విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీద వచ్చినన్ని గాసిప్స్ ప్రచారాలూ వేరే పొలిటీషియన్ మీద వచ్చి ఉండవు. ఆయన ఆ పార్టీ లోకి వెళ్తారు. ఈ పార్టీలోకి వస్తారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారాన్ని ఎపుడూ చేస్తూ ఉంటారు.
దానికి కారణం గంటా గతంలో అనేక పార్టీలు మారి ఉండడం కూడా అని చెప్పుకోవాలి. గంటా శ్రీనివాసరావును ఈ మధ్య దాకా వైసీపీ జనసేనలోకి వెళ్తారు అని అంటూ వచ్చారు. ఇప్పుడు ఆయనను బీఆర్ఎస్ లోకి వెళ్తారు అని మరో ప్రచారం స్టార్ట్ చేశారు.
విశాఖ జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు తోట రాజీవ్ మాజీ మంత్రి గంటా రాజకీయ జాతకాన్ని చెబుతూ గంటా ఇప్పుడు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గంటా జనసేనలోకి వైసీపీలోకి వెల్దామనుకున్నారని ఇప్పుడు బీఆర్ఎస్ జెండా పట్టుకుంటారు అని రాజీవ్ అంటున్నారు.
మరి ఆయనకు గంటా గురించి ఏ రకమైన నమ్మకమైన ఇన్ఫర్మేషన్ ఉందో ఏమో తెలియదు కానీ ఆయన బీఆర్ఎస్ లీడర్ అనేస్తున్నారు. గంటా బీఆర్ఎస్ లో చేరితే ఉపయోగం ఉంటుండా అసలు గంటా గెలిచే పార్టీలోకే ఎపుడూ వెళ్తారు, ఏపీలో అధికారంలోకి రాని బీఆర్ఎస్ లో చేరి గంటా ఏం సాధిస్తారు అని అన్న వారూ ఉన్నారు.
మరి గంటా అయితే తన మీద వచ్చిన ప్రచారాలకు ఎపుడూ రియాక్ట్ కాను అని చెబుతారు. కాబట్టి ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు. తోట రాజీవ్ గంటా గురించి చెబుతున్నది కరెక్ట్ అయితే మాత్రం ఏపీలో బీఆర్ఎస్ కి ఒక స్ట్రాంగ్ లీడర్ దొరికినట్లే అని అంటున్నారు.