2014 పాల‌న బాబు గుర్తు చేయ‌రెందుకు?

2014 నుంచి 19 వ‌ర‌కూ త‌న పాల‌న గురించి చెప్పుకోడానికి చంద్ర‌బాబు ఇబ్బంది ప‌డుతున్నారు. ఆ ఐదేళ్ల పాల‌న అధ్వానంగా సాగింద‌ని త‌న‌కు తానే స‌ర్టిఫికెట్ ఇస్తున్నారాయ‌న‌. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గ్రామ‌స్థాయి కార్య‌క‌ర్త‌ల‌తో…

2014 నుంచి 19 వ‌ర‌కూ త‌న పాల‌న గురించి చెప్పుకోడానికి చంద్ర‌బాబు ఇబ్బంది ప‌డుతున్నారు. ఆ ఐదేళ్ల పాల‌న అధ్వానంగా సాగింద‌ని త‌న‌కు తానే స‌ర్టిఫికెట్ ఇస్తున్నారాయ‌న‌. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గ్రామ‌స్థాయి కార్య‌క‌ర్త‌ల‌తో బుధ‌వారం చంద్ర‌బాబు టెలికాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా 2047 వ‌ర‌కూ టీడీపీనే అధికారంలో వుండాల‌నే త‌న ఆకాంక్ష‌ను వెల్ల‌డించారు.

ఇదే సంద‌ర్భంలో 1995లో త‌న పాల‌న గుర్తు చేసుకోవాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు ఆయ‌న సూచించ‌డం విశేషం. ఎన్టీఆర్‌ను గ‌ద్దె దించి, అదే ఏడాదిలోనే చంద్ర‌బాబు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. 2003 వ‌ర‌కూ సీఎంగా బాబు ప‌ని చేశారు. సీఎంగా బాధ్య‌త‌లు తీసుకున్న మొద‌ట్లో అద్భుతంగా ప‌ని చేసిన‌ట్టు బహుశా చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టున్నారు. అందుకే ఆయ‌న ఆ రోజుల్ని కార్య‌క‌ర్త‌ల‌కు గుర్తు చేశారు.

2014లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత విభ‌జిత ఏపీకి మొద‌టి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు రికార్డులకెక్కారు. ఐదేళ్ల పాటు అధికారాన్ని చెలాయించారు. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. కేవ‌లం 23 ఎమ్మెల్యే సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. 2014-19 మ‌ధ్య కాలంలో ప‌రిపాల‌న బాబుకే న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్ల ఆ విష‌యాన్ని గుర్తు చేయ‌లేద‌ని అనుకోవాలేమో!

ఇదిలా వుండ‌గా ఇప్ప‌టి నుంచి మ‌రో 23 ఏళ్ల పాటు టీడీపీ పాల‌నే వుండాల‌ని బాబు గ‌ట్టిగా కోరుకుంటున్నారు. స‌హ‌జంగా బాబు అధికారంలోకి రాగానే ఒక్క‌సారిగా మారిపోతార‌నే అభిప్రాయం వుంది. మ‌రెవ‌రినీ ఆయ‌న ప‌ట్టించుకోర‌ని చెబుతుంటారు. మ‌రి 23 ఏళ్లు టీడీపీనే పాల‌న‌లో వుండాలంటే ఎన్నెన్ని అద్భుతాలు చేయాల్సి వ‌స్తుందో!

5 Replies to “2014 పాల‌న బాబు గుర్తు చేయ‌రెందుకు?”

  1. ఏంటోరా చారి ఈ మధ్యన లైవ్ ఫ్రూట్స్ కన్నా, డ్రై ఫ్రూట్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది

Comments are closed.