ఎవ‌రికో మూడింది గురూ!

తిరుప‌తి డిప్యూటీ మేయ‌ర్ ఉప ఎన్నిక‌లో చోటు చేసుకున్న హింస‌పై వ్య‌వ‌స్థ‌లు సీరియ‌స్‌గా ఉన్నాయి.

తిరుప‌తి డిప్యూటీ మేయ‌ర్ ఉప ఎన్నిక‌లో చోటు చేసుకున్న హింస‌పై వ్య‌వ‌స్థ‌లు సీరియ‌స్‌గా ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా తిరుప‌తి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి తాను, త‌న‌తో ప్ర‌యాణిస్తున్న న‌గ‌ర మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌, ఎమ్మెల్సీ సిపాయి సుబ్ర‌మ‌ణ్యం, అలాగే వైసీపీ కార్పొరేట‌ర్ల‌పై రౌడీ మూక‌లు దాడి చేయ‌డాన్ని సీరియ‌స్‌గా తీసుకున్నారు.

ప్ర‌స్తుత ప‌రిణామాల్ని గ‌మ‌నిస్తే, తిరుప‌తి పోలీస్‌, ఉప మేయ‌ర్ ఎన్నిక అధికారులు, అలాగే మున్సిప‌ల్ అధికారుల్లో కొంత మందికి మూడింద‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ వ్య‌వ‌హారంపై తిరుప‌తి ఎంపీ ఇప్ప‌టికే జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌, ఎస్సీ క‌మిష‌న్‌, ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ వ్య‌వ‌స్థ‌ల‌న్నీ ఇప్ప‌టికే డీజీపీ, చీఫ్ సెక్ర‌ట‌రీకి నోటీసులు ఇచ్చాయి. నెల‌లోపు పూర్తి వివ‌రాల‌తో నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆదేశించాయి. వీడియోల‌తో స‌హా స్ప‌ష్ట‌మైన ఆధారాలుంటే, ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ప్ర‌శ్నించ‌డాన్ని చూశాం.

తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ముఖ్య‌కార్య‌ద‌ర్శి ఇదే విష‌య‌మై డీజీపీకి నోటీసు ఇచ్చారు. మూడు రోజుల్లో నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆదేశించారు. గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఎంపీ త‌దిత‌ర వైసీపీ నేత‌లు ప్ర‌యాణిస్తున్న బ‌స్సుపై దాడి చేశార‌ని కేసు న‌మోదు చేసిన పోలీసులు, ఎట్ట‌కేల‌కు దిగిరాక త‌ప్ప‌లేదు. ఇప్ప‌టికే బ‌స్సుపై దాడి చేసిన దుండ‌గుల్ని గుర్తించ‌డంతో పాటు నోటీసులు ఇచ్చారు. దీంతో చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోక త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి పోలీసుల‌కు ఏర్ప‌డింది.

మ‌రోవైపు బీజేపీ సీనియ‌ర్ నేత‌, ప్ర‌ముఖ న్యాయ‌వాది సుబ్ర‌మ‌ణ్య‌స్వామి తిరుప‌తి డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌ల్లో హింస‌పై ఏపీ హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేశారు. ప్ర‌స్తుతం హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. ఈ కేసు తిరుప‌తి అధికారుల‌కు చుట్టుకునేలా వుంద‌ని స‌మాచారం. టీడీపీ ప‌ట్టింపుల‌కు అన‌వ‌స‌రంగా తాము బ‌లి అవుతామ‌నే భ‌యం అధికారుల్ని వెంటాడుతోంది.

6 Replies to “ఎవ‌రికో మూడింది గురూ!”

    1. నందిగం సురేష్ కి మిగిలింది….పోసాని, వల్లభనేని కి మిగులుతోంది.వర్ర, ఇంటూరి ఈపోదో పగలడం స్టార్ట్ ఐంది ఇంకా ఎన్ని రోజులో తెలియదు. నెక్స్ట్ ఎవడిది పగులుద్దో తెలియక గజ గజ వణుకుతున్నారు

Comments are closed.