వైఎస్సార్‌సీపీని విడిచిపెట్ట‌ని శ‌నేశ్వ‌రుడు!

మ‌ళ్లీ అధికారంలోకి రావాలని నిజంగానే వైఎస్ జ‌గ‌న్ భావిస్తుంటే, పార్టీని స‌జ్జ‌ల చేతుల నుంచి త‌ప్పించార‌నే సంకేతాల్ని పంపాలి.

రామేశ్వ‌రం పోయినా శ‌నేశ్వ‌రం వ‌ద‌లేద‌న్న చందంగా వైఎస్సార్‌సీపీ రాజ‌కీయ ప‌రిస్థితి త‌యారైంది. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీ పాలిట శ‌ని అని కార్య‌క‌ర్త‌లు మొద‌లుకుని రాష్ట్ర‌స్థాయి నాయ‌కుల వ‌ర‌కూ నెత్తీనోరూ కొట్టుకుని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి మొర‌పెట్టుకున్నా, ఆయ‌న మాత్రం వినిపించుకోవ‌డం లేదు. తాజాగా వైఎస్సార్‌సీపీని పూర్తిగా పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌రిస్తున్నామంటూ 33 మంది పార్టీ పొలిటిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ (పీఏసీ) జాబితాను కేంద్ర క‌మిటీ ప్ర‌క‌టించింది.

ఈ జాబితాలో చివ‌రి స‌మాచారం వైఎస్సార్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్ని షాక్‌కు గురి చేసింది. వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పీఏసీ క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. దీంతో వైఎస్సార్‌సీపీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లు జ‌గ‌న్ ఓఎస్డీకి ఫోన్లు చేసి… ఇంత‌కూ పార్టీని ఏం చేయాల‌ని అనుకుంటున్నారో చెప్పాల‌ని, తాము రాజ‌కీయాల్లో వుండాలా? వీడాలా? అని నిల‌దీసిన‌ట్టు స‌మాచారం.

పీఏసీ క‌న్వీన‌ర్‌గా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని నియ‌మించ‌డం ఏంటంటూ వైఎస్సార్‌సీపీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లు సీరియ‌స్ కావ‌డంతో మ‌ళ్లీ మార్పుచేర్పులు చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి క‌న్వీన‌ర్ కాద‌ని, కేవ‌లం కోఆర్డినేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తారంటూ మార్చి మ‌రో ప్ర‌క‌ట‌న వెలువ‌రించ‌డం గ‌మ‌నార్హం. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై త‌న పార్టీలో ఏమ‌నుకుంటున్నారో నిజంగానే వైఎస్ జ‌గ‌న్‌కు తెలియ‌దా? లేక అన్నీ తెలిసి ఆయ‌న న‌టిస్తున్నారా? అనేది ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు.

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని ప‌క్క‌న పెట్టుకోవ‌డం అంటే, ఓట‌మితో అంట‌కాగిన‌ట్టే అని వైఎస్సార్‌సీపీలో కార్య‌క‌ర్త‌లు మొద‌లుకుని రాష్ట్ర‌స్థాయి నాయ‌కుల వ‌ర‌కూ ఒక‌టే అభిప్రాయంతో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌తి విష‌యంలోనూ స‌జ్జ‌లను జ‌గ‌న్ ముందుకు ఎందుకు పెడుతున్నార‌నే ప్ర‌శ్న‌… బేతాళుని ప్ర‌శ్న‌గా మిగిలింద‌ని పార్టీ నాయ‌కులు విరుచుకుప‌డుతున్నారు.

గ‌త ఐదేళ్లు అధికారంలో ఉన్న‌ప్పుడు పెత్త‌నం అంతా స‌జ్జ‌ల చేతిలో పెట్టి, తాను తాడేప‌ల్లిలోని నివాసానికి ప‌రిమిత‌మై, ఘోర ప‌రాజ‌యం పాలైనా ఇంకా జ‌గ‌న్ మేల్కోలేద‌ని సొంత పార్టీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఒక‌వైపు కూట‌మి ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో రోజురోజుకూ వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని, దాన్ని రాజ‌కీయంగా సొమ్ము చేసుకునే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌నే అభిప్రాయం వుంది. ఇలాంటి స‌మ‌యంలో స‌జ్జ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం ద్వారా, వైసీపీకి అధికారం క‌ట్ట‌బెడితే, మ‌ళ్లీ మ‌న‌ల్ని స‌జ్జ‌లే పాలిస్తాడ‌నే భ‌యం క‌లిగేలా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆందోళ‌న వైఎస్సార్‌సీపీలో అన్ని స్థాయిల్లోనూ వుంది.

పార్టీని న‌డ‌ప‌డానికి జ‌గ‌న్‌కు ఓపిక లేదా? అనే అనుమానం … ఈ ప‌రిణామాల్ని చూస్తే ప్ర‌తి ఒక్క‌రిలోనూ అనుమానం క‌లుగుతుంద‌ని అంటున్నారు. ఓట‌మికి కార‌కుల్ని గుర్తించి, దూరం పెట్ట‌డం విజ్ఞులైన రాజ‌కీయ నాయ‌కుల ల‌క్ష‌ణం. అదేంటో గానీ, స‌జ్జ‌ల విష‌యంలో తాను ప‌ట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్న చందంగా, జ‌గ‌న్ మొండి వైఖ‌రితో వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆ పార్టీకి చెందిన నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీని పున‌ర్వ్య‌స్థీక‌రించ‌డం అంటే, కొత్త సీసాలో పాత సారా పోయ‌డం కాద‌ని, పార్టీకి కొత్త ర‌క్తాన్ని ఎక్కించ‌డమ‌ని హిత‌వు చెబుతున్నారు. ఈ జాబితా చూస్తే, ఎక్కువ మంది ప్ర‌జా వ్య‌తిరేక‌త ఎదుర్కొన్న వాళ్లే క‌నిపిస్తున్నారు. వీళ్ల‌కు తోడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి. ఇలాగైతే పార్టీకి పూర్వ‌వైభవం క‌ష్ట‌మ‌ని, మొద‌ట‌గా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని దూరం పెడితేనే, జ‌గ‌న్‌లో మార్పు వ‌చ్చింద‌ని పార్టీ శ్రేణుల్లో న‌మ్మ‌కం క‌లుగుతుంద‌ని ప‌లువురు పార్టీ అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. లేదంటే మ‌ళ్లీ స‌జ్జ‌ల‌ను సీఎం చేసుకోడానికైతే, మ‌న‌మెందుకు శ్ర‌మించాల‌నే ఆలోచ‌న‌, వైసీపీకి అంద‌రినీ దూరం చేస్తుంద‌నే హెచ్చ‌రిక చేస్తున్నారు.

మ‌ళ్లీ అధికారంలోకి రావాలని నిజంగానే వైఎస్ జ‌గ‌న్ భావిస్తుంటే, పార్టీని స‌జ్జ‌ల చేతుల నుంచి త‌ప్పించార‌నే సంకేతాల్ని పంపాలి. వైఎస్సార్‌సీపీని జ‌గ‌నే న‌డిపిస్తున్నార‌నే న‌మ్మ‌కం శ్రేణుల్లో క‌ల‌గాలి. ఆ దిశ‌గా జ‌గ‌న్ అడుగులు వేసేంత వ‌ర‌కూ వైసీపీకి మంచిరోజులు రాన‌ట్టే అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

56 Replies to “వైఎస్సార్‌సీపీని విడిచిపెట్ట‌ని శ‌నేశ్వ‌రుడు!”

  1. జర్నలిజం కి శని లా పట్టిన నువ్వు వదులుతున్నావా….ఇది అంతే

  2. జర్నలిజం ని నువ్వు వదులుతున్నావా….పట్టుకు పీక్కుతింటున్నవ్గా అది అంతే

  3. ఈ అందగాడు మీ అన్న పక్కన ఉన్నంత కాలం మీ అన్నకి ముఖ్యమంత్రి పదవి అందదు.కనీసం ప్రతిపక్ష కూడా అందదు.

  4. నాకో doubt భయ్యా… కొంప దీసి జగన్ మోహన్ రెడ్డి తెలుగు దేశం పార్టీ కోవర్ట్ కాదు కదా y s r c పార్టీ లో???

  5. మొన్న ga exclusive అని సజ్జల జగన్ మధ్య విభేదాలు అని రాసారు.. ఇవ్వాళా ఇలా జరిగింది.. Ika మిగిలిన exclusive వార్తలు పవన్ నాదెండ్ల మధ్య విభేదాలు.. ఐఐటీ నిపుణుల చేసిన సర్వే…. గురించి ఇంకా మాటాడుకోవాక్కరలేదు…

  6. నెనెపటి నుండొ చెపుతున్నా GA గాడికి, సజ్జలకి పడటం లెదు అని. దానికి పెద్ద కారణం ఎమి లెకపొవచ్చు. Y.-.C.-.P కొసం ఎంత కష్టపడుతున్నా సరి అయిన గుర్తింపు రావటం లెదు అన్నద్ది GA ఎడుపు కావచ్చు.

    అయినా సజ్జల స్వతంత్రంగా నిర్ణాయాలు తీసుకుంటాడా? జగన్ నిర్ణయాలనె ఈయన ద్వరా చెప్పిస్తారు! సజ్జల కెవలం జగన్ చెతిలొ ఒక్క రబ్బర్ స్టంపు మాత్రమె కదా!

    .

    ఇక నిజంగా ఎదొ పునర్ వ్యవస్తీకరించాలి అంటె ముందు జగన్ తన మైండ్ సెట్ మార్చుకొవాలి..

    –చెల్లి కి ఆస్తిలొ వాటా ఇచ్చి.. తల్లి ని గౌరవించాలి.

    –సాక్షి ని ప్రక్షాలన చెసి.. కనీసం అప్పుడప్పుడు అయినా నిజాలి రాసెలా చెయాలి

    –ఇంక 3 రాజదానుల అరిగిపొయిన రికార్డ్ వదిలి అమరవతికి జై కొట్టలి.

    –కలమత ప్రాంతీయా విదెషాల మీద ఆదారాపడటం మానాలి.

    –పరిపాలన అంటె కెవలం పంచటమె కాదు, అబిరుద్ది కూడా ఉండాలి అన్న విషయం తెలుసుకొవాలి.

    .

    లెదా తనె పార్టి విడిచి, పగ్గాలు విజయమ్మకొ షర్మిలకొ ఇచ్చి తప్పుకొవాలి. మన అన్న ఇవ్వన్నీ చెసెది లెదు, ఆ పార్టి బ్రతికెది లెదు!

  7. నువ్వు ఒక సైడ్ ఆలోచిస్తూన్నావు అనిపిస్తుంది, ఆ సజ్జల లేకపోతే మన వాడు బెబెబ్బే అని నీకు అర్దం కావటం లేదు, ఆ దద్దమ్మ గాడు ఆమాత్రం మాట్లాడగలుగుతున్నాడు అంటే సజ్జల పుణ్యమే, లేదంటే మన వాడి తెలివి అందరికీ తెలిసిపోతుంది

  8. నీ మాట విని పార్టీ పెట్టలేదుగా . నువ్వు చెప్తే తప్పించాలా? అయినా నీకేం తెలుసు తన టాలెంట్ గురించి ? నువ్వెప్పుడైనా తనతో పని చేశావా?

  9. అవినాష్ రెడ్డిని కన్వీనర్ గా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.

  10. త*ల్లి మీదనే కే*సు పెట్టిన సన్నా*సి వె*దవ కి , ఈ వెబ్సైట్ ఒక కుల*గజ్జి బానిస. వాడేసే బిచ్చం డబ్బు కోసం ఆతృత పడతా వుంటారు.

    అసలు వాడికి బుర్ర లో గుజ్జు లేదు. ఏదో అదృష్టం బాగా వుండి ఒకసారి గెలిచాడు. ఆ పదవి అడ్డం ఎత్తుకుని వచ్చే పది తరాలకి కావలసిన డబ్బు దోచుకున్నాడు. అందులో కాస్త చిల్లర ఇలాంటి వెబ్సైట్ కి ఇస్తాడు.

  11. జగన్ ఏమి చెబితే ఆ పని చేసే బానిస సజ్జల.

    అసలు వాడిని అనే దమ్ము లేక ఇలా సజ్జల మీద పడి ఏడుస్తున్నారు వెబ్సైట్ వెంకట్ రెడ్డి గారు.

    సజ్జల్ తో వాటాలు కుదరలేదు ఏమో.

  12. నేను ఎప్పుడో చెప్పాను, ఈయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఏదో సజ్జలు దగ్గర ఉంది, అందుకే సజ్జలకు భయపడుతున్నాడు అని. లేకపోతే సోనియా గాంధీ నీ ఎదురించిన ధీరున్ని, సింగిల్ గా వచ్చే సింహాన్ని అని చెప్పుకునే ఈయన సజ్జలకీ ఎందుకు భయపడుతున్నాడు.మరి ఆ పెన్ డ్రైవ్ రహస్యం ఏందో , అందులో ఏముందో

  13. అధికారం ఉన్నపుడు వీరుడు సూరుడు అన్నారు ఇప్పుడు శని అంటున్నారు.

  14. సజ్జల నీ దూరం పెట్టాలంటే మేడం పర్మిషన్ కావాలి గా…

    సజ్జల దూరం పెట్టడం అంటే సిమెంట్ కి విడాకులు ఇస్తేనే సజ్జల నీ దూరం పెట్టడం సాధ్యం అవుతుంది… సిమెంట్ ఆంటీ ఏం చెప్తే అదే చేయాలీ….

    ఇదీ రాజమాత హారతి శాసనం…

  15. GA చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది. అదేమిటంటే పార్టీ కి కొత్త రక్తం ఎక్కించాలి అనేది వాస్తవం. కొత్తవారు సులభంగా దొరుకుతారు. వారికి ప్రారంభం లో ఏదో ఒక పార్టీ అండ కావాలి. అది ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ లో దొరకదు. ముందు ఎక్కడో ఒక చోట రంగ ప్రవేశం చేసి, ఆ తరువాత బలమైన పొర్టీ లోకి పాక్కుంటూ వెళ్ళవచ్చు. మొక్కలు ఒక ప్రాంగణం నుండి ఇంకో ప్రాంగణానికి పాకడం.

    అలాగే కూటమి ప్రభుత్వం పై వ్యతిరేకం అన్నది అవాస్తవం. అంతో ఇంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకా వ్యతిరేకత. రాబోయే రెండు సంవత్సరాలలో రాజధాని గా అమరావతి కి ఒక రూపం వస్తుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుంది.

    రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించ బడతాయి. రాజధాని ప్రాంతంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పరిశ్రమలు రావడం ఖాయం. అంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనే కదా.

    GA గారికి ఇవన్నీ ఇష్టం లేనట్టుంది.‌ అసలు ఈ రాష్ట్రాన్ని GA గారు ఏం చేయాలి అని అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని చంక నాకించాలని అనుకుంటున్నారేమో. ప్రజల మీద మీకెందుకు ఇంత కక్ష.

    కేంద్ర ప్రభుత్వం వారి అవసరం కొద్దీ మన రాష్ట్రానికీ ఇతోధికంగా సహాయపడుతున్నది. ఈ అభివృద్ధి ని ఇలాగే కొనసాగనివ్వండి. తాగే నీటిలో పుల్ల అద్దకండి సార్.

  16. మన జగన్ అన్న మన రాష్ట్రానికి పట్టిన శని అని సింపుల్ గ చెప్పావ్, నేను అప్ప్రెషతే చేయాలి.

  17. Jagan malli Ravali ani ycp abhimanulu Enduku korukuntunnaru?. Last time baga paalincharana? Ala ayte nee article prakaram last 5 years anni handle chesindi sajjala. So credit goes to sajjala. Last 5 years bagaledu ante jagan cm chesina sajjalaki appacheppadu kabatti he is unwilling to rule. In any case no point in voting for Jagan as per your article.

  18. J@g@n malli Ravali ani yc*p abhimanulu Enduku korukuntunnaru?. Last time baga paalincharana? Ala ayte nee article prakaram last 5 years anni handle chesindi sajjala. So credit goes to sajjala. Last 5 years bagaledu ante j@g@n cm chesina sajjalaki appacheppadu kabatti he is unwilling to rule. In any case no point in voting for J@g@n as per your article.

  19. మొన్న ఎలక్షన్స్ లో 11వచ్చాయి..నెక్స్ట్ ఎలక్షన్స్ లో 11% ఓటు షేర్ వస్తది!

    వీడు ఉన్నాడు కదా .. చాలు మనకి..

    వీడే శ్రీ రామ రక్ష మనకి..

    రా రా సజ్జల రా..

  20. నేను రాజకీయాలకి అతీతంగా GA పేజీ ని ఫాలో అవుతాను. ఈ పోస్ట్ చదువుతుంటే మరి దిగజారి రాస్తున్నట్టు ఉన్నారు. ఈశ్వరుడా లేక మీరు చెప్పినట్టు శనేశ్వరుడా అనేది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం. రాజకీయం ఎలాగయినా చేయవచ్చు కానీ, 2019 లో అదే సజ్జల అనే వ్యక్తి పక్కన ఉన్నాడు మరియు ఇప్పుడు కూడా ఉన్నాడు ఎందుకంటె అంత కంటే నమ్మకంగా ఎవరు లేరు. చాల మంది పెద్ద మనుషులు వ్యవసాయం చేసుకుంటామని దొడ్డి దారి చూసుకున్న కూడా సజ్జల అనే వ్యక్తి జగన్ ని వదలలేదు. జగన్ అనే వ్యక్తి ఒంటరిగా వచ్చి మా గెలుపు కి సహాయపడ్డాడు లేదంటే మేము మల్లి అధికారానికి దూరమయ్యే వాళ్ళము. కూటమిని ఎదిరించి 40 శాతం ఓటు అంటే మాటలు కాదు. అయినా తెలియక అడుగుతాను జగన్ ఎంత చెప్తే అంత ఆ పార్టీలో ,వాళ్ళ కార్యకర్తలే జగన్ అభిప్రాయాన్ని కష్టమో నష్టమో స్వాగతిస్తున్నారు అలాగే సజ్జల గారు ఎలా జగన్ వెంటే ఉంటున్నారు అని గమనిస్తున్నారు. అందువల్ల అతి త్వరలో కార్యకర్తలు జగన్ సజ్జల కలిసి పనిచేస్తారు అనడంలో సందేహం లేదు. ఇదే నువ్వు సజ్జల చాణక్యాన్ని మెచ్చుకున్నా రోజులు కూడా ఉన్నాయి వెనక్కి వెళ్లి చూసుకుంటే. మరి ఇంత లేకి గా దిగజారి మాట్లాడద్దు అని విన్నపం.

Comments are closed.