మేడ‌మ్‌కు 25% క‌మీష‌న్ కావాల‌ట‌!

మాజీ మంత్రి అయిన మహిళా నాయ‌కురాలికి 25 % క‌మీష‌న్ కావాల‌ట‌. ఇది ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కురాలి ఆర్డ‌ర్‌. అస‌లే మేడ‌మ్‌కు కిడ్నాప్‌లు, భౌతిక‌దాడుల్లో మంచి ప్రావీణ్యం ఉండ‌డంతో…

మాజీ మంత్రి అయిన మహిళా నాయ‌కురాలికి 25 % క‌మీష‌న్ కావాల‌ట‌. ఇది ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కురాలి ఆర్డ‌ర్‌. అస‌లే మేడ‌మ్‌కు కిడ్నాప్‌లు, భౌతిక‌దాడుల్లో మంచి ప్రావీణ్యం ఉండ‌డంతో గ్రామ‌స్థాయి నాయ‌కులు భ‌య‌ప‌డుతున్నారు.  

టీడీపీ హ‌యాంలో నీరు-చెట్లు ప‌థ‌కం కింద ప్ర‌భుత్వ ఖ‌జానాను దోచుకున్నారు. ప‌ది శాతం ప‌నులు చేసి, 90 శాతం ఉత్త‌ పుణ్యానికే వెన‌కేసుకున్నారు. కొన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. న్యాయ‌పోరాటం చేయ‌డంతో బిల్లుల విడుద‌ల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఒప్పుకుంది.

దీంతో నీరు-చెట్టు ప‌నులు చేసిన నాయ‌కులు కెవ్వు కేక అంటూ సంబ‌రాలు చేసుకున్నారు. అయితే ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ప్ర‌తిప‌క్ష నాయ‌కుల్లో ఆనందం క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం మొత్తం బిల్లులో 25% అమౌంట్ త‌మ‌కు చెల్లించాల్సిందే అని స్వ‌యంగా ఆ మాజీ మంత్రి, ఆమె భ‌ర్త ఫోన్ చేసి ఆదేశిస్తున్నార‌ని స‌మాచారం

దీంతో ఇదెక్క‌డి గొడ‌వ‌రా బాబూ అని టీడీపీ గ్రామ‌, మండ‌ల నాయ‌కులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. అప్పోస‌ప్పో చేసి ప‌నులు చేశామ‌ని, ఇప్పుడు బిల్లులు క్లియ‌ర్ అయ్యాయ‌ని వారు అంటున్నారు. అయితే చేసిన ప‌నెంత‌, అయిన ఖ‌ర్చు ఎంత త‌న‌కు బాగా తెలుస‌ని, మ‌ర్యాద‌గా వ‌చ్చి క‌మీష‌న్ ఇచ్చి పోవాల‌ని మేడ‌మ్ గారు ఆదేశించిన‌ట్టు తెలిసింది. లేదంటే ఏం చేస్తానో త‌న‌కే తెలియ‌ద‌ని హెచ్చ‌రిస్తున్నార‌ని స‌మాచారం.

ఈ విష‌య‌మై అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామ‌ని ఒక‌రిద్ద‌రు నాయ‌కులు హెచ్చ‌రిస్తున్నారు. మొత్తానికి వ‌చ్చిన సొమ్ములో కొంత మేడ‌మ్‌కు ఇచ్చి, మిగిలింది తాము పెట్టుకుంటారా? లేక ఎదురు తిరుగుతారా? అనేది ప్ర‌స్తుతం నంద్యాల జిల్లాలో ఉన్న ఆ నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.