రాయ‌ల‌సీమ‌పై బాబుకు ఎందుకు క‌క్ష‌?

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు రాయ‌ల‌సీమ విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, ఆ ప్రాంత వాసుల్లో తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తోంది. త‌న ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న రాయ‌ల‌సీమ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ఆ ప్రాంత ర‌గిలిపోతోంద‌న్న సంగ‌తి సీఎం దృష్టికి…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు రాయ‌ల‌సీమ విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, ఆ ప్రాంత వాసుల్లో తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తోంది. త‌న ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న రాయ‌ల‌సీమ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ఆ ప్రాంత ర‌గిలిపోతోంద‌న్న సంగ‌తి సీఎం దృష్టికి వెళ్లిందో, లేదో తెలియ‌ని ప‌రిస్థితి. గ‌త ఐదు నెల‌ల్లో చంద్ర‌బాబునాయుడు సీమ‌కు 10 అన్యాయాలు చేశార‌నే బాధ ఆ ప్రాంత ప్ర‌జానీకంలో వుంది.

వెనుక‌బ‌డిన ప్రాంతమైన వైఎస్సార్ జిల్లా కొప్ప‌ర్తిలో రూ.250 కోట్ల‌తో ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తులిస్తే, రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌త సెప్టెంబ‌ర్‌లో అమ‌రావ‌తికి తీసుకెళ్లేందుకు ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే, తాజాగా క‌డ‌ప నుంచి ఆంధ్ర‌ప్ర‌గ‌తి గ్రామీణ బ్యాంక్ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని అమ‌రావ‌తికి తీసుకెళ్ల‌డానికి కూట‌మి స‌ర్కార్ ఏర్పాట్లు చేస్తుండ‌డంపై బ్యాంక్ ఉద్యోగ సంఘాలు మండిప‌డుతున్నాయి.

చంద్ర‌బాబు అధికారంలో ఉన్నారంటే, రాయ‌ల‌సీమ‌పై స‌వ‌తి త‌ల్లి ప్రేమ చూపుతార‌నే చెడ్డ‌పేరు వుంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆయ‌న పాల‌నా విధానాలు కొన‌సాగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. రాయ‌ల‌సీమ‌కు కొత్త ప‌రిశ్ర‌మ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు తీసుకురాడానికి బ‌దులు, ఇప్ప‌టికే ఉన్న వాటిని రాజ‌ధాని ప్రాంతానికి త‌ర‌లిస్తుండ‌డాన్ని ఏ ర‌కంగా చూడాల‌నే ప్రశ్న ఎదుర‌వుతోంది. సీమ‌పై వివ‌క్ష కాదా? అని నిల‌దీస్తున్నారు.

రాయ‌ల‌సీమ వాసైన చంద్ర‌బాబునాయుడికి ఎందుకో ఆ ప్రాంతంపై మొద‌టి నుంచి చిన్న చూపే అని ఆ ప్రాంత ప్ర‌జాసంఘాలు విమ‌ర్శిస్తున్నాయి. రానున్న రోజుల్లో రాయ‌ల‌సీమ స‌మాజం ఉద్య‌మ బాట ప‌ట్టే ప‌రిస్థితిని చంద్ర‌బాబు పాల‌న తీసుకొస్తోంది. దానికి ఎంతో స‌మ‌యం ప‌ట్టేలా కూడా లేదు.

14 Replies to “రాయ‌ల‌సీమ‌పై బాబుకు ఎందుకు క‌క్ష‌?”

  1. బొల్లి గాడి మీద… నాదెండ్ల భాస్కర రావు చెప్పినట్టు.. తిరుపతి రైల్వే స్టేషన్ లో.. పిక్ పాకెట్ C@ సు కట్టినప్పటి నుండి ఇప్పటిదాకా.. రాయలసీమ అంటే.. చిన్నచూపు.. వివక్ష.. అందుకే.. రాయల సీమ కి ఇచ్చిన ప్రాజెక్ట్స్ కార్యాలయాలు.. అన్ని పట్టుకెళ్ళిపోతున్నాడు. నిధులూ కేటాయించడు.

  2. ఏంటి రగిలిపోవటమే..? చాల్లే బుల్రెడ్డి ఓడిపోయిపోంగానే రాయలసీమ బ్యానర్ బయటికి తీస్తారు..

  3. రాయలసీమకి లె1 అన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిష్ అండ్ ప్రాన్ షాప్స్ అండ్ కియోస్క్స్ లు మూతబడ్డాయా?

  4. తిట్టుకోవడం కన్నా విడిపోవటం బెటర్ విడిపోతే రాయలసీమకు కూడా రాజధాని హై కోర్ట్ వస్తాయి

Comments are closed.