రెండు, మూడు.. ద‌ర్శ‌నం క‌ల్పిస్తే అద్భుత‌మే!

టీటీడీ చైర్మ‌న్‌గా బీఆర్ నాయుడు బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత మొద‌టి స‌మావేశాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా తీసుకున్న కీల‌క నిర్ణ‌యాల్లో ఆర్టిఫిషియ‌ల ఇంటెలిజెన్స్‌ను ఉప‌యోగించి శ్రీ‌వారి ద‌ర్శ‌నాన్ని రెండు, మూడు గంట‌ల్లోనే క‌ల్పించాల‌ని…

టీటీడీ చైర్మ‌న్‌గా బీఆర్ నాయుడు బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత మొద‌టి స‌మావేశాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా తీసుకున్న కీల‌క నిర్ణ‌యాల్లో ఆర్టిఫిషియ‌ల ఇంటెలిజెన్స్‌ను ఉప‌యోగించి శ్రీ‌వారి ద‌ర్శ‌నాన్ని రెండు, మూడు గంట‌ల్లోనే క‌ల్పించాల‌ని ఆలోచించ‌డం. ఇందుకోసం నిపుణుల‌తో అధ్య‌య‌న క‌మిటీ వేయాల‌ని టీటీడీ నూత‌న పాల‌క మండ‌లి నిర్ణ‌యించ‌డం విశేషం.

ఈ ప్ర‌య‌త్నం విజ‌య‌వంత‌మైతే అద్భ‌త‌మే. ఎందుకంటే శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి గంట‌ల త‌ర‌బ‌డి వేచి చూడాల్సిన ప‌రిస్థితి. ఒక్కోసారి రెండు, మూడు రోజులు కూడా క్యూల‌లో, క్యూ కాంప్లెక్స్‌ల‌లో నిరీక్షించాల్సి వ‌స్తోంది. చిన్న‌పిల్ల‌లుంటే, ఇక గోడు చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ నేప‌థ్యంలో అతి త‌క్కువ స‌మ‌యంలో దైవ ద‌ర్శ‌నం జ‌ర‌గ‌డం కంటే గొప్ప విష‌యం ఏముంటుంది?

అయితే సాధ్యాసాధ్యాల‌పై విస్తృత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా త‌క్కువ స‌మ‌యంలోనే ఎలా ద‌ర్శ‌నం చేయిస్తార‌నే ప్ర‌శ్న ఆస‌క్తి రేపుతోంది. ప్ర‌తి ఒక్క‌రూ త్వ‌ర‌గా ద‌ర్శ‌నం పూర్తి చేసుకుని తిరుగు ప్ర‌యాణం కావాల‌ని అనుకుంటుంటారు. మ‌రీ ముఖ్యంగా త‌క్కువ స‌మ‌యంలోనే ద‌ర్శ‌నం జ‌రిగే ప‌రిస్థితి వుంటే, సిఫార్సు లేఖ‌ల కోసం వెంప‌ర్లాడే ప‌రిస్థితి వుండ‌దు.

నేరుగా స‌ర్వ ద‌ర్శ‌నానికే వెళ్తారు. ద‌ర్శ‌నానికి ఎక్కువ స‌మ‌యం తీసుకుంటుండడం వ‌ల్ల సిఫార్సు లేఖ‌ల కోసం వెంప‌ర్లాడే ప‌రిస్థితి. త‌క్కువ స‌మ‌యంలో ద‌ర్శ‌నం క‌ల్పిస్తే ద‌ళారుల బెడ‌ద కూడా పోతుంది. ఇలా ఎన్నో ప్ర‌యోజ‌నాలున్నాయి. టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు సార‌థ్యంలో త‌క్కువ స‌మ‌యంలో ద‌ర్శ‌నం క‌ల్పించే ఏర్పాటు చేస్తే మాత్రం అద్భుత‌మే.

18 Replies to “రెండు, మూడు.. ద‌ర్శ‌నం క‌ల్పిస్తే అద్భుత‌మే!”

  1. మా జగన్ రెడ్డి అయితే.. లడ్డు లో పంది కొవ్వు కలిపి.. టీటీడీ ఖజానా ని ఎలా దోచెయ్యాలో.. సంస్కరణలు తెస్తాడు..

    ఏడు కొండల్లో మూడు కొండలు దేవుడికి.. మరో మూడు కొండలు ఏసు ప్రభువుకి.. ఇంకొక కొండ .. భారతి వదిన కి రాసిచ్చేస్తాడు..

    అదేంటని అడిగితే.. అన్ని మతాలను సమానం గా చూడాలని బోధనలు చేస్తాడు..

      1. నువ్వు వచ్చావని టముకు వేసుకుని చెప్పుకోవాలా.. కొండెర్రిపప్ప..

          1. నువ్వు వచ్చావని టముకు వేసుకుని చెప్పుకోవాలా.. కొండెర్రిపప్ప..

          2. మా జగన్ రెడ్డి అయితే.. లడ్డు లో పంది కొవ్వు కలిపి.. టీటీడీ ఖజానా ని ఎలా దోచెయ్యాలో.. సంస్కరణలు తెస్తాడు..

            ఏడు కొండల్లో మూడు కొండలు దేవుడికి.. మరో మూడు కొండలు ఏసు ప్రభువుకి.. ఇంకొక కొండ .. భారతి వదిన కి రాసిచ్చేస్తాడు..

            అదేంటని అడిగితే.. అన్ని మతాలను సమానం గా చూడాలని బోధనలు చేస్తాడు..

          3. నువ్వు వచ్చావని టముకు వేసుకుని చెప్పుకోవాలా.. కొండెర్రిపప్ప..

          1. నువ్వు వచ్చావని టముకు వేసుకుని చెప్పుకోవాలా.. కొండెర్రిపప్ప..

  2. అది జరగదు గాక జరగదు.రీజన్స్ below..

    1. దర్శనం ఈజీ ఐతే జనాలు దేవుడిని కూడా లైట్ తీసుకుంటారు

    2. పాలక మండలి నీ… నాయకులను ఎవడూ బతిమాలుకొని దర్శనం టికెట్స్ కోసం దెబెరించనఖర్లేదు. అందుకే వారు దీనిని జరగనివ్వరు.

    3. దర్శనాలు ఈజీ గా ఐతే కొండ మీద వ్యాపారాలు చాలా దెబ్బతింటాయి. వాటర్ బాటిల్ 30 కి కొనవలసి రాకపోవచ్చు.

    ఇలా చాలా.. సో ఇది జరగదమ్మా…

Comments are closed.