ఉమ్మడి విశాఖ జిల్లాలో మంత్రి పదవుల కోసం గంటా శ్రీనివాసరావు అయ్యన్నపాత్రుడు ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్దరూ పలుమార్లు మంత్రులుగా చేసిన వారే. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు సీఎం గా ఉన్న టైం లో గంటా అయ్యన్న మంత్రులుగా పూర్తికాలం కొనసాగారు.
ఈసారి చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరికి చాన్స్ అన్న చర్చ సాగుతోంది. మొదటి ప్రాధాన్యం అయ్యన్నపాత్రుడుకే అని అంటున్నారు. ఆయన పదవసారి పోటీ చేసి గెలిచారు. సీనియర్ లీడర్ గా ఉన్నారు. టీడీపీ పుట్టిన నాటి నుంచి కొనసాగుతున్నారు. పార్టీ పట్ల విధేయుడుగా మెలుగుతున్నారు చంద్రబాబుకు ఆయన అంటే గురి ఉంది.
దాంతో అయ్యన్నకు తప్పనిసరిగా మంత్రి పదవి ఇస్తారాని అంటున్నారు. ఆయనకు మంచి మంత్రిత్వ శాఖనే అప్పగిస్తారు అని తెలుస్తోంది. అయితే విశాఖ సిటీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంగతేంటి అన్న ప్రశ్న వస్తోంది.
గంటాకు ఈసారి చాన్స్ దక్కదని ప్రచారంలో ఉంది. ఆయనకు లాస్ట్ విడతలో పార్టీ టికెట్ ఇచ్చారు. ఆయన 90 వేల పై చిలుకు మెజారిటీతో గెలిచారు. మంత్రి పదవి ఖాయమని ఆశపెట్టుకున్నారు. భీమిలీ నుంచి ఎవరు గెలిచినా మంత్రులు కావడం ఒక సంప్రదాయంగా వస్తోంది. కానీ ఈసారి సెంటిమెంట్ ని బ్రేక్ చేసేలా బాబు నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. విశాఖ సిటీలో గాజువాక నుంచి గెలిచిన పల్లా శ్రీనివాసరావుకే ఎక్కువ చాన్స్ ఉందని అంటున్నారు. దాంతో గంటాకు నిరాశ తప్పదని టాక్ అయితే ఉంది.