కోట్లు, నవంబర్‌లో రూ.4 వేల కోట్లు, డిసెంబర్‌లో రూ.9 వేల కోట్లు అప్పు చేశారని ఆయన విమర్శించారు. ఒకేసారి రూ.5 వేల కోట్లు అప్పు చేసిన ఘన చరిత్ర చంద్రబాబు సర్కార్‌దే అని ఆయన అన్నారు. కేవలం రాజధాని అమరావతి పేరుతో రూ.31 వేల కోట్లు అప్పు చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
ఇప్పటి వరకు కూటమి సర్కార్ ఒక లక్షా 12 వేల 750 కోట్లు అప్పులు చేసిందని ఆయన వివరాలు వెల్లడించారు. ఈ రకంగా అప్పులు చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు. అప్పులు ఎవరు చెల్లిస్తారని ఆయన నిలదీశారు.
తమ పాలనలో 13 శాతం మాత్రమే అప్పులు చేశామన్నారు. కానీ కూటమి సర్కార్ ఏకంగా 22.6 శాతం అప్పులు చేసిందని ఆయన దుయ్యబట్టారు. కూటమి అధికారంలోకి రావడానికి మ్యానిఫెస్టోనే కారణమన్నారు. మరి ఆ మ్యానిఫెస్టో అమలు ఏమైందని ఆయన నిలదీశారు.
That’s good strategy as long as those funds will use for AP development.
No future govt dares for freebies if state has huge debts and they always look for revenue generation options.
In the last five year regime, 2.50 crores has been spent on welfare by borrowing money! Did it improve the lives of poor people?
At least now, spending is on the state development if not freebies!
మీరు వేసిన ఆర్ధిక విధ్వంసం ఆ స్దాయిలో ఉంది మరి, అంత అప్పులు చేస్తే గాని గట్టెక్క లేని స్దితిలోకి నెట్టేశారు
Yeee government vachina appuu thagadhu kadha yendhuku soluuu matalu
Veedu sontha parents ni intillo nunchi tharimesadu veedu rastram gurinchi evvaru namutharu
jagan?
“మాజీ ఆర్థికశాఖ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.”..i wish a day comes when he will kneel infront of andhra to apologize
Inka ee bolli gaadu free bus gatra cheyaledu..
jusr 6 months only..
మీరేలే మాట్లాడాలసింది.. సిగ్గులేకుండా
సిగ్గులేని ఆ మంత్రి పెద్ద పెద్ద అబద్ధాలు చెపితే, నిజమన్నట్లు నువ్వు రాయటం. వాడు వచ్చే మూడు ఏళ్లలో రాబోయే అప్పులు కలిపి చెబితే నీకు చెక్ చేసుకోవాలనిపించ లేదా? అమరవతికి అప్పులకు అనుమతులు కొన్ని వచ్చాయి కొన్ని ఇంకా రాలేదు. ఈ అప్పులు ఏవీ ఇంకా పైసా కూడా ఇవ్వ లేదు. పనులు అవుతున్న కొద్దీ 7 విడతాలలో ఇస్తారు.