పుణ్యానికి పోతుంటే, ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు భక్తులు మృత్యువాత పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఓబులవారిపల్లె మండలం వై.కోట గుండాలకోన సిద్ధేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తుతుంటారు. 14 మంది భక్తులు నడుచుకుంటూ వెళ్తుండగా … ఏనుగుల గుంపు దాడి చేసింది.
ఈ దాడిలో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని రైల్వేకోడూరు ఆస్పత్రికి తరలించారు. చికిత్ప పొందుతూ ఇద్దరు చనిపోయారు. ఎనిమిది భక్తులు తప్పించుకున్నారు. తీవ్ర గాయాలైన వారిని తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. ఇదిలా వుండగా మృతులు రైల్వేకోడూరు మండలం కన్యగుంట ఎస్టీ కాలనీ వాసులు.
ఇటీవల కాలంలో ఏనుగుల సంచారం ఎక్కువైంది. భక్తులు అటవీ ప్రాంతం మీదుగా ఆలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి. జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, అనూహ్యంగా ఏనుగులు దాడికి పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ దుర్ఘటనపై అటవీశాఖ మంత్రి పవన్‌కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ఆయన ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు, అలాగే గాయపడ్డ వారికి రూ.5 లక్షలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని ఆయన తెలిపారు.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
No one responding
Pawan sir manasunna mahaa raaju. Next CM. Jai Janasena.
పానుగంటి లోకనాథరావు గారు… మీరు ఎక్కడ?
మన స్నేహితుడు, కాస్త ఘాటుగా, అప్పుడప్పుడూ కొంచెం మితిమీరిన భాషతో, తనదైన శైలిలో “పచ్చ—” అంటూ ఒకప్పుడు దూసుకుపోయిన పానుగంటి గారు… ఇప్పుడు ఒక్క మాట కూడా వినిపించడం లేదు! ఏమైంది?
పార్టీ ఓడిపోవడం ఖచ్చితంగా తీవ్రమైన సంఘటన… కానీ మీరు సైలెంట్ అయిపోవడం అంతకన్నా పెద్ద షాక్! ఏం జరిగింది?
ఏం ఐనప్పటికీ, మనం మనిషిని మర్చిపోం!
అంతకు మించి ఇప్పటివరకు ప్రతీ విషయానికి గొంతు చించుకుని చెప్పిన మన పానుగంటి గారు ఇలా పూర్తిగా మాయం అయితే… కచ్చితంగా వెతకాల్సిందే!
ఓటమి తట్టుకోలేక డిప్రెషన్ బంకర్‌లోకి దిగిపోయి ఉండొచ్చు, కానీ అంతకు మించి వెళ్ళొద్దండీ! ఏమైనా ఒక్కసారి బయటికి రండి, జీవితం ఇంకా అలాగే సాగిపోతుంది.
మీకు ఓదార్పు కావాలా? ఒక Strong Tea? లేక బండిని మళ్ళీ స్టార్ట్ చేసి కొత్త ట్రిప్ మొదలు పెట్టాలని ఉందా?
ఏం ఐనప్పటికీ, మీ మిత్రులు ఇక్కడ ఉన్నారు! మిమ్మల్ని మర్చిపోలేరు!
పానుగంటి గారు, మిమ్మల్ని వెతుకుతున్నాం! ఎక్కడైనా ఒక్క ముక్క చెప్పండి!
