భ‌య‌పెట్టే వాళ్ల‌మే త‌ప్ప‌.. భ‌య‌ప‌డం!

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత రాజ‌కీయంగా మ‌ళ్లీ యాక్టీవ్ అయ్యారు.

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత రాజ‌కీయంగా మ‌ళ్లీ యాక్టీవ్ అయ్యారు. లిక్క‌ర్ కేసులో జైలుపాలై, అనంత‌రం కొన్ని నెల‌ల త‌ర్వాత బెయిల్‌పై విడుద‌లయ్యారు. కొంత‌కాలం ఆమె రాజ‌కీయంగా దూరంగా ఉన్నారు. ఇప్పుడు మ‌ళ్లీ జ‌నంలోకి వెళ్తుతున్నారు. కేసులు, జైళ్ల‌కు భ‌య‌ప‌డేది లేద‌నేది ఆమె తాజా ప్ర‌క‌ట‌న‌.

నిజామాబాద్‌లో బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో ఆమె దూకుడుగా మాట్లాడారు. త‌న తండ్రి కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కేటీఆర్‌, త‌న‌పై కేసులు పెట్టార‌ని విమ‌ర్శించారు. అయినా భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. కేటీఆర్‌, తాను ఏ త‌ప్పూ చేయ‌లేద‌ని క‌విత స్ప‌ష్టం చేశారు. తాము భయ‌పెట్టే వాళ్ల‌మే త‌ప్ప‌, భ‌య‌ప‌డే ర‌కం కాద‌న్నారు.

కేసుల నుంచి నిప్పు క‌ణిక‌ల్లా బ‌య‌టికి వ‌స్తామ‌ని క‌విత అన్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రతిప‌క్షాల‌పై ఊరికే కేసులు పెడుతున్నార‌ని ఆమె చెప్పుకొచ్చారు. కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఎదిరించినా, అలాగే భార‌త్ భూభాగాన్ని చైనా ఆక్ర‌మించింద‌ని ఆరోపించినా, సీఎం మ‌ర్చిపోయినా కేసులు పెడుతున్నార‌ని క‌విత అన్నారు. ప‌రోక్షంగా అల్లు అర్జున్‌పై కేసును ఆమె ప్ర‌స్తావించారు. సోష‌ల్ మీడియాలో ఏదైనా పోస్టు పెడితే కేసు పెడుతున్న‌ట్టు క‌విత తెలిపారు.

8 Replies to “భ‌య‌పెట్టే వాళ్ల‌మే త‌ప్ప‌.. భ‌య‌ప‌డం!”

Comments are closed.