కూట‌మి ఎమ్మెల్యేల‌కు తిరుప‌తి ఎంపీ షాక్‌

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని టీడీపీ, జ‌న‌సేన ఎమ్మెల్యేల‌కు తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి షాక్ ఇచ్చారు.

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని టీడీపీ, జ‌న‌సేన ఎమ్మెల్యేల‌కు తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి షాక్ ఇచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాసరావు ఎస్వీ గోశాల‌కు రావాల‌ని వైఎస్ జ‌గ‌న్‌, భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డికి స‌వాల్ విసిరారు. ఈ స‌వాల్ చినికిచినికి గాల‌వాన‌గా మారింది. స‌వాల్‌ను వైసీపీ సీనియ‌ర్ నేత‌, టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి స్వీక‌రించర‌ని అనుకున్న‌ట్టున్నారు.

అయితే స‌వాల్ స్వీక‌రించ‌డంతో కూట‌మి ప్ర‌భుత్వం ఇర‌కాటంలో ప‌డింది. దీంతో భూమ‌న కరుణాక‌ర‌రెడ్డిని, వైసీపీ శ్రేణుల్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఎస్వీ గోశాల‌కు రాకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పోలీస్ యంత్రాంగంతో వైసీపీ నాయ‌కుల‌పై అణ‌చివేత‌కు ప్ర‌భుత్వం దిగింది. ఈ నేప‌థ్యంలో తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ గురుమూర్తి, మ‌రో యువ‌నాయ‌కుడు భూమ‌న అభిన‌య్ పోలీసుల క‌ళ్లుగ‌ప్పి చాక‌చ‌క్యంగా ఎస్వీ గోశాల వ‌ద్ద‌కు వెళ్లారు.

అప్ప‌టికే ఎస్వీ గోశాల‌లో ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా న‌లుమూల‌ల నుంచి టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు అక్క‌డికి చేరుకున్నారు. అభిన‌య్‌ని అడ్డుకుని, పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించ‌డంతో తిరుప‌తి ఎంపీ ఒక్క‌డే లోప‌లికి వెళ్లారు. టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు తిరుప‌తి ఎంపీ రాకను చూసి షాక్‌కు గుర‌య్యారు.

పూత‌ల‌ప‌ట్టు రిజ‌ర్వ్‌డ్ ఎమ్మెల్యే ముర‌ళీని కూట‌మి నేత‌లు ముందు పెట్టారు. టీడీపీ, జ‌న‌సేన ఎమ్మెల్యేలు పులివ‌ర్తి నాని, బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి, ఆర‌ణి శ్రీ‌నివాసులు త‌దిత‌రులంతా ఎంపీని చుట్టుముట్టారు. అయిన‌ప్ప‌టికీ ఎంపీ ఏ మాత్రం అద‌ర‌క‌బెద‌ర‌క వాళ్లంద‌రికీ స‌మాధానం చెప్పారు. స‌వాల్ విసిరిన భూమ‌న ఎందుకు రాలేద‌ని ఎంపీని ఉద్దేశ‌పూర్వ‌కంగానే నిల‌దీశారు. అయితే బ‌య‌ట పోలీసుల‌తో త‌మ‌ను అడ్డుకుంటున్నార‌ని, తాను త‌ప్పించుకుని ఇక్క‌డి వ‌ర‌కూ రాగ‌లిగాన‌ని ఆయ‌న వాళ్ల వాద‌న‌ను తిప్పి కొట్టారు.

గోవుల మ‌ర‌ణాల‌పై నిజాలు చెప్ప‌డానికి తాము సిద్ధ‌మ‌ని, అయితే పోలీసుల్ని అడ్డుపెట్టుకుని గోశాల‌కు రాకుండా అడ్డుకున్న‌ది మీరేన‌ని టీడీపీ ఎమ్మెల్యేల‌కు ఆయ‌న చుర‌క‌లు అంటించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పోలీసుల‌తో అణ‌చివేతకు దిగార‌ని ఆయ‌న టీడీపీ ఎమ్మెల్యేల మొహంమీదే చెప్పారు. తిరుప‌తి ఎంపీ గురుమూర్తి ఒక్క‌డే గోశాల‌కు వెళ్ల‌డం, టీడీపీ ఎమ్మెల్యేల‌తో వాదించ‌డం …ఈ దృశ్యాల‌న్నీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఇప్ప‌టికే తిరుప‌తి ఎంపీ అంటే ప‌నిరాక్షసుడ‌నే పేరు వుంది. అంతేకాదు, తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థులు గెలిచినా, ఎంపీగా గురుమూర్తి విజేత‌గా నిలిచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ఇప్పుడు మ‌రోసారి సాహ‌సించి, గోశాల‌కు వెళ్లి, కూట‌మి ఎమ్మెల్యేల‌తో ఢీ అంటే ఢీ అని ఆయ‌న త‌ల‌ప‌డ‌డం స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

7 Replies to “కూట‌మి ఎమ్మెల్యేల‌కు తిరుప‌తి ఎంపీ షాక్‌”

  1. మంచి పని చేశారు గురుమూర్తి గారు ,, జగన్ అన్న దైర్యం అది జై జగన్,,,,,

Comments are closed.