ఏపీలో వలంటీర్ల విషయంలో కూటమి రాజకీయాలు అవకాశవాదానికి పరాకాష్టగా మారాయి! ఒకవైపు వలంటీర్లను అడుగడుగునా శంకించడం, వారిని అనరాని మాటలు అనడం, వారు అత్యాచారాలు చేస్తున్నారు, విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, అదో ఉద్యోగమా, మగవాళ్లు లేని వేళ తలుపులు తడుతున్నారు, అక్రమసంబంధాల వివరాలను తీసుకుంటున్నారు, వితంతువుల వివరాలు కనుక్కొంటున్నారు.. అంటూ తెలుగుదేశం, జనసేన అధినేతలు వివిధ సందర్భాల్లో వ్యాఖ్యానించారు!
చంద్రబాబు నాయుడు అయితే.. ఇష్టానుసారం మాట్లాడారు. వలంటీర్లది గోనె సంచులు మోసే ఉద్యోగం అన, అదో ఉద్యోగమే కాదని.. మగవాళ్లు ఇంట్లో లేని సమయం చూసి వలంటీర్లు తలుపులు కొడుతున్నారంటూ మాట్లాడారు. ఇక పవన్ కల్యాణ్ అయితే సరేసరి.. తనకు కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయంటో, నోటికొచ్చినట్టుగా పేలారు!
వలంటీర్లు వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారని, తద్వారా విమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారంటూ పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ విషయాలను తనకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయంటూ కూడా గప్పాలు కొట్టుకున్నారు! మరి అదే జరుగుతుంటే.. కేంద్ర నిఘా వర్గాలు పవన్ కల్యాణ్ కు సమాచారం ఇచ్చి సరిపెట్టాయనుకోవాలన్నట్టుగా పవన్ కామెడీ చేశారు!
ఆ కామెడీలు, ఆ మాటల సంగతలా ఉంటే.. ఇప్పుడు వలంటీర్లకు జీతాల పెంపు అంటూ చంద్రబాబు నాయుడు యూ టర్న్ తీసుకున్నారు! అదో ఉద్యోగమా, గోనె సంచులు మోయడం, ఇంట్లో మగవాళ్లు లేని సమయం చూసి తలుపులు తడుతున్నారు.. అంటూ వారిపై నిందలు వేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే ఉద్యోగులకు జీతాలు పెంపు హామీని ఇచ్చారు!
మరి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ల మాటలు విని.. వలంటీర్లపై సెటైర్లు వేసిన వారు, వారి గురించి సినిమాల్లో సైతం జోకులు పెట్టిన వాళ్లు, చంద్రబాబు- పవన్ లు అదే మాట మీద ఉంటారనుకోని.. అదో ఉద్యోగమే కాదంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వాళ్లకే ఇది అసలైన ఝలక్! పవన్, చంద్రబాబులకు ఒక విధానం, సిద్ధాంతం అంటూ ఏమీ ఉండదు! వాళ్లు ఏది పడితే.. అది మాట్లాడతారు, ఆ తర్వాత అమాంతం యూటర్న్ తీసుకుంటారు! వారిని నమ్మి గుడ్డిగా అనుసరించే వాళ్లే.. బొక్క బోర్లా పడతారు! ఇదీ వారి నైజం!
చంద్రబాబు నాయుడు తన అవసరానికి ఏ పార్టీనైనా విమర్శిస్తారు, ఆ తర్వాత ఎవరితో అయినా జత కలుస్తారు! బీజేపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, మళ్లీ బీజేపీ.. ఇదంతా చరిత్ర! కేవలం రాజకీయ పార్టీల విషయంలోనే కాదు.. ఏ విధానం విషయంలో అయినా తనది యూటర్నే అని, తను తీసుకునే యూటర్న్ లు తన ఫాలోయర్లను బొక్క బోర్లా పడేసి, ఒళ్లంతా దోక్కపోయేలా ఉంటుందని చంద్రబాబు మరోసారి నిరూపించారు! ఇక విమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారంటూ వలంటీర్లపై నిందలేసిన పవన్ వారిని ఇక ఆశానికెత్తుతూ ప్రసంగించడమే తరువాయి!