ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌తీమ‌ణి కోసం డిక్ల‌రేష‌న్ సిద్ధ‌మా?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌తీమ‌ణి అన్నా లెజినోవా సోమ‌వారం తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నానికి వెళ్ల‌నున్నారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌తీమ‌ణి అన్నా లెజినోవా సోమ‌వారం తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నానికి వెళ్ల‌నున్నారు. మ‌తప‌రంగా ఆమె క్రిస్టియ‌న్‌. అన్య‌మ‌త‌స్తులు తిరుమ‌ల‌కు వెళితే, డిక్ల‌రేష‌న్ ఫాంపై సంత‌కం చేయాల‌ని కూట‌మి నేత‌లు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో కుమార్తె పొలెనా అంజ‌నా ప‌వ‌నోవాతో క‌లిసి తిరుమ‌ల‌కు ప‌వ‌న్ వెళ్లారు. ఆ సంద‌ర్భంలో కుమార్తెతో డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయించారు.

ఈ నేప‌థ్యంలో సింగ‌పూర్‌లో చిన్న కుమారుడు మార్క్ శంక‌ర్ అగ్ని ప్ర‌మాదంలో గాయ‌ప‌డి, ప్రాణాపాయం నుంచి బ‌య‌టప‌డ‌డంతో తిరుమ‌ల శ్రీ‌వారిని కుటుంబంతో క‌లిసి ద‌ర్శించుకోవాల‌ని ప‌వ‌న్ అనుకున్న‌ట్టున్నారు. అందుకే మొద‌టిసారిగా భార్య అన్నా లెజినోవాతో క‌లిసి ప‌వ‌న్ తిరుమ‌ల వెళ్ల‌నున్నారు. అన్నా లెజినోవా అన్య‌మ‌తస్తురాలు కావ‌డంతో ఆమె నుంచి టీటీడీ అధికారులు సంత‌కం తీసుకునే అవ‌కాశం వుంది.

గ‌తంలో ప‌వ‌నే కుమార్తెతో సంత‌కం చేయించ‌డంతో ఇప్పుడు భార్య‌తో కూడా అదే ప‌ని చేయిస్తార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. లేదంటే కూట‌మి నేత‌లే వివాదం చేసే అవ‌కాశం వుంది. శ్రీ‌వారి ద‌య వ‌ల్లే చిన్న కుమారుడు అగ్ని ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్టు ప‌వ‌న్ కుటుంబం న‌మ్ముతోంది.

ఏది ఏమైనా ప‌వ‌న్ చిన్న కుమారుడు మార్క్ శంక‌ర్ కోలుకోవ‌డం అంద‌రికీ ఆనందాన్ని ఇచ్చే విష‌యం. డిక్ల‌రేష‌న్‌పై సంత‌కాలు లాంటివ‌న్నీ ఇప్పుడు రాజ‌కీయాలు కావ‌డంతో మంచీచెడుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేమీ లేద‌నే మాట వినిపిస్తోంది.

26 Replies to “ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌తీమ‌ణి కోసం డిక్ల‌రేష‌న్ సిద్ధ‌మా?”

  1. ఇతర మతస్తులకు డిక్లరేషన్ కావాలి, ఈమె ఆల్రెడీ హిందూ గ మరి, హిందూ మతాచారాలను పాటిస్తుంటే అవసరం లేదు.

  2. డిక్లరేషన్ సమర్పించింది….మరో ఆర్టికల్ రాసుకో….జగన్ క్రిస్టియన్ అయినప్పటికీ డిక్లరేషన్ సమర్పించిన దాఖలాలు లేవు….పవన్ సతీమణి నీ చూసి జగన్ బాచ్ బుద్ధి తెచ్చుకోవాలి

  3. డిక్లరేషన్ ఏమి ఖర్మ…ఏకంగా గుండే కొట్టించుకుంది…అదీ హిందూ ధర్మం మీద నమ్మకం

  4. డిక్లరేషన్ ఏమి ఖర్మ…ఏకంగా గుండే కొట్టించుకుంది…అదీ హిందూ ధర్మం మీద నమ్మకం

  5. తన కొడుకు ప్రాణాలు ఆ వెంకన్నే కాపాడారు అన్న నమ్మకంతో ,

    ఆడవారి ప్రాణ ప్రదం గా భావించే తల నీలాలు సమర్పించుకున్నారు.

    విదేశీయులు అయినా కూడా ఆవిడ నిబద్ధత నీ ప్రణామాలు.

    వాటి*కన్ వెంక*ట్ రెడ్డి, ఇంకా నీ సన్నాయి నొక్కులు ఆపు.

  6. E great Andra anedi oka amudu poyena … Di anduke vidu epudu pawan kalayan news and mega family issues thappa veridi write cheyatam radu ala cheyakunte vidi page ni okkadu kuda chudadu paiga pedda true news ayenattu great Andra .. anta pichana niku elara journalism vachindi dani midha unna namakam kuda mi lanti valla pothundi. …

  7. ఈ గ్రేట్ ఆంధ్ర గొట్టం గాడికి ఎప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాదు

Comments are closed.