ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పెద్దాయనగా దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి వైసీపీ అధినాయకత్వం గురుతరమైన బాధ్యతలు అప్పగించింది. ఆయనని పార్టీ హైలెవెల్ కమిటీ అయిన పీఏసీలో మెంబర్ గా నియమించింది.
తమ్మినేని చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారని ఆయన అలిగారని రకరకాలైన ప్రచారం సాగుతున్న క్రమంలో ఆయనకు ఈ విధంగా అధినాయకత్వం మంచి గుర్తింపు ఇచ్చింది. దీంతో తమ్మినేనిని వదులుకోబోమని పార్టీ పెద్దలు తమ మనసులో మాటను చెప్పారని అంటున్నారు.
తమ్మినేని ఇక మీదట పార్టీలో చురుకైన పాత్ర పోషించేలా రంగంలోకి దిగాలని కోరుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం కి మొదటి నుంచి పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంది.
అయితే ఇటీవల కాలంలో ఆయన సొంత నియోజకవర్గం ఆముదాలవలసలో ఇన్చార్జి పదవి నుంచి తప్పించడంతో ఆయన ఆగ్రహంగా ఉన్నారు అని ప్రచారం నడచింది. అయితే తమ కుటుంబ పరమైన విషయాల వల్లనే తాను పార్టీకి కొంత సమయం కేటాయించలేకపోయాను అని అప్పట్లో ఆయన వివరణ ఇచ్చారు.
అయినా సరే రాజకీయంగా ఆయన రీయాక్టివ్ అయితే కావడం లేదు. ఆయన వేరే ఆలోచనలు చేస్తున్నారు అని ప్రచారం సాగిన సందర్భం కూడా ఉంది. అయితే వాటిని పూర్వ పక్షం చేస్తూ అధినాయకత్వం ఆయనకు అగ్రాసనం అందించింది. ఇకనైనా తమ్మినేని తన పూర్వపు తీరుతో రాజకీయ జోరుని చూపిస్తారా అని వైసీపీలో అంతా తర్కించుకుంటున్నారు.
మొన్నామధ్యేగా యువతకి జగన్ ప్రాధాన్యం అని రాయసావ్…నిన్ననేగా పాలవలస కుటుంబానికి అధిక ప్రాధాన్యం అని రాసావ్….ఇప్పుడేమో తమ్మినేని దిక్కు అంటావ్
ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఖర్చు పెట్టే నాయకులు దొరకాలి కదా దొరక్క పోతే ఇలాంటి సీనియర్లు దిక్కు అవుతారు
పార్టీ లోకి కొత్త రక్తం అని చెప్పి మళ్ళా ధర్మాన తమ్మినేని అంటే ela???
పదవి లో ఉన్నప్పుడు కుటుంబం కోసం సమయం కేటాయించడం లేదా? పదవి పోయాక కుటుంబం గుర్తొచ్చిందా??
‘ఒరే తమ్మీ, ఈ సీతిగాడు B. Tech లో ఎకనామిక్స్ చదువుకుంటాడట.. వదిలేయండి
హై లెవెల్ కమిటీ సభ్యులుగా ఉన్న వారికి వీడి గా ప్యాలెస్ లో ఏమైనా అన్నయ్య దర్శనం ఏమైనా దొరుకుతుందా అసలు