ఎమ్బీయస్‍: జగన్ పరాజయ కారణాలు 05

జగన్ దూరం చేసుకున్న మూడు ప్రధాన కేటగిరీలు ఉన్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగులు.

జగన్ దూరం చేసుకున్న మూడు ప్రధాన కేటగిరీలు ఉన్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగులు. ఒక నిష్ఠుర సత్యం చెప్పాలంటే ఉద్యోగులు నిత్య అసంతృప్త ద్రావణాలు. ఏ ప్రభుత్వమూ వారికి రుచించదు. గతంలో అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు బాగా తక్కువగా ఉండేవి. రెండు దశాబ్దాలుగా వారికి జీతాలు, పెన్షన్లు బాగా వస్తున్నాయి. అయినా యింకా కావాలని ఘోషిస్తూ ఉంటారు. ‘ఉద్యోగులతో పేచీ పెట్టుకున్న ఏ ప్రభుత్వమైనా సరే మనజాలదు’ అని హెచ్చరిస్తూ ఉంటారు. ఓటింగు సమయంలో వీళ్లేదో గోల్‌మాల్ చేసేసి తమను ఓడించేస్తా రేమోనన్న భయంతో ప్రభుత్వాలు వాళ్ల జీతాలు పెంచుతూ పోయాయి. నిజానికి ఏ ఒక్క వర్గమూ ప్రభుత్వాన్ని కూలదోయలేదు. అనేక వర్గాల్లో అసంతృప్తి రగిలితేనే ప్రభుత్వానికి ఆయువు మూడుతుంది. కానీ ఉద్యోగస్తులు పార్టీల గెలుపోటములు తమ చేతిలోనే ఉన్నట్లు ఘీంకరిస్తూ ఉంటారు. నిజమే కాబోలనుకుని పార్టీలు వాళ్లకు ఎన్నికల వేళ అలవి కాని హామీలిస్తాయి, అధికారంలోకి వచ్చాక వాటిని తీర్చలేక ఉద్యోగుల ఆగ్రహాలను ఎదుర్కుంటూ ఉంటాయి.

ప్రభుత్వోద్యోగులందరూ అవినీతి పరులని అనడానికి లేదు. కొన్ని శాఖల్లో మాత్రమే అవినీతికి ఆస్కారం ఉంటుంది. కంప్యూటరైజేషన్ వచ్చాక వాళ్ల చుట్టూ తిరగాల్సిన అవసరం, చేతులు తడపాల్సిన అవసరం తగ్గింది. అయితే క్రమశిక్షణ విషయంలో ఉద్యోగులు ఆశించినంత మేరకు ఉండటం లేదనేది వాస్తవం. టైముకి ఆఫీసుకి రారు అని ప్రజలందరూ మొత్తుకుంటూ ఉంటారు. తెలంగాణ ఉద్యమం టైములో దానిలో ప్రధాన పాత్ర వహించిన ఉద్యోగులు ‘తెలంగాణ వస్తే మేం రోజూ ఒక గంట ఎక్కువ పని చేసి రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోతాం’ వంటి ప్రతిజ్ఞలు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక టైముకి ఆఫీసుకి రావడమే గగనమై పోయింది. ఆకస్మిక తనిఖీకి వెళ్లిన మంత్రులు తమ వెంట వచ్చిన మీడియా ముందు తలెత్తుకునే పరిస్థితి లేదు.

ఉద్యోగులు ఎన్టీయార్ అంటే మండిపడేవారు. ఆయన వాళ్లంటే చాలా చిన్నచూపు ఉండేది. వాళ్లకు కాంగ్రెసంటేనే మమకారం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తాను స్‌ట్ట్రిక్డ్ అని చూపించు కోవడానికి మీడియా ఎదుట ఉద్యోగులపై ఎగిరి పడేవాడు. సెక్రటేరియట్‌లో బయోమెట్రిక్ మిషన్ పెట్టించాడు. 2004లో చంద్రబాబు ఓటమి వార్త వినగానే సెక్రటేరియట్ ఉద్యోగులు చేసిన మొదటి పని – ఆ మెషిన్ పగలగొట్టడం! ఇదీ క్రమశిక్షణ పట్ల వారికి ఏవగింపు. గతంలో టీచర్లను చూస్తే అయ్యో పాపం బడిపంతులు అనేవారు. వాళ్ల పరిస్థితులు ఎంతలా మెరుగుపడ్డాయంటే, కొన్ని చిన్న ఊళ్లలో పోస్టింగు వస్తే వాళ్లు స్వయంగా వెళ్లకుండా, పట్టణాళ్లో ఉండి వ్యాపారాలు చేసుకుంటూ, తమ బదులు ఎవర్నో పంపించి, పని కానిచ్చేటంత! దీన్ని అరికట్టాలని వారికి బయోమెట్రిక్ ఎటెండెన్స్ పెడితే దానిపై పెద్ద రగడ.

ఇదేదో జగన్ గురించి మాత్రమే రాస్తున్నాననుకోకండి. ఉత్తర ప్రదేశ్‌లో తన బుల్‌డోజర్‌తో మహామహా వాళ్లనే గడగడలాడిస్తున్న యోగి ఆదిత్యనాథ్ కూడా యిప్పుడీ సమస్య ఎదుర్కుంటున్నాడు. ఈ జులైలో టీచర్లకు డిజిటల్ ఎటెండెన్స్ రూలు పెడితే వాళ్లు ఆందోళనకు దిగారు, మొదట యితర ప్రభుత్వోద్యోగులకు పెట్టి ఆ తర్వాత మా దగ్గరకు రా అంటూ! బిజెపి మిత్రపక్షాలు, బిజెపిలో యోగి వైరివర్గాలు తప్పు పట్టడంతో ‘అన్నీ పరిశీలించి మళ్లీ పెడతాం’ అని చెప్పుకుంటూ పది రోజుల్లో ఆ రూలు ఎత్తేయాల్సి వచ్చింది. అలా ఉంది టీచర్ల జులుం! మరి జగన్ వాళ్లు స్కూళ్లకు వచ్చి తీరాలని రూలు పెట్టడమే కాక, విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో చదువు నేర్పాలని, బైజూస్ వంటి అధునిక బోధనా పద్ధతులు, టాబ్లెట్ వంటి అధునిక ఉపకరణాలు వినియోగించాలని, విద్యార్థులను అంతర్జాతీయ పోటీలకు పంపేట్లా తర్ఫీదు చేయాలని, రూల్సు పెడితే మండదా? అందుకే కత్తి కట్టారు. ఇప్పుడు బాబు ప్రభుత్వం వచ్చాక ఒక్కోటీ ఎత్తేయిస్తున్నారు.

ఇక ఉద్యోగుల జీతాలు ఒకటో తారీక్కు యివ్వడం! అది ప్రభుత్వ ధర్మం. ఎన్నో దశాబ్దాలుగా అలా యిస్తూ వచ్చారు. అలాటిది యీ మధ్య కాలంలో దాన్ని వాయిదా వేయడమేమిటో నాకు అర్థం కావటం లేదు. ఏ పనీ చేయకుండా కాళ్లు చాపుకుని కూర్చున్న సంక్షేమ పథకాల పెన్షనర్లకు ఒకటో తారీకున ఉషోదయానికి పూర్వమే పెన్షన్ డబ్బు యింట్లో యిప్పించగలిగిన ప్రభుత్వం నెలంతా నీ కోసం చచ్చీ చెడి పని చేసిన ఉద్యోగికి జీతం యివ్వడం పది పదిహేను రోజులు ఆలస్యం చేయడంలో అర్థమేముంది? తెరాస ప్రభుత్వమూ అదే చేసింది. ఎటొచ్చీ కెసియార్ అంటే భయం చేత మీడియా దాని గురించి మాట్లాడలేదు. ఉద్యోగులకైతే జీతం వచ్చేలోపున అప్పు పుడుతుంది లెండి అనే వాదన ఉన్నా, యివ్వవలసిన చోట యివ్వకుండా తొక్కిపెట్టి, గొప్ప కోసం వేరే చోట డబ్బు పంపిణీ చేయడమేమిటి? ఇది ఉద్యోగులను చాలా మండించింది.

ఇక పాత పెన్షన్ స్కీము. 2014 ఎన్నికల సమయంలో రైతు ఋణమాఫీ గురించి, 2019 ఎన్నికల సమయంలో కాపు రిజర్వేషన్ గురించి, 2024 ఎన్నికల సమయంలో సంక్షేమ పథకాల పెంపు గురించి జగన్ ‘ఇవి నా వలన కావు’ అని స్పష్టంగా చెప్పాడు. కానీ 2019 ఎన్నికలలో రెండు మేజర్ హామీలు ఉత్తుత్తినే యిచ్చాడు. ఒకటి పాత పెన్షన్ కాగా, మరొకటి మద్యనిషేధం! ఆ రెండూ పీకకి చుట్టుకున్నాయి. వైసిపి తాము 98శాతం హామీలు నెరవేర్చామని చెప్పుకుంటూ ఉంటే, ప్రతిపక్షాలు యీ రెండిటిని ఎత్తి చూపి యాగీ చేసింది. దేశప్రజల సగటు ఆయుర్దాయం పెరిగిన కొద్దీ పెన్షన్‌ల చెల్లింపు ప్రభుత్వాలకు మోయలేని భారమై పోయింది. ఒక వ్యక్తి పని చేసినది 30-35 ఏళ్లయితే, ఆ తర్వాత మరో 30 ఏళ్ల పాటు యింట్లో కూర్చోబెట్టి అతనికో, అతని భార్యకో పెన్షన్ యిస్తూ పోవాల్సి వచ్చింది.

ఉద్యోగులను మచ్చిక చేసుకోవాలనో, వాళ్లంటే భయం చేతనో ప్రభుత్వాలు పెన్షన్లను పెంచుతూ పోయాయి. చెమటోడ్చి పని చేసినప్పుడు వచ్చిన జీతం కంటె, జోగుతూ కూర్చున్నప్పుడు వచ్చే పెన్షన్ నాలుగు రెట్లు ఉంటోంది. పైగా యిదంతా అన్‌ప్రొడక్టివ్. ఆ డబ్బును యువత కోసం మళ్లిస్తే వాళ్లు ఉపాధి అవకాశాలు ఏర్పరచుకుంటారు. పొట్ట చేత్తో పట్టుకుని, విదేశాలకు పోకుండా ఉంటారు. ఇవన్నీ ఆలోచించి, వాజపేయి కాలం నాటి ఎన్డీఏ ప్రభుత్వం అప్పటి పెన్షన్ స్కీము ఎత్తివేసి కొత్త స్కీము ప్రవేశ పెట్టింది. తర్వాత వచ్చిన యుపిఏ ప్రభుత్వం కూడా దాన్ని సమర్థించింది. ఇప్పుడు మోదీ హయాంలోని ఎన్డీఏ కూడా దృఢనిశ్చయంతో దాన్ని అమలు చేస్తోంది.

కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు అధికారంలోకి రావడానికై ఉద్యోగుల మద్దతు కూడగట్టడానికి పాత పెన్షన్ హామీ యిచ్చి, దాన్ని అమలు చేయదలచుకుంటే అవరోధాలు కల్పిస్తోంది. అధికారాలన్నీ కేంద్రం చేతిలో కేంద్రీకృతమైన యీ రోజుల్లో ఆర్థిక వ్యవహారాల్లో వారి విధానాన్ని ఎదిరించి, వ్యవహరించడం ఎంత రిస్కు! ఇది తెలిసి కూడా జగన్ పాత పెన్షన్ స్కీము యిస్తానని హామీ యివ్వడమంటే కావాలని దగా చేయడమే! అసలు ఆంధ్ర ఉద్యోగులను ఆకట్టుకోవాలని చూడడమే ఒక పెద్ద పొరపాటు. వాళ్లెప్పుడూ జగన్ పక్షాన లేరు. చంద్రబాబు మీడియా జగన్‌ను మొదటి నుంచీ ఫ్యాక్షనిస్టుగా, హంతకుడిగా, అవినీతిపరుడిగా ప్రొజెక్ట్ చేసి, మధ్యతరగతి వారిని అతని పట్ల విముఖంగా చేసింది. ఉద్యోగుల్లో చాలామంది మధ్యతరగతి వారు, టిడిపి సానుభూతిపరులు. 2014లో చాలామంది టిడిపికే ఓటేసి ఉంటారని ఊహించవచ్చు.

ఇక 2014-19 మధ్య చంద్రబాబు ఉద్యోగులకు చాలా వరాలిచ్చేశాడు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించినందుకు కానుకగా కెసియార్ ఉద్యోగులకు విపరీతంగా జీతాలు పెంచితే, బాబు దానికి మించి పెంచాడు. దానికి లాజిక్ ఉందా? వీళ్లేమైనా ఉద్యమం చేశారా? రోడ్లెక్కారా? సమైక్య ఉద్యమం అనేది ఓ ప్రహసనం. దాని వలన వీళ్లు నష్టపోయిందీ లేదు, సాధించినదీ లేదు. కొత్త రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏమీ బాగా లేదని తెలిసీ, మనందరికి తెలియచెప్పుతూ కూడా బాబు, ‘ఉద్యోగులకు ప్రతికూలుడు’ అని గతంలో తనపై పడిన ముద్ర చెరిపేసుకోవాలని జీతాలు మరింత పెంచాడు. ఆ తర్వాత ఓటుకు నోటు కేసు వచ్చింది. రాత్రికి రాత్రి హైదరాబాదు నుంచి జండా ఎత్తేసి రావలసి వచ్చింది. ‘కనీసం పదేళ్లపాటు హైదరాబాదులోనే కాలక్షేపం అయిపోతుంది, అప్పటికి రిటైరవుదాం, లేదా వాలంటరీ తీసుకుందాం’ అని కులాసాగా ఉన్న సెక్రటేరియట్ ఉద్యోగులను అమరావతికి తీసుకు రావడానికి నానా రకాల తాయిలాలూ యివ్వాల్సి వచ్చింది.

వారానికి రెండు రోజుల సెలవులు, వీక్ డేస్‌లో ఆలస్యంగా రావచ్చు, త్వరగా పోవచ్చు, ప్రత్యేక రైళ్లు, యిళ్ల స్థలాలు.. ఒకటా రెండా? వాళ్లని యింటి అల్లుళ్ల కంటె ఎక్కువగా చూసుకున్నాడు. అలాటి వాళ్లు సహజంగానే బాబు పట్ల ఆదరంగా ఉంటారు. వీళ్లను ఆకట్టుకోవాలని జగన్ సాధ్యం కాని హామీని వాళ్ల కళ్ల ముందు ఆడించాడు. అది మోసపూరితమైనదే. అయినా ఉద్యోగుల్లో చాలామంది టిడిపికే ఓటేసి ఉంటారు, అందుకే టిడిపికి 39శాతం ఓట్లు వచ్చాయి. ఎన్నికల తర్వాత యీ హామీ సంగతేమిటని జగన్‌ను నిలదీశారు ఉద్యోగులు. నానా తంటాలు పడి, పాత కొత్తల మధ్య జిపిఎస్ (గ్యారంటీడ్ పెన్షన్ సిస్టమ్) అని పెట్టారు.

దీనిపై కేంద్రం ధోరణి స్పష్టంగా తెలుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అది రీజనబుల్ అని మనకు తోచవచ్చు కానీ, ఉద్యోగులకు అలా తోచలేదు. మాట తప్పినందుకు జగన్‌కు శిక్ష వేశారు. ఇప్పుడు బాబు వాళ్లకు పాత పెన్షన్ ఎలాగూ యివ్వబోయేది లేదు, యిస్తానని చెప్పనూ లేదు. అయినా వారు కూటమికే ఓటేశారు. ఏం చేసినా తన పక్షాన నిలవని వర్గాన్ని ఆకట్టుకోవడానికి అబద్ధపు హామీ యివ్వడం మొదటి తప్పు కాగా, అధికారం చిక్కాక ‘మీతో నాకు పనేముంది, నా ఓటు బ్యాంకు నాకుంది’ అన్నట్లు వ్యవహరించడం రెండో తప్పు. ఈ ఉద్యోగి వర్గాలు తమ ఓట్ల ద్వారా చేసే చెఱుపు కంటె ప్రచారం ద్వారా చేసే చెఱుపు ఎక్కువ. ఎందుకంటే అవి ‘వోకల్ సెక్షన్స్’. నోరు పెట్టుకుని యాగీ చేయగలవు, తటస్థులను ప్రభావితం చేయగలవు. జగన్ నమ్ముకున్న, జగన్‌ని నమ్ముకున్న వర్గాలు నోరు లేనివి. అందుకే ‘జగన్‌ది సైలెంట్ ఓటు’ అని కొందరు విశ్లేషించారు. అది ఎంతో ఫలితాల తర్వాత తెలిసింది. గెలుపుకి అది చాలదనీ తెలిసింది.

ఇక ఉద్యోగుల డిఏ బకాయిలు, వారిలో పెన్షనర్ల పెన్షన్ బకాయిలు – యిదంతా పెద్ద చేట భారతం. దానికి ఎప్పటికీ ముగింపు ఉండదు. బాబు హయాంలోనూ డిఏ బకాయిలున్నాయి, జగన్ హయాంలోనూ ఉన్నాయి, మళ్లీ బాబు హయాంలోనూ ఉంటాయి. ఎవడూ దాన్ని పరిష్కరించడు. నేను స్టేటు బ్యాంక్ పెన్షనర్ని. మా బకాయిలూ దశాబ్దాలుగా పెండింగులో ఉన్నాయి. ఉద్యోగంలో ఉండగా ఇంక్రిమెంటు ఆలస్యమైతే ఓర్చుకుంటాం, పోన్లే వచ్చే ఏడాది వస్తుందని. పెన్షనర్ అయ్యాక ‘వచ్చే ఏడాదికి పెన్షన్ బకాయి వచ్చేపాటికి మనం ఉంటామో, ఊడతామో తెలియదు’ అనే భయం కలుగుతూంటుంది. వృద్ధాప్యంలో వైద్య అవసరాలకు ఉపయోగపడ వలసిన డబ్బు, అంత్యక్రియలకు ఉపయోగపడితే ఎలా?

రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లతో పోలిస్తే బ్యాంకు పెన్షన్లు చాలా తక్కువ. పైగా రాష్ట్రాల వద్ద డబ్బు లేదు. స్టేటు బ్యాంకు వద్ద పుష్కలంగా డబ్బుంది. అయినా యివ్వరు. స్టేటు బ్యాంకే కాదు, అన్ని బ్యాంకుల పెన్షనర్లదీ యిదే గతి. ఇప్పుడు ఆంధ్ర పెన్షనర్లకు బాబు ప్రభుత్వమైనా న్యాయం చేస్తుందా అనేది నాకు సందేహమే! బాబు చేసినా చేయకపోయినా, ఉద్యోగులు మొదట జగన్‌ను శిక్షిద్దామనుకున్నారు, శిక్షించారు. ఎందుకంటే తమకు ఓ పక్క జీతం బకాయిలివ్వకుండా, మరో పక్క బటన్ నొక్కి లక్షల కోట్లు అవతలివాళ్లకు యిచ్చేశా అంటూ ప్రతీ ఉపన్యాసంలో గుర్తు చేస్తూ ఉంటే మండింది. నిధులు తక్కువగా ఉంటే తలా కాస్తా పంచి, అందరికీ సమాన క్షవరం చేయాలి తప్ప ఒక వర్గానికి పూర్తిగా గుండు గీసేస్తే ఎలా?

ఉద్యోగుల పట్ల బాబు ప్రవర్తనకు, జగన్ ప్రవర్తనకు తేడా ఉంది. బాబు ఉద్యోగులకు సౌకర్యాలు ఓ మేరకు కల్పించినా తన చండశాసనమ్ముండావాణ్నని చూపించుకోవడానికి వారిపై పబ్లిగ్గా రంకెలు వేస్తూ ఉంటారు. జగన్ అలాటిది చేయలేదు, అలా అని దగ్గరకూ తీయలేదు, వీళ్లతో ఏ యింటరాక్షనూ పెట్టుకోలేదు. ఉద్యోగులు తమ గోడు ఏదైనా ఉంటే కమిటీ సభ్యులతో చెప్పుకోవాల్సిందే తప్ప వాళ్లతో పర్షనల్ టచ్ పెట్టుకోలేదు. మీతో నాకేం పని? అన్నట్లున్నాడు. ఇక పై స్థాయిలో అయితే అధికారుల్లో తన కోటరీకే పనులన్నీ అప్పచెప్పి, హయరార్కీని చెడగొట్టి, బ్యూరాక్రసీ మొరేల్‌ను నాశనం చేశాడు. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం గారిని అవమానించి పంపిన తీరు గురించి‘‘జగన్ తప్పటడుగు’’ పేర 2019 నవంబరులో నేను రాసిన వ్యాసం చూడగోర్తాను.

జగన్ ఆర్థిక అరాచకత్వం గురించి, దాన్ని ప్రతిఘటించిన అధికారుల పట్ల అతని అసహనం గురించి కూడా దానిలోనే రాశాను. సిఎంఓ ఆఫీసులో కొందర్ని పెట్టుకుని, వాళ్ల ద్వారా చీఫ్ సెక్రటరీనే నిర్లక్ష్యం చేసే, బదిలీ చేసే పద్ధతి చూశాక, సీనియర్లందరికీ అర్థమై పోయింది. ‘మంచి చెప్తే యితనికి తలకెక్కదు. జీ హుజూర్ అన్నవాళ్లే కావాలి.’ అని. దానికి సిద్ధపడిన వాళ్లు అక్కడ చేరారు. సిద్ధపడని వాళ్లు దూరమై పోయారు. అప్పట్లో ప్రవీణ్ ప్రకాశ్ పేరే ప్రముఖంగా వినబడింది. ఇటీవల ధనుంజయ రెడ్డినే విలన్‌గా చూపిస్తున్నారు. ఎవర్నీ జగన్‌ను కలవనిచ్చేవాడు కాదనీ, ఏ అప్లికేషన్ యిచ్చినా రేపుమాపు అంటూ ఏళ్ల తరబడి తిప్పేవాడని, అతని దగ్గర గుట్టలుగుట్టలుగా ఫైళ్లు పడి వుండేవనీ.. యిలా జగన్ ఓటమికి అతనే కారణం అనే ధోరణిలో చెప్తున్నారు.

దీనికి తోడు అతను కన్ఫర్డ్ ఐఏఎస్ కాబట్టి రెగ్యురల్ ఐఏఎస్‌లపై అసూయతో వాళ్లందర్నీ గంటల తరబడి నిలబెట్టేవాడని కూడా ఎవరో అన్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా, ఎమ్మెల్యేలను మాత్రం కూర్చోబెట్టేవాడని చాలామంది చెప్పారు. జగన్‌ను కలిసి వస్తామని నియోజకవర్గాల్లో చెప్పుకుని వచ్చిన వారందరికీ దక్కేది నిరంజన దర్శనం మాత్రమేట. తిరుపతిలో జయవిజయుల వాకిలి దగ్గర్నుంచే తిప్పి పంపేసినా స్వామి వారు కాస్తయినా ఆనతారు. ఇక్కడ అదీ లేదు! ధనంజయ్ వద్ద పని పెండింగు పడడంలో ఆశ్చర్యమేముంది? అన్ని ఫైళ్లూ అతనికే పంపిస్తే! అన్నారు కొందరు. వాటితో పాటు రాజకీయ వ్యవహారాలు కూడా అతనే చూసేవాడు అన్నాడు వైసిపిలోంచి బయటకు వచ్చేసిన ఎమ్మెల్యే. ఏ ఫైలూ కదలకుండా, ఏ నిధులూ విడుదల కాకుండా తొక్కిపెట్టిన ధనంజయే పాపాల భైరవుడు అని యిప్పుడు ప్రచారం సాగుతోంది.

కానీ ఆ భైరవుణ్ని అక్కడ కాపలాగా కూర్చోబెట్టిన మహా కాలుడు ఎవరు? జగనే కదా! సినిమా నిర్మాతలు ప్రొడక్షన్ మేనేజరు అని కాస్త మందచర్మం ఉన్నవాణ్ని పెట్టుకుంటారు. నటీనటులకు, టెక్నీషియన్లకు నిర్మాత ‘మా వాడికి చెప్పానండి, డబ్బడిగి తీసుకోండి’ అనేసి వెళ్లిపోతాడు. ప్రొడక్షన్ మేనేజరు ‘చెక్కు పాసయాక యిస్తామండి’ అంటాడు, ఎన్నాళ్లయినా అదే పాట పాడుతూంటాడు. కడుపు మండిన వాళ్లందరూ కసితీరా తిడతారు. అవి పడడానికే ప్రొ.మే. జీతం! ఇదంతా నిర్మాత ఆడే డ్రామా. నిధులు రిలీజ్ చేయండి అని సిఎం నోటిమాటగా చెప్తే సరిపోయిందా? అవెక్కడున్నాయో చూపించాలిగా! ‘అయన మంచివాడేనండి, అడగ్గానే సరే అన్నాడు. మధ్యలో యీ ధనంజయ్ ఒకడు’ అని ఎమ్మెల్యేల చేత తిట్టించడానికి కాకపోతే!

వెయిట్ చేయబెట్టడం కూడా కావాలనే చేస్తారు చాలామంది. ఓ నాలుగు గంటలు వరండాలో కూర్చోబెట్టి, తర్వాత హఠాత్తుగా దర్శనమిచ్చి ‘అయ్యో వచ్చి చాలాసేపైందా? ఎవరూ చెప్పలేదే!’ అంటూ సెక్రటరీ కేసి తిరిగి ‘ఏవయ్యా, సార్ నాకు ఎంత క్లోజో మీకు తెలియదా’ అంటూ చివాట్లు కూడా వేస్తారు. సెక్రటరీ ఓహో అనుకుని వచ్చిన వాళ్లందరినీ లోపలకి పంపించేస్తే, నాలుగు రోజుల్లో అతన్ని సిఎం పేషీ నుంచి బయటకు పంపిస్తారు. ప్రణాళికాబద్ధంగా అధినేతలు తమ చుట్టూ కట్టుకున్న దడి యిది. ఇది కార్పోరేట్లకు పనికి రావచ్చేమో కానీ ప్రజా జీవితంలో పనికి రాదని యిప్పటికైనా జగన్‌కు అర్థమైందో లేదో!

మళ్లీ సాధారణ ఉద్యోగుల వద్దకు వస్తే, యిటీవలి కాలంలో ఉద్యోగి వర్గాలను తృప్తి పరచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు నేర్చిన విద్య ఏమిటంటే, రిటైర్‌మెంట్ ఏజ్ పెంచడం. దీనిలో ఓ ట్రిక్కు ఉంది. రిటైర్మెంటు క్రమపద్ధతిలో ఏటేటా జరగకుండా ఒకే ఏడాది చాలా మందిని నియమిస్తే, వారి రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఒకే ఏడాదిలో చెల్లించడం ప్రభుత్వానికి భారమౌతుంది. దాన్ని వాయిదా వేయడానికై ప్రభుత్వాలు పదవీ విరమణ వయసును పెంచేస్తున్నాయి. 2022లో జగన్ 60 నుంచి 62కి పెంచాడు. దీనివలన వారు సంతోషించారేమో కానీ ఆ ఉద్యోగాలకై ఎదురు చూసే నిరుద్యోగులు నిరుత్సాహ పడ్డారు. ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య. ఒకే ఇంట్లో తండ్రికి మోదం, కొడుక్కి ఖేదం.

నిజానికి రిటైర్‌మెంట్ వయసుకి చేరిన ఉద్యోగి కిచ్చే జీతంతో ముగ్గురు కొత్త ఉద్యోగులను పోషించవచ్చు. కానీ ప్రభుత్వాలన్నీ వయసు పెంచే పిచ్చి పనికి పాల్పడుతున్నాయి. నిరుద్యోగులను నిరాశలో ముంచుతున్నాయి. మొన్నటి పార్లమెంటు ఎన్నికలలో ఎన్డీఏ అనుకున్నంత విజయం సాధించలేక పోవడానికి నిరుద్యోగిత ముఖ్యమైన కారణమైంది. ‘రేషన్ యిస్తున్నారు కానీ, దానికి బదులు మా అబ్బాయికి ఉద్యోగం యిస్తే ఆ రేషన్ అక్కరలేదు కదా’ అన్నారు చాలామంది. నేడు బంగ్లాదేశ్‌లో నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో ప్రధాన పాత్ర వహించారు. ఇది గుర్తెరగకుండా రాజకీయ నేతలు హామీలు గుప్పించి, వారిని మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నారు.

జగన్ జాబ్ కాలెండర్ ప్రకటించి, అమలు చేయలేక వారి కోపానికి గురైతే బాబు ఏకంగా లక్షలాది ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, వర్క్ ఫ్రమ్ హోమ్‌తో నెలకు లక్ష జీతాలు అంటూ చాలా ఊదరగొట్టారు. వీటి పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియదు. ప్రపంచంలో యువత శాతం అత్యధికంగా ఉన్న దేశం మనది అంటారు. కానీ ఏం లాభం? మనం చదువుకున్న కూలీలను తయారు చేసి, విదేశాలకు పంపుతున్నాం. లాభం ఆ దేశాలకు, వాళ్లను తయారు చేసే ఖర్చు మనది!

గతంలో దక్షిణాది వాళ్లు ఉద్యోగార్థం నార్త్‌కు వెళితే ఉపయోగ పడుతుందని హిందీ నేర్చుకునేవారు. ఇప్పుడు ఉత్తర, తూర్పు ప్రాంతాల నుంచి నిరుద్యోగులు, కూలీలు దక్షిణాది రాష్ట్రాలపై దండెత్తి వస్తున్నారు. వాళ్లు తక్కువ జీతానికి పని చేయడానికి సిద్ధపడడంతో స్థానికులకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. కరోనా రెండేళ్ల పాటు కుదిపేసింది. పైగా తెలంగాణకైతే పాడియావు లాటి హైదరాబాదు ఉంది. ఆంధ్రలో ఏముంది? ఓ మాదిరి ఊళ్లు, సగటు పరిశ్రమలు! అవకాశా లెక్కణ్నుంచి వస్తాయి? ఉమ్మడి రాష్ట్రంలోనూ లేవు, విడిపోయాకా లేవు, అప్పుడు యిప్పుడూ ఎప్పుడూ హైదరాబాదు రైలో, బస్సో ఎక్కడమే గతి అయింది. ఆ ఫ్రస్ట్రేషన్ ఎన్నికల ఫలితాలపై ప్రతిఫలిస్తోంది. ఇప్పుడు వాలంటీరు వ్యవస్థ ఎత్తి వేస్తే పరిస్థితి ఎలా మారుతుందో తెలియదు. సారా వ్యాపారం వంటి తక్కిన విషయాల గురించి మరో వ్యాసం రాస్తాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2024)

70 Replies to “ఎమ్బీయస్‍: జగన్ పరాజయ కారణాలు 05”

  1. దేశానికి 77 ఏళ్ళు, రాష్ట్రానికి 72 రోజులు అయ్యింది స్వతంత్రం ఒచ్చి. ఈ ఒక్క రోజు కూడా వొదిలి పెట్టరా నియంత పరిపాలన మెప్పు గురించి? ఎందరో దేశం కోసం, రాష్ట్రం కోసం త్యాగం చేసిన వాళ్ళు గుర్తు రావట్లేదా ఈ రోజు, కేవలం జగన్ నియంత గురించి తప్ప?

  2. చాన్నాళ్ళ తర్వాత వాస్తవాన్ని గ్రహించి రాశారు. సంతోషం. ఎప్పటికీ ఎడతెగని ధారావాహికలా కాకుండా తొందరగా ముగిస్తే ఇంకా సంతోషం, తెలంగాణ గురించి రాస్తానని ఇంకా రాయలేదు

  3. yekkadaa JSP gurinchi gaani Dy CM pawan gaari gurinchi gaani raayaledu …meeku kudaa pawan gurinchi matladoddani adesaalu vachayaa jagan kotarinunchi ? meeru jagan parajayam ani title pettaru kaani AP prajalu JSP – పవన్ వల్లే జగన్ కి ఈ ఘోరపరాభవం అని 75 % చెప్తున్నారు

  4. వికటిత ( ప్రకటిత) విభజన ప్రయోగానికి “పుల్ a రోప్” ఆంధ్ర ప్రజల మెడకు బిగించి ఒకవైపు ఆషాడబూతులు , మరోవైపు “భావభూతులు” ఆడుతున్నారు. ఉరి ఖాయం “గాలి” సాక్షిభూతంగా. ఈ కార్యక్రమానికి తప్పేట్లు నాల్గో స్తంభం. వర్ధిల్లండి.

  5. ప్రసాదు మరీ ప్రజలు ఎర్రిపప్పల కనిపిస్తునారా? జగన్ 98% హామీలు అమలు చేస్తే, 2% చేయని హామీల గురించి ఓట్లు వేయలేదా? ఆహా ఏమి స్వామిభక్తి!!

  6. ఇంతకీ ఇవన్నీ జగన్ చదువు తారా?

    అసలే సిఎం గా వున్నప్పుడే , వొళ్ళు బద్దకం తో ఆఫిస్ కు కూడా వెళ్లకుండా, ఇంట్లోనే ఆఫిస్ సెట్టింగ్ వేసుకున్న మహా బద్దకిస్టు.

    అసలు ఇంట్లో ముసలమ్మ లాగ కూర్చుని ఏమి చేసేవాడు 24 గంటలు, ఇప్పటికీ అర్థం కాదు.

    అవినీతితో సంపాదించిన వేల కోట్లు ఆస్తులు.. పని చేయకుండా ఒక 5 తరాలు పాటు కాలు మీద కాలు వేసుకుని జీవితం అలా మింగించచ వచ్చు.

    1. నేను రాసేది జగన్ కోసం కాదు కదా, మీరూ నేనూ మనలాటి వాళ్ల కోసం. బాబుపై రాస్తే బాబు చదువుతారా? మోదీపై రాస్తే మోదీ చదువుతారా? ట్రంప్ గురించి రాస్తే ట్రంప్ చదువుతారా?

      ప్రభుత్వ రహస్యాలు, పూర్తి గణాంకాలు, రాజకీయనాయకుల పరిచయాలు – ఏమీ లేని కామన్ మేన్‌ని నేను. నాలాటి వాళ్ల పెర్‌సెప్షన ఎలా ఉందో వీటి ద్వారా తెలుస్తుంది. పాఠకుల్లో ఎవరైనా ప్రభుత్వ పాలసీలను రూపొందించే ఉద్యోగంలో ఉంటే వారికి ఇది ఉపకరిస్తుంది.

      పైన ఉద్యోగాల గురించి మీరిచ్చిన సలహా కూడా బాబు చదివి, నాలిక కరుచుకుని ఉద్యోగులందరికీ రూల్సు మార్చేస్తారా? ఎవరైనా అధికారికి మీ ఐడియా నచ్చితే ఏదో ఒక రూపంగా ముందుకు వెళుతుంది. ఈ వ్యాసాల, వ్యాఖ్యల ప్రయోజనం ఆ మేరకే పరిమితం

      1. nenu vote veyyadaniki maa ooriki 10 days munde vella. Almost 3-4 districts cover chesaa. akkade ardham ayyindi janalaki ***YCP*** prabhutvam meeda yenta kasi vundo ani … idi janallo vunna kasi…kopam..bhayam toh vachhina vutpaatam .. anta easy kaaadu … aidellu kallu moosukunteno orchukunteno … pratipaksha hoda dakkochhemo .. adhikaaram anta easy kaadu .. yendukante jarigina anyaayalu ..akramaalu ala vunnayi

      2. nenu vote veyyadaniki maa ooriki election 10 days munde vella. Almost 3-4 districts cover chesaa. akkade ardham ayyindi janalaki ***YCP*** prabhutvam meeda yenta kasi vundo ani … idi janallo vunna kasi…kopam..bhayam toh vachhina vutpaatam .. anta easy kaaadu … aidellu kallu moosukunteno orchukunteno … ***pratipaksha**** hoda dakkochhemo .. adhikaaram anta easy kaadu .. yendukante jarigina anyaayalu ..akramaalu ala vunnayi

      3. nenu ***vote**** veyyadaniki maa ooriki ***election**** 10 days munde vella. Almost 3-4 districts cover chesaa. akkade ardham ayyindi janalaki ***YCP*** prabhutvam meeda yenta kasi vundo ani … idi janallo vunna kasi…kopam..bhayam toh vachhina vutpaatam .. anta easy kaaadu … aidellu kallu moosukunteno orchukunteno … ***pratipaksha**** hoda dakkochhemo .. adhikaaram anta easy kaadu .. yendukante jarigina anyaayalu ..akramaalu ala vunnayi

      4. nenu ***vote**** v’eyyadaniki maa ooriki ***election**** 10 days m’unde v’ella. Almost 3-4 districts c’over c’hesaa. akk’ade ar’dham ay’yindi j’analaki ***Y’CP***prabhutvam*** meeda yenta k’asi vundo ani … idi janallo vunna k’asi…k’opam..b’hayam toh vachhina vu’tpaatam .. anta easy kaaadu … aidellu k’allu m’oosukunteno v’orchukunteno … ***pratipaksha**** hoda dakkochhemo .. adhikaaram anta easy kaadu .. yendukante jarigina anyaayalu ..akramaalu ala vunnayi

      5. జగన్ గురించి రాస్తే మీకు లాభం, రాష్ట్ర అభివృద్ధి కోసం రాస్తే ప్రజలకు లాభం.

      6. Sir,

        మీరు చక్కని విశ్లేషణలు ఇస్తున్నారు ఇప్పుడు. ఎన్నికల ముందర జగన్ మీద ఇలాంటి ఆర్టికల్స్ కావాలని ఎన్ని అడిగినా మీరు చంద్రబాబు మీద విమర్శలు మాత్రమే చేసేవారు. ఇలాంటివి జగన్ మీద వ్రాసి ఉంటె కొంచెం అయినా జాగ్రత్త పది ఉండేవారేమో. కానీ ఆయన వ్యవహార శైలి ౨౦౧౯ వరకు ఒకలాగా, అధికారం రాగానే వేరేలాగ మారిపోయింది. మొత్తానికి ఆ వ్యవహార శైలి ఆయనకి చేటు తెచ్చింది. జగన్ నేను వచ్చింది వచ్చినట్టు పంచిపెట్టేస్తా ఒక సెక్షన్ ఓట్లు నాకే గారంటీ, మిగిలిన ఓట్లు ఎంతో కొంత 50% నా వేపే ఉంటారు, ఆపై ఎన్ని వస్తే అన్ని బోనస్; ఇవన్నీ కూడితే ఖఛ్చితంగా నాదే విజయం అని అనుకుని జనాలతో మమైకం అవ్వకుండా బద్ధకించారు. దానికి తోడు కాస్త ఎవరైనా సహాయం అడిగి అడిగి విసిగి వేసారి కాస్త గట్టిగా అడిగితే, తెలిసిన వాళ్ళని కూడా “ఏమిటీ నువ్వు పచ్చ బ్యాచ్ లో కలిసిపోయావా!” అని సజ్జల లాంటి వాళ్ళు బెదిరించడం! ఇలాంటివి చాలా ఉన్నాయి, వ్యతిరేకత రావడానికి.

        1. ఇలాంటివి జగన్ మీద వ్రాసి ఉంటె కొంచెం అయినా జాగ్రత్త పది ఉండేవారేమో – మీరు ఏ లోకంలో ఉన్నారు స్వామీ? మనం రాసేవి వాళ్లు చదివి మారిపోతారా? అలాటి భ్రమలు వదలండి. నేను జగన్ పాలన పక్షపాతంతో నడుస్తోందనే రాస్తూ వచ్చాను. పాతవి తిరగేయండి. విద్య, వైద్యం వంటి విషయాల్లో పెట్టిన స్కీములను మెచ్చుకున్నాను. బాబు మీద కూడా విమర్శలు చేశాను. నచ్చనప్పుడు నచ్చలేదని చెప్పాను.

  7. మిలటరీ ,పోలీసు వైద్య ఉద్యోగాలు తప్ప,

    మిగతా అసలు ప్రభుత్వ ఉద్యోగాలు రద్దు చేసి, ప్రతి 5 ఏళ్ళకి ప్రతి ఉద్యోగీ స్కిల్స్ ప్రూవ్ చేసుకుని, ఆ ప్రాంత జనాల ఆన్లైన్ ఓటింగ్ పెట్టీ, అన్ని రకాలుగా బాగా వింటేనే జాబ్ రెన్యువల్ అని పెడితే ఎలా వుంటది?

    ప్రతి ఉద్యోగం కూడా జీవితం మొత్తం అని గ్యారెంటీ వుండకూడదు.కేవలం జాబ్ కి తగ్గ పని చేస్తేనే , జాబ్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఆ జాబ్ క్యూ లో వున్న నిరుద్యోగి కి వెళుతుంది అని మారిస్తే , సామిరంగా , ఇండియా ఒక్క పది ఏళ్ల లో అమెరికా నీ మించి పోతుంది, అందరూ వొళ్ళు వంచి పని చేస్తారు కాబట్టి.

  8. నీతి, నిజాయితీ, నిబద్ధత, నిస్వార్థత, నిరాడంబరతతో కూడిన వ్యక్తిత్వంతో మరియు సామాజిక స్పృహ మరియు గొప్ప పరిజ్ఞానంతో పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి ఎవ్వరూ ఊహించని విధంగా ఒక ప్రజావ్యక్తిగా, మహాశక్తిగా ఎదిగిపోతున్నారు…

    జగన్ గారికి ప్రజలు 151 ఎమ్మెల్యేల బలంతో అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు.. కానీ జగన్ గారు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు.. అహంకారం మరియు సొంత అభిమాన భావంతో అధికారాన్ని దుర్వినియోగం చేశారు… వ్యవస్థను నిర్వీర్యం చేశారు…..

    నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతకాలం జగన్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమే….

  9. ఉద్యోగస్తులకు సకాలం లో జీతాలు ఇవ్వకపోవడం, బటన్స్ నొక్కి టైం కి పథకాలకు డబ్బు ఇవ్వడం, వేల కోట్ల తో స్కూల్ బిల్డింగ్స్ రంగులు వెయ్యడం, పిల్లలలకు ట్యాబు లాంటి అనవసరపు ఆర్భాటాలు చెయ్యటం, పెన్షన్ విషయం లో వెనక్కు వెళ్లడం, పదవి విరమణ పొడిగించి వాళ్లకు రావాల్సిన డబ్బు ఇంకో రెండేళ్లు నెట్టడం ఇవన్నీ జగన్ టీచర్లు లకు చేసిన మోసాలలోకే వస్తాయి. పోనీ ఇది పిల్లల మీద ప్రేమ తో చేశాడా అంటే కాదు, టీచర్స్ లేక వాళ్ళు ఇబ్బంది పడ్డారు, టీచర్లు మీద ద్వేషం తో చేశాడా, చిన్నప్పుడు ఎమన్నా బెత్తం దెబ్బలు కొట్టారని? అయ్యుండొచ్చు. ఏది ఏమైనా వాళ్లకు జగన్ మీద కోపం రావటానికి బాబు కారణం కాదు, జగనే.

    ఇంకా టీచర్స్ ఉత్పాదక పెంచే మార్గాలు లేకపోలేదు. వాళ్ళను రోజు స్కూల్స్ కి రప్పించాలి అది హెడ్ మాస్టర్ పని, లేకపోతే సస్పెండ్ చెయ్యొచ్చు. ఇంకా నెంబర్ అఫ్ టీచింగ్ హౌర్స్ పెర్ డే, నెంబర్ అఫ్ స్టూడెంట్స్ పెర్ టీచర్ లాంటి కొన్ని కీ ఇండికేటర్స్ పెట్టి ప్రక్షాళన చేసే మార్గాలు లేకపోలేదు. టాయిలెట్స్ క్లీన్ చేయించి కసి తీర్చుకున్నాడు.

  10. బాబుగారు 2014 లో ఉద్యోగులకు జీతాలు అమితంగా పెంచడానికి కారణం ఆ పద్దు అంత కేంద్రం ఖాతాలోకి పోతుంది కాబట్టి 5 ఏళ్లు లోటు బడ్జెట్ భారం కేంద్రానిదే కాబట్టి

  11. ఈయన కారణాలు 05 నుంది 10 రాసినా అతి ముక్యమైన జగన్ నియంత పాలన, జగన్ ఈర్ష దెషాలు, తుగ్లక్ నిర్ణయాలు, వొట్ల కొసం ఆర్ధిక విద్వంసం, ప్రచార పిచ్చి, వ్యవస్తలను నాశనం చెయటం గురించి పెద్దగా రాయడు. బొహిశా ఇవి చిన్నవి చెసి చూపించటం కష్టం అయి ఉండవచ్చు. ఒక వేల ఎక్కడన్నా కొంచం రాసినా జగన్ ని తమలపాకుతొ కొడుతూ, చంద్రబాబు ని తలుపు చెక్కతొ కొట్టటం. నెను హెడ్డింగ్ చూసాక చదవటం కూడా మనెసా.

  12. ఈయన కారణాలు 05 నుంది 10 రాసినా అతి ముక్యమైన జగన్ నియంత పాలన, జగన్ ఈర్ష దెషాలు, తు.-.గ్ల.-.క్ నిర్ణయాలు, వొట్ల కొసం ఆర్ధిక విద్వంసం, ప్రచార పిచ్చి, వ్యవస్తలను నాశనం చెయటం గురించి పెద్దగా రాయడు. బొహిశా ఇవి చిన్నవి చెసి చూపించటం కష్టం అయి ఉండవచ్చు. ఒక వేల ఎక్కడన్నా కొంచం రాసినా జగన్ ని తమలపాకుతొ కొడుతూ, చంద్రబాబు ని తలుపు చెక్కతొ కొట్టటం. నెను హెడ్డింగ్ చూసాక చదవటం కూడా మనెసా.

  13. “2019 లో రెండు మేజర్ హామీలు ఉత్తుత్తినే ఇచ్చాడు “

    అవునా సారూ? ఎంత దగా.. అప్పుడు మీరు రాయలేదే

  14. ఈయన బాద వర్ణనాతీతం.. ఉద్యోగులే కాదు ప్రజలందరు మూకుమ్మడి గా దందెట్టి వొట్లు వేసారు…కర్ర విరక్కుండా పాము చావకుండా రాసారు…

    టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఈయన లంకించి రాస్తారు….

    డబ్బు తీసుకుని రాసే అప్పుడు ఆపాటి బెనుకు చెనుకు పాటించాలి తప్పదు

  15. ప్రపంచంలో యువత శాతం అత్యధికంగా ఉన్న దేశం మనది అంటారు. 
    కానీ ఏం లాభం? మనం చదువుకున్న కూలీలను తయారు చేసి, విదేశాలకు పంపుతున్నాం.
    లాభం ఆ దేశాలకు, వాళ్లను తయారు చేసే ఖర్చు మనది!

    English medium chadhuvulu, TOEFL exam ki sikhshana viti venaka mukhya vuddhesam idhe kadha…?

  16. ఈయన జగన్ పరాజయ కారణాలు 05 నుండి 10 రాసినా… అతి ముక్యమైన కారణాలు

    నియంత పాలన,

    జగన్ ఈర్ష దెషాలు,

    తు.-.గ్ల.-.క్ నిర్ణయాలు,

    వొట్ల కొసం ఆర్ధిక విద్వంసం,

    ప్రచార పిచ్చి,

    వ్యవస్తలను నాశనం చెయటం,

    బులుగు మీడియా అతి,

    లంటి వాటి గురించి పెద్దగా రాయడు. బొహిశా ఇవి చిన్నవి గా చెసి చూపించటం కష్టం అయి ఉండవచ్చు. ఒక వేల ఎక్కడన్నా కొంచం రాసినా జగన్ ని తమలపాకుతొ కొడుతూ, చంద్రబాబు ని తలుపు చెక్కతొ కొట్టటం మామూలె.

    .

    నెను ఈ హెడ్డింగ్ చూసాక చదవటం కూడా మనెసా.

    1. ఆర్టికల్ చదవకుండా పెట్టే కామెంటు ఉంచవలసిన పనేముంది?ఆర్టికల్ లో ఉన్న విషయం గురించి చర్చిస్తేనే వ్యాఖ్యకు అర్థముంటుంది.

  17. Namasthe. First of all, let me be thankful to you, for I used a couple of your Ghantasala/Balu articles in 2006 on my web site and I have been a regular follower of your film related articles.

    Coming back to the point, we have had a samvaadam a few months ago (prior to AP Elections) on a topic of Unity among Kaapu people. You had quoted that Kaapulu were always known to be split and could never be united and you challenged me that the same thing would happen again in these 2024 Elections too. I did mention that things have rapidly been changing in the Kaapu Community and they are exponentially growing up in all potential areas. But with your limited knowledge about Kaapu community, you are not able to conceive all those changes happening in the Kaapu community.

    In your earlier article #2 (Reasons for Jagan’s Fiasco), you wrote about caste equations and concluded with a single reason that Jagan had messed up with Kammas and hence Jagan lost in elections! But you didnot even mention a line about the Kaapu community’s unity (numerically, it is around 16% and the most influential community in Elections). This time, the whole Kaapu community unanimously rallied behind Pawan Kalyan regardless of how many cunning ploys played by the YSRCP to split up the community’s unity.This time, Pawan Kalyan played a perfect strategy to align with Babu, whom he reveres a lot and the whole community understood his mindset as it was a perfect strategy to go along with Kammas to share power this time!! Reddys/Kammas have such a strong foundation in politics that Kaapulu have to go along with one of the these communities to get in to power. Until now, Kaapulu, along with all other BC’s & SC/ST’s, were just being used by both these castes and I am glad to see that Kaapulu have done a right thing to get to a stage of power-sharing! I see that Kaapu comminity is slowly getting financially stronger.. it is not an easy task to topple down two ensconced castes to grab power.. but they will certainly do it in next 10 years!

    [To continue in next message]

  18. [continues from the previous message]

    One more thing you wrote is that Reddys also didnot vote for Jagan, as they felt that they didnot get benefited by Jagan. In either Reddy or Kamma governments, only affluent business people get much more richer, while the normal Reddy/Kamma people would hardly get benefited!! It is an open secret that the opportunistic political/business based Reddys/Kammas pipperment nu chapparinchinaTTu chapparinchaaru during their tenures. The next generation Reddy/Kamma folks will most likely be confined to business like Sindhi/Farsis (who don’t have any political control)!

    In your 2nd article of Caste analysis, you kept on talking about only Kamma/Reddy castes and carefully avoided writing about the upheaval emergence of Kaapu community’s raajakeeya chaitanyam. I am not sure if you were compelled to confine to give the whole credit of Jagan’s fiaso only to Kamma commnity by underplaying the Kaapul community or not!

    1. I do not delete the posts if they discuss the topic on hand. I delete only those who comment on me personally. Let the debate be academic in nature, that is what I want. I do not remember to have deleted any of your comments.

  19. Part 1

    =====

    Namasthe. First of all, let me be thankful to you, for I used a couple of your Ghantasala/Balu articles in 2006 on my ChimataMusic.com web site and I have been a regular follower of your film related articles.

    Coming back to the point, we have had a samvaadam a few months ago (prior to AP Elections) on a topic of Unity among Kaapu people. You had quoted that Kaapulu were always known to be split and could never be united and you challenged me that the same thing would happen again in these 2024 Elections too. I did mention that things have rapidly been changing in the Kaapu Community and they are exponentially growing up in all potential areas. But with your limited knowledge about Kaapu community, you are not able to conceive all those changes happening in the Kaapu community.

    In your earlier article #2 (Reasons for Jagan’s Fiasco), you wrote about caste equations and concluded with a single reason that Jagan had messed up with Kammas and hence Jagan lost in elections! But you didnot even mention a line about the Kaapu community’s unity (numerically, it is around 16% and the most influential community in Elections). This time, the whole Kaapu community unanimously rallied behind Pawan Kalyan regardless of how many cunning ploys played by the YSRCP to split up the community’s unity.This time, Pawan Kalyan played a perfect strategy to align with Babu, whom he reveres a lot and the whole community understood his mindset as it was a perfect strategy to go along with Kammas to share power this time!! Reddys/Kammas have such a strong foundation in politics that Kaapulu have to go along with one of the these communities to get in to power. Until now, Kaapulu, along with all other BC’s & SC/ST’s, were just being used by both these castes and I am glad to see that Kaapulu have done a right thing to get to a stage of power-sharing! I see that Kaapu comminity is slowly getting financially stronger.. it is not an easy task to topple down two ensconced castes to grab power.. but they will certainly do it in next 10 years!

  20. Part 1

    ========

    Namasthe. First of all, let me be thankful to you, for I used a couple of your Ghantasala/Balu articles in 2006 on my ChimataMusic.com web site and I have been a regular follower of your film related articles.

    Coming back to the point, we have had a samvaadam a few months ago (prior to AP Elections) on a topic of Unity among Kaapu people. You had quoted that Kaapulu were always known to be split and could never be united and you challenged me that the same thing would happen again in these 2024 Elections too. I did mention that things have rapidly been changing in the Kaapu Community and they are exponentially growing up in all potential areas. But with your limited knowledge about Kaapu community, you are not able to conceive all those changes happening in the Kaapu community.

  21. Part 2:

    =====

    In your earlier article #2 (Reasons for Jagan’s Fiasco), you wrote about caste equations and concluded with a single reason that Jagan had messed up with Kammas and hence Jagan lost in elections! But you didnot even mention a line about the Kaapu community’s unity (numerically, it is around 16% and the most influential community in Elections). This time, the whole Kaapu community unanimously rallied behind Pawan Kalyan regardless of how many cunning ploys played by the YSRCP to split up the community’s unity.This time, Pawan Kalyan played a perfect strategy to align with Babu, whom he reveres a lot and the whole community understood his mindset as it was a perfect strategy to go along with Kammas to share power this time!! Reddys/Kammas have such a strong foundation in politics that Kaapulu have to go along with one of the these communities to get in to power. Until now, Kaapulu, along with all other BC’s & SC/ST’s, were just being used by both these castes and I am glad to see that Kaapulu have done a right thing to get to a stage of power-sharing! I see that Kaapu comminity is slowly getting financially stronger.. it is not an easy task to topple down two ensconced castes to grab power.. but they will certainly do it in next 10 years!

  22. Part 3:

    =======

    One more thing you wrote is that Reddys also didnot vote for Jagan, as they felt that they didnot get benefited by Jagan. In either Reddy or Kamma governments, only affluent business people get much more richer, while the normal Reddy/Kamma people would hardly get benefited!! It is an open secret that the opportunistic political/business based Reddys/Kammas pipperment nu chapparinchinaTTu chapparinchaaru during their tenures. The next generation Reddy/Kamma folks will most likely be confined to business like Sindhi/Farsis (who don’t have any political control)!

    In your 2nd article of Caste analysis, you kept on talking about only Kamma/Reddy castes and carefully avoided writing about the upheaval emergence of Kaapu community’s raajakeeya chaitanyam. I am not sure if you were compelled to confine to give the whole credit of Jagan’s fiaso only to Kamma commnity by underplaying the Kaapul community or not!

  23. Part 1

    ====

    Prasad gaaru,

    We have had a samvaadam a few months ago (prior to AP Elections) on a topic of Unity among Kaapu people. You had quoted that Kaapulu were always known to be split and could never be united and you challenged me that the same thing would happen again in these 2024 Elections too. I did mention that things have rapidly been changing in the Kaapu Community and they are exponentially growing up in all potential areas. But with your limited knowledge about Kaapu community, you are not able to conceive all those changes happening in the Kaapu community.

    1. you challenged me that the same thing would happen again in these 2024 Elections too. – I never challenge anyone. I remark only. Yes so far, Kapus did not vote en-masse and I said so. I always say – it remains to be seen.

      Secondly, I give credit to Kammas for being in forefront in their fight against YCP. Kapus, this time aligned with them. And a major portion of Reddys too joined them, this is what I wrote.

      I wrote about how majority of both Kapus and BCs deserted YCP and for what reasons, just as they did with CBN in 2019. Ok, my knowledge is limited. You pl enlighten me how YCP got 39% of voters, from which castes it got. Pl make a guess and share here

  24. ఇదేమన్న విశ్లేషణ? వ్యాసంలో ఎక్కడ చూసినా బాబు దుష్ప్రచారం చేసాడు, జగన్ దాన్ని తిప్పికొట్టలేకపోతాడు అనే బాధ తప్ప ప్రజలకు కాస్త ఇంగిత ఙానం ఉంటుంది. తమని ఇబ్బంది పెట్టినందుకే జగన్‌ని ఇంటికి పంపించారు అనే ఆలోచనే కనిపించడంలేదు

Comments are closed.