ఇదికూడా ఒక వరమేనా బాబుగారూ!

చంద్రబాబు నాయుడు అంటే పబ్లిసిటీ. పబ్లిసిటీ అంటే చంద్రబాబు! ఈ విషయం తెలుగునాట ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ ఒక్కోసారి ఆయనలోని ఈ పబ్లిసిటీ పిచ్చి పీక్స్ కు చేరుకుని పబ్లి‘పిటీ’ అయిపోతుంటుంది. Advertisement…

చంద్రబాబు నాయుడు అంటే పబ్లిసిటీ. పబ్లిసిటీ అంటే చంద్రబాబు! ఈ విషయం తెలుగునాట ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ ఒక్కోసారి ఆయనలోని ఈ పబ్లిసిటీ పిచ్చి పీక్స్ కు చేరుకుని పబ్లి‘పిటీ’ అయిపోతుంటుంది.

చాలా సాధారణంగా రొటీన్ గా జరిగిపోయే వ్యవహారాలను కూడా కొన్ని సార్లు ఆయన తాను ప్రజలకు చేస్తున్న మహోపకారం కింద బిల్డప్ ఇచ్చుకోవడం గమనిస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది. కానీ.. పాపం చంద్రబాబు నాయుడు, ప్రజలకు ప్రతి ఒక్కటీ తానే చేసినట్టుగా చెప్పుకోవాలనే తాపత్రయంలో హద్దులు తెలియకుండా ప్రవర్తిస్తుంటారు.

ఇప్పుడు కూడా అదే తరహాలో వరం ప్రకటించారు. వరద బాధిత ప్రజలకు ఇది కూడా ఒక వరమేనా బాబుగారూ అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

వరద బాధితుల విషయంలో ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తున్నది. సాయం అందించడంలో ఏవో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. గండ్లు పూడ్పించడం, వరద పోటు తర్వాత సాధారణ పరిస్థితులను పునరుద్ధరింపజేయడంలో అవసరమైన చర్యలు తీసుకునే విషయంలో అంతా బాగానే వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి నష్టానికీ జగన్మోహన్ రెడ్డి కారకుడు.. అని నిందించే తీరు మాత్రం మారలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఆయన తాజాగా ప్రకటిస్తున్న వరాన్ని గమనించాలి.

‘వరదముంపులో దెబ్బతిన్న వాటిలో ఇన్సూరెన్స్ ఉన్న వాహనాలు అన్నింటికీ ఇన్సూరెన్స్ ఇప్పిస్తా’ అని చంద్రబాబునాయుడు చెబుతున్నారు. ఇందులో ఆయన ప్రత్యేకంగా ఒరగబెడుతున్నది ఏముంది. ఇన్సూరెన్స్ నిబంధనలను బట్టి.. అనగా, వారు తమ వాహనాలకు కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్ చేయించుకుని ఉంటే వారికి వరదల తాకిడికి జరిగిన నష్టానికి ఎటూ ఇన్సూరెన్స్ తప్పకుండా వస్తుంది. ‘బీమా చేయించుకున్న వారికి ఇప్పిస్తా’ అని చెప్పడానికి చంద్రబాబు ఏమైనా ఇన్సూరెన్సు ఏజంటా? అని జనం నవ్వుకుంటున్నారు.

ఆ మాటకొస్తే.. కార్లు ఉన్నవారు విధిగా ఇన్సూరెన్సు చేయిస్తుంటారు. చేయించకపోవడం వల్ల క్రైం అవుతుందని భయం. టూవీలర్ల యజమానులు ఇన్సూరెన్స్ విషయం అంత సీరియస్ గా పట్టించుకోరు. కొన్నప్పుడు చేస్తారే తప్ప.. తర్వాత సాధారణంగా రెన్యువల్స్ తక్కువ. చంద్రబాబు నాయుడుకు చేతనైతే ఇన్సూరెన్స్ లేని వాహనాలకు జరిగిన నష్టాన్ని ఏ విధంగా పూడుస్తామో చెప్పగలగాలి. అలాకాకుండా, ఇన్సూరెన్స్ ఉన్న వాహనాలకు ఇప్పిస్తాం అని అనడం కామెడీగా ఉన్నదని ప్రజలు అంటున్నారు.

22 Replies to “ఇదికూడా ఒక వరమేనా బాబుగారూ!”

  1. If it is natural disaster occurring naturally, Insurance companies will automatically pay. But if the disaster is man mad, they may refuse. CBN will help because he knows the real cause. There is logic in his statement.

  2. There is something called “act of God” clause on insurance documents which insurance companies use it very conveniently. ఒక్క పైసా రాదు ఇన్సూరెన్స్ నుంచి.

  3. బాబు చెప్పేది అదే, మీ మనన మిమ్మల్ని వదలకుండా, ఇన్సురంచె కంపెనీస్ మెడలు వంచి ప్రభుత్వం మధ్యవర్తిత్వం చేస్తది అని, ఏదైనా ఒక సెంట్రల్ ఆఫీస్ లో. అప్పుడు ప్రజలు వాళ్ళ ఆఫీసులు చుట్టూ తిరగకుండా వల్లే ఇంటికి వస్తారు. అలానే ఎలక్ట్రానిక్ గృహోపకరణాల రిపైర్స్ కూడా ప్రభుత్వం ఒక రేట్ ఫిక్స్ చేసి, వాళ్ళతో చేయిస్తాము అంటున్నాడు , అంటే చాల చవకగా. జగన్ ఎప్పుడన్నా ఇలా చేశాడా?

Comments are closed.