వైసీపీకి మ‌రో ఎమ్మెల్సీ గుడ్‌బై

వైసీపీకి, ఎమ్మెల్సీ ప‌ద‌వికి మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రాజీనామా చేశారు. ఈ మేర‌కు రాజీనామా ప‌త్రాన్ని మండ‌లి చైర్మ‌న్‌కు ఆయ‌న పంపారు.

అనుకున్న‌దే జ‌రిగింది. వైసీపీకి, ఎమ్మెల్సీ ప‌ద‌వికి మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రాజీనామా చేశారు. ఈ మేర‌కు రాజీనామా ప‌త్రాన్ని మండ‌లి చైర్మ‌న్‌కు ఆయ‌న పంపారు. ఇప్ప‌టికే న‌లుగురు ఎమ్మెల్సీలు వైసీపీ ప్రాథ‌మిక సభ్య‌త్వాల‌కు, చ‌ట్ట‌స‌భ ప‌దవుల‌కు రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. వైసీపీని వీడిన ఆ న‌లుగురు ఎమ్మెల్సీలు …పోతుల సునీత‌, బ‌ల్లి క‌ల్యాణ్‌చ‌క్ర‌వ‌ర్తి, జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ‌, కర్రి ప‌ద్మ‌శ్రీ ఉన్నారు.

తాజాగా మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ఆ జాబితాలో చేరారు. అయితే ఆ న‌లుగురు ఎమ్మెల్సీల రాజీనామాల‌ను ఇంత వ‌ర‌కూ మండ‌లి చైర్మ‌న్ ఆమోదించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అందుకే న‌లుగురూ మండ‌లి స‌మావేశాల‌కు వెళుతున్నారు.

ఇదిలా వుండ‌గా మ‌ర్రి రాజశేఖ‌ర్ చాలా కాలంగా వైసీపీ నాయ‌క‌త్వంపై అసంతృప్తిగా ఉన్నారు. 2014లో ప‌ల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేట నుంచి వైసీపీ త‌ర‌పున పోటీ చేసి టీడీపీ నేత ప‌త్తిపాటి పుల్లారావు చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు వైసీపీ టికెట్ ద‌క్క‌లేదు. విడ‌ద‌ల ర‌జినీకి వైసీపీ టికెట్ ద‌క్క‌డంతో ఆయ‌న తీవ్ర అసంతృప్తికి లోన‌య్యారు.

కానీ మ‌ర్రి రాజశేఖ‌ర్‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి, మంత్రిని చేస్తాన‌ని ఎన్నిక‌ల స‌భ‌లో జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఆ హామీ నెర‌వేర‌లేదు. అయితే ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి మాత్రం ఇచ్చారు. చిల‌క‌లూరిపేట‌లో ర‌జినీ పెత్త‌న‌మే త‌ప్ప‌, త‌న‌కు ఎలాంటి ప‌వ‌ర్స్ లేవ‌ని ఆయ‌న ఆవేద‌న చెందుతున్నారు. పార్టీని వీడుతార‌నే ప్ర‌చారం కొంత‌కాలంగా సాగుతోంది. ఎట్ట‌కేల‌కు ఆ ప్ర‌చారం నేటికి నిజ‌మైంది.

21 Replies to “వైసీపీకి మ‌రో ఎమ్మెల్సీ గుడ్‌బై”

    1. నీకు తెలుసా రా నీల్ డా..గ్..మర్రి గురుంచి?MLC ని చేసి మినిస్టర్ ఇస్తానన్న కు..క్క ఎవుర్రా?govt దిగి పోయే టైం లో MLC పడేసి..మల్ల టికెట్ ఇవ్వకుండా..గుంటూరు మింగేసిన మొక్క ని మల్ల ఇప్పుడు పేట కి తెచ్చి ఇంచార్జి చేశారు..మర్రి ఎర్రి వాడు కాదు..టీడీపీ కంచుకోట లాంటి పేట లో ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర అతనిది.

    2. Lol.. Congress రాజకీయ జీవితం ఇస్తే .. పదవి కోసం బయటకి వచేసింది ఎవరో. ..

  1. గుంటూరు దెంగేసింది అక్కడే వుండొచ్చు గా..మల్ల పేటకు వచ్చి మకాం పెడితే మర్రి ఏమన్నా ఎర్రి పుష్పం అనుకుంటున్నారా?

  2. Talli Shelly ne vedilesi poyaru,

    A2 Sai Reddy Hand icchadu

    PrathiPaksha Hoda kooda ledu

    Tegincha vadiki tedde lingam ani

    aa 10 vunte yentha oodithe yentah?

    repu CBI casulu lo moosethe yenatha moyyaka pothe yentha?

Comments are closed.