ఎప్పటికైనా ఆ సినిమా తీస్తాను

హీరో ఎలా గంజాయిని అరికట్టాడనేది కథ. టైటిల్ కచ్చితంగా మారుస్తాను. కథలో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు.

గాంజా శంకర్.. సాయిదుర్గతేజ్ హీరోగా సంపత్ నంది చేయాల్సిన సినిమా అది. అప్పట్లో డ్రగ్స్ కలకలం రేగిన టైమ్ లో ఈ టైటిల్ ప్రకటించి తప్పు చేశారు. నోటీసులు రావడంతో, సెంటిమెంట్ గా ఫీలై అందరూ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.

ఇదే విషయాన్ని ఇటీవల ప్రకటించిన సంపత్ నంది, ఇప్పుడా ప్రాజెక్టుపై మరో ఆసక్తికర ప్రకటన చేశాడు. ఎప్పటికైనా గాంజా శంకర్ సినిమా తీస్తానంటున్నాడు ఈ దర్శకుడు.

“ఆ సినిమాకు టైటిల్ తోనే చిక్కొచ్చి పడింది. నిజానికి గంజాయికి వ్యతిరేకంగా రాసుకున్న కథ అది. హీరో ఎలా గంజాయిని అరికట్టాడనేది కథ. టైటిల్ కచ్చితంగా మారుస్తాను. కథలో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. అది మోడ్రన్ స్క్రిప్ట్. ఎప్పుడైనా ఆ కథను సినిమాగా తీయొచ్చు”

ఇలా గాంజా శంకర్ ప్రాజెక్టుపై స్పందించాడు సంపత్ నంది. గతంలో పవన్ తో చేయాల్సిన సినిమా ఆగిపోయిన అంశంపై కూడా స్పందించాడు. పవన్ కోసం బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశానని, ఏడాది పాటు ఆయనతో ట్రావెల్ చేశానని, కానీ సినిమా చేయలేకపోయానని అన్నాడు. పవన్ తో సినిమా ఎందుకు ఆగిందో, ఇప్పటికీ తన దగ్గర సమాధానం లేదంటున్నాడు సంపత్ నంది.

One Reply to “ఎప్పటికైనా ఆ సినిమా తీస్తాను”

Comments are closed.