‘షాదీ మాటే వద్దు గురూ…సోలో బతుకే సో బెటరు’ అని ఓ సినిమాలో కోట శ్రీనివాస రావు పాడతాడు. పెళ్లి చేసుకోకుండా సోలోగా ఉంటే అంటే ఒంటరిగా ఉంటే వ్యాధులు రావు. ముఖ్యంగా జ్ఞాపక శక్తికి సంబంధించిన, మతి భ్రమింపచేసే ‘డిమన్షియా’ అనే వ్యాధి రాదు. డిమన్షియా ముదిరితే అల్జీమర్స్కు దారి తీస్తుందని చెబుతారు. అల్జీమర్స్ వచ్చినవారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. వాళ్లను కట్టడి చేయడం చాలా కష్టం.
కాబట్టి పెళ్లి చేసుకోవడం కంటే చేసుకోకపోవడమే అన్నివిధాల మంచిది అంటున్నారు అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్శిటీ పరిశోధకులు. పెళ్లికి ముందు డిమన్షియా వ్యాధి ఉన్నట్లయితే పెళ్లయ్యాక అది మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పెళ్లయితే పిచ్చి కుదరదు…ముదురుతుందని అంటున్నారు. ఇదొక్కటే కాదు ఇతర వ్యాధులు కూడా పెళ్లయినవారిలో కంటే పెళ్లి కాని వారిలో తక్కువగా ఉంటాయని పరిశోధనలో తేలింది.
పెళ్లి చేసుకుంటే బుర్ర తిరిగిపోతుందని అమెరికా పరిశోధకులు ఆషామాషీగా ఒకటి రెండు రోజుల్లో పరిశోధన చేసి చెప్పలేదు. 24 వేలమందిపై 18 ఏళ్లు పరిశోధనలు చేశారు. మొత్తం మందిని నాలుగు గ్రూపులుగా చేశారు. వివాహితులు, విడాకులు తీసుకున్నవారు, వైధవ్యం కలిగినవారు (భార్య చనిపోయినవారు, భర్త చనిపోయినవారు) అసలు వివాహమే చేసుకోకుండా ఉన్నవారు. పెళ్లయినవారితో పోలిస్తే పెళ్లికాని వారిలో డిమాన్షియా ప్రభావం తక్కువగా ఉన్నట్లు తేలిందట.
2019లో అమెరికాలోనే జరిగిన పరిశోధనల్లో పెళ్లికానివారికంటే పెళ్లయినవారే ఆరోగ్యంగా ఉరంటారని తేల్చారు. కాని ఇప్పుడు అందుకు విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. ఇప్పటి పరిశోధనల ప్రకారం గుండెజబ్బులు, ఇతర వ్యాధులు కూడా పెళ్లయినవారిలోనే ఎక్కువట. మరి పెళ్లి చేసుకొని మతి భ్రమింపచేసుకోవాలా? లేదా పెళ్లి చేసుకోకుండా సుఖంగా ఉండాలా? ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఈ కాలంలో పెళ్లి చేసుకోవడానికి ఎక్కువమంది విముఖంగా ఉన్నారు. అందుకు వేరే కారణాలు ఉన్నాయనుకోండి.
ఈ పరిశోధన పెళ్లి అయిన వాళ్లు చేశారా లేదా బ్రహ్మచారి చేశారో కూడా తెలిపితే బాగుంటుంది.
అయ్యో ! ఈ ముక్క ఒక 10 సంవత్సరాల క్రితం చెప్పుంటే చేసుకొనేవాడిని కాదు.
There was another research which proved that Lifelong bachelors are twice as likely to die from heart failure as men who get married
భార్య అడిగే కోరికలకు లేని డిమెన్షియా తెచ్చుకుని వుంటారు.
భార్య అడిగే కో/రి/క/లకు లేని డిమెన్షియా తె/చ్చు/కు/ని వుంటారు.
భార్య అ/డి/గే కో/రి/క/లకు లే/ని డి/మె/న్షి/యా తె/చ్చు/కు/ని వుంటారు.
భా/ర్య అ/డి/గే కో/రి/క/లకు లే/ని డి/మె/న్షి/యా తె/చ్చు/కు/ని వు0టారు.
వివాహం చేసుకోండి. జీవితం లో ప్రేమ అనేది ఉండాలి. ఒకరికి ఒకరు తోడు చాల అవసరం.