వైఎస్సార్‌సీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యవసాయం బహుశా ఆగస్టు నాటికి పూర్తి అయ్యే అవకాశం వుంది. రాజకీయాలు మానుకుని, వ్యవసాయం చేసుకుంటానని పార్టీకి, దాని ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సందర్భంలో విజయసాయిరెడ్డి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
కొన్ని రంగాల్లో ప్రవేశించిన తర్వాత, వాటిని వీడడం అంత సులువు కాదు. అలాంటి రంగాల్లో రాజకీయం కూడా ఒకటి. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో అన్నీ మాట్లాడుకునే విజయసాయిరెడ్డి వైఎస్సార్‌సీపీని, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజంగానే ఆయన వ్యవసాయం చేసుకుంటూ శేష జీవితం గడుపుతారని అనుకుంటే, అంతకన్నా అమాయకత్వం మరొకటి వుండదు.
వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో రైతులే వేర్వేరు రంగాల వైపు దృష్టి సారిస్తున్న దయనీయ పరిస్థితి. అలాంటిది విజయసాయిరెడ్డి వ్యవసాయం చేస్తారంటే… అతిపెద్ద జోక్. రాజకీయ సాగులో నిష్ణాతుడైన విజయసాయిరెడ్డి వైఎస్సార్‌సీపీని వీడి, మరో పార్టీ కండువా కప్పుకోనున్నారు. విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి నిష్క్రమించానని ప్రకటించిన తర్వాత కూడా, ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాలను అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఆయన ఏ పార్టీలో చేరుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బీజేపీలో చేరడానికి ఆయన అన్ని రకాల ఏర్పాట్లలో ఉన్నారు. అయితే ఆయన రాకను బీజేపీ ఎంపీలు సీఎం రమేశ్, పురందేశ్వరి అడ్డుకుంటున్నారని సమాచారం. కానీ విజయసాయిరెడ్డికి బీజేపీ అగ్రనేతలతో సత్సంబంధాల రీత్యా, అడ్డంకులను అధిగమించడం పెద్ద విషయం కాదని అంటున్నారు.
ఈ ఏడాది ఆగస్టులో బీజేపీలో విజయసాయిరెడ్డి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలిసింది. ఆ లోపు వ్యక్తిగత పనుల్ని కూడా పూర్తి చేసుకోనున్నారు. ఇక ఆయన ఎక్కడైనా పంటలు సాగు చేస్తుంటే, అప్పటికి దిగుబడిని ఇంటికి చేర్చుకుంటారేమో! ఏది ఏమైనా ఆగస్టులో విజయసాయిరెడ్డి ఆగస్టులో బీజేపీ నాయకుడిగా కొత్త అవతారం ఎత్తనున్నారు.
అవునా.. మోడీ, అమిత్ షా,నడ్డా మధ్య తీవ్ర విబేధాలు అట!కసాయి గాడిని చేర్చు కొనే విషయంలో.. :):)గు…ద్ద మూసుకో రా గుర్నాధం:)
పాడి పంటలు
జగనన్న కి… బీజేపీ కి మధ్య వారధి…. విజయ సాయి రెడ్డి
Veddu manaki avasarama?