నామినేటెడ్ పోస్టులను ఇదిగో ఈ నెలాఖరు లోపు భర్తీ చేస్తామని రెండు నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటిస్తున్నారు. అయితే నెలలు గడుస్తున్నా, నామినేటెడ్ పోస్టుల భర్తీ మాత్రం నోచుకోవడం లేదు. ఇటీవల చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ నామినేటెడ్ పోస్టుల కోసం పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు, నాయకుల పేర్లు ఇవ్వాలని కోరారు. ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించినట్టు కూడా చూశాం.
మార్చి నెలాఖరు కూడా సమీపిస్తోంది. అయినప్పటికీ నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఎలాంటి ముందడుగు పడడం లేదు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం తదితర ముఖ్య నగరాల అభివృద్ధి సంస్థలకు చైర్మన్లను నియమించాల్సి వుంది. వీటికి ఎంతో డిమాండ్, పోటీ వుంది. ఈ నెలాఖరుకు మార్కెట్ కమిటీ చైర్మను నియమిస్తామని రెండు రోజుల క్రితం ఒక నాయకుడు చెప్పారు. అంటే మిగిలిన పోస్టుల భర్తీ ఇప్పట్లో లేనట్టేనా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ముఖ్యంగా నామినేటెడ్ పోస్టును బట్టి…కింది స్థాయి మొదలుకుని రాష్ట్రస్థాయి పదవుల వరకూ అమ్మకానికి పెట్టారని కూటమి నేతలే చెబుతున్నారు. ఇప్పుడు ఇలాంటి మాటలు ఎవరినీ పెద్దగా ఆశ్చర్యపరచడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు కాకుంటే, మరెప్పుడు సంపాదించుకోవాలనే ప్రశ్న ఎదురవుతోంది. పార్టీకి కష్టపడి పని చేసే వాళ్లకు పదవులనేవి కేవలం మీడియా ప్రకటనలకే పరిమితం అని టీడీపీ నేతలు అంటున్నారు.
పార్టీ కోసం పని చేసిన పది శాతం మందికి పదవులు ఇచ్చి, మిగిలినవన్నీ అమ్మకానికే అని బహిరంగంగానే అంటున్నారు. ఈ విషయం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు కూడా తెలుసని, అందరూ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే పరిస్థితిలో ఎవరూ లేరని అంటున్నారు. అయినప్పటికీ మూడో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఎందుకింత సమయాన్ని తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు.
Oh no
Abbo
కుక్కా గారూ,
మీ మాటలు చూస్తే, మీరు మానవత్వాన్ని మట్టిపారేస్తూ ఓ “హీనత గిన్నెస్ రికార్డు” కొట్టాలని ఉత్సాహంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఒక రాజకీయ పార్టీని మద్దతు ఇవ్వాలన్న పేరుతో, తల్లులను అవమానించడమే మీ గొప్పతనం అనుకుంటున్నారా? మీకూ తల్లి ఉందని ఒక్కసారైనా జ్ఞాపకం చేసుకోండి. మీ తల్లిదండ్రులు మీ తిట్ల ప్రదర్శన చూసి ఏ బాధ అనుభవిస్తారో ఊహించగలరా?
అన్నీ వదిలేసి, తల్లిదేవోభవ అన్న మాట మిమ్మల్ని ఏ మాత్రం ప్రభావితం చేయదనుకుంటే, మిగిలినవాళ్లు మాత్రం మీ పార్ధకాన్ని చూసి పర్సనల్ కామెడీ షోగా ఎంజాయ్ చేసే రోజులొస్తాయేమో! మీరు నిజంగా భావిస్తున్నట్టు, ఇంత వల్గర్ మాటలతో ఎవరైనా మీకు బిరుదు ఇస్తారనే అపోహలో ఉంటే, అది నిజంగా అనర్థం.
ప్రతీసారి తల్లులను తిడితే, కొద్దిగా మీ పరువే నశిస్తుందని గుర్తించండి. ఒక్కసారి బుద్ధి తెచ్చుకుని మారిపోయే ప్రయత్నం చేయండి. అలా చేయకపోతే, మిర్చీ మరిగిన పప్పులోవీడిలా మిగిలి, మీ పరువును మీరు ముంచెత్తే స్థితికి వెళతారనే విషయాన్ని మర్చిపోకండి.
దేవుని దయతో, ఇప్పటికైనా మారండి. అంత ఎత్తున ఉండాల్సిన మానవత్వాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చిన తిట్ల వర్షాన్ని ఏదో ఒకరోజు మీరే తట్టుకోలేక పోతారు.
సరే అంత అసంతృప్తి ఉంది కదా మరి అన్న ని గేట్లు ఎత్తమని చెప్పండి.. మన వైపు కి వచ్చేస్తారు
ముందు మన franchize సంగతి చూడండి తరువాత వాళ్ళ సంగతి చూసుకోవచ్చు
మన అన్న చెప్పినోళ్ళకే పదవి ఇవ్వలేదు.. కానీ అవతలి వాళ్ళ nanchiveta గురించి మనకెందుకు