సిట్‌కు విజ‌య‌సాయిరెడ్డి షాక్‌

మ‌ద్యం కుంభ‌కోణం కేసులో సాక్షిగా విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిన మాజీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి… సిట్‌కు షాక్ ఇచ్చారు.

మ‌ద్యం కుంభ‌కోణం కేసులో సాక్షిగా విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిన మాజీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి… సిట్‌కు షాక్ ఇచ్చారు. ఈ నెల 18న విచార‌ణ‌కు రావాల‌ని విజ‌య‌సాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే ఒక రోజే ముందే విచార‌ణ‌కు వ‌స్తాన‌ని, అందుకు త‌గ్గ ఏర్పాట్లు చేసుకోవాల‌ని విచార‌ణ బృంద‌మైన సిట్‌కు ఆయ‌న స‌మాచారం ఇచ్చారు. దీంతో విజ‌య‌వాడ సీపీ కార్యాల‌యంలో విజ‌య‌సాయిరెడ్డి నుంచి వివ‌రాలు సేక‌రించేందుకు సిట్ టీమ్ సిద్ధంగా వుండింది.

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌వుతున్నా విచార‌ణ‌కు విజ‌య‌సాయిరెడ్డి హాజ‌రు కాలేదు. అంతేకాదు, ఇత‌ర కార్య‌క్ర‌మాల కార‌ణంగా విచార‌ణ‌కు రాలేన‌ని, మ‌రో రోజు వ‌స్తాన‌ని సిట్‌కు ఆయ‌న స‌మాచారం ఇచ్చిన‌ట్టు తెలిసింది. ఈ ప‌రిణామానికి సిట్ టీమ్ షాక్‌కు గురైంది. ఒక రోజు ముందే విచార‌ణ‌కు వ‌స్తాన‌ని చెప్పి, ఇప్పుడిలా ఎందుకు చేశారో సిట్ టీమ్‌కు అర్థం కాని ప‌రిస్థితి.

లిక్క‌ర్ స్కామ్‌కు సంబంధించి పూర్తి బాధ్యుడు క‌సిరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డే అని ఇటీవ‌ల విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇదే కేసులో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టులో ముంద‌స్తు బెయిల్ పొందారు. ఈ నెల 18న విచార‌ణ‌కు రావాల‌ని ఆయ‌న‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే విచార‌ణ‌కు న్యాయ‌వాదిని అనుమ‌తించాల‌ని, అలాగే వీడియో రికార్డు చేయాలంటూ ఆయ‌న ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు.

విచార‌ణ స‌మ‌యంలో తాను చెప్పిన సంగ‌తుల్ని కాకుండా, త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్టు రికార్డు చేసుకుంటార‌నే అనుమానంతో మిథున్‌రెడ్డి ముందు జాగ్ర‌త్త‌గా న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించార‌ని చెప్పొచ్చు. కూట‌మి కుట్ర‌పూరిత ఆలోచ‌న‌లు తెలియ‌డం వ‌ల్లే మిథున్‌రెడ్డి వ్యూహాత్మ‌కంగా న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు.

2 Replies to “సిట్‌కు విజ‌య‌సాయిరెడ్డి షాక్‌”

Comments are closed.