ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై జ్యోతుల నెహ్రూకు అనుమానం!

మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌ను ప‌రోక్షంగా అనుమానించి, అవ‌మానించ‌డ‌మే అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, అలాగే పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌పై టీడీపీ సీనియ‌ర్‌, కాకినాడ జిల్లా జ‌గ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప‌రోక్షంగా చుర‌క‌లు అంటించారు. కాకినాడ పోర్టులో రేష‌న్ బియ్యాన్ని అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న షిప్‌ను సీజ్ చేయాలంటూ అక్క‌డికెళ్లి ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసిన హ‌డావుడి తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ప‌వ‌న్ ఆదేశాలేవీ ప‌ని చేయ‌లేదు.

ఆ షిప్ చ‌క్క‌గా బియ్యాన్ని విదేశాల‌కు తీసుకెళ్లింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న జ్యోతుల నెహ్రూ… త‌న‌దైన స్టైల్‌లో స్పందించారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ కాకినాడ పోర్ట్‌లో ప‌ట్టుబ‌డిన బియ్యం వ్య‌వ‌హారం చ‌ల్ల‌బ‌డింద‌ని అంటున్నార‌ని ఆయ‌న అన్నారు. అస‌లు ఎందుకు చ‌ల్ల‌బ‌డిందో, ఎలా చ‌ల్ల‌బ‌డిందో, ఆ వెంక‌టేశ్వ‌ర‌స్వామికే తెలియాల‌ని జ్యోతుల నెహ్రూ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.

ఈ కామెంట్స్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, జ‌న‌సేన నాయ‌కుడు, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌ను ప‌రోక్షంగా అనుమానించి, అవ‌మానించ‌డ‌మే అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అలాగే ఈ వ్య‌వ‌హారంపై కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కే నాదెండ్ల మ‌నోహ‌ర్ ప‌రిమితం కాకూడ‌ద‌ని జ్యోతుల నెహ్రూ హిత‌వు చెప్పారు. రేష‌న్ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేయాల‌ని ఆయ‌న సూచించారు. రూ.30 బియ్యాన్ని రూపాయికే ఇవ్వ‌మ‌ని ఎవ‌రు చెప్పార‌ని ఆయ‌న నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం.

విజిలెన్స్ విచార‌ణ‌, కేసుల‌తో ఉప‌యోగం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తినే బియ్యం ఇస్తే, వాటిని ప్ర‌జ‌లు ఎందుకు అమ్ముకుంటార‌ని జ్యోతుల నెహ్రూ నిల‌దీశారు. యాభై శాతం స‌బ్సిడీతో స‌న్న‌బియ్యం ఇస్తే ప్ర‌జ‌లు కొనుగోలు చేయ‌లేరా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

4 Replies to “ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై జ్యోతుల నెహ్రూకు అనుమానం!”

  1. షుగర్ జబ్బులకు కారణం అవుతున్న తెల్ల బియ్యం తినే వాళ్లకి ఎక్స్ట్రా పన్ను వేయాలి. తెల్ల బియ్యం తినేవాళ్ళకి ప్రభుత్వ ఆరోగ్య పథకాలు ఇవ్వకుండా ఆపేయాలి. 

    పట్టు తీయని బియ్యం తినాలి అందరూ, ఆరోగ్యం కోసం.

Comments are closed.