గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తెగ భయపడిపోతున్నారు. అనర్హత వేటు పడుతుందేమోనని వణికిపోతున్నారు. పార్టీ ఫిరాయింపుదారులపై సుప్రీం కోర్టులో ఈ నెల 25 న విచారణ జరుగుతుంది. ఫిరాయింపుదారులకు ఆల్రెడీ నోటీసులు వెళ్లాయి. వాటికి సమాధానాలు ఇస్తున్నారు.
ఒకవేళ సుప్రీం కోర్టు అనర్హత వేటు వేస్తే ఫిరాయింపుదారుల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో గెలుస్తామో లేదోనని తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అందుకే దాదాపు అందరు ఫిరాయింపుదారులు తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. తాము ఇంకా గులాబీ పార్టీలోనే ఉన్నామంటున్నారు.
అలాంటి వారిలో పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, గులాబీ పార్టీలోనే కొనసాగుతున్నానని సుప్రీం కోర్టుకు సుదీర్ఘ అఫిడవిట్ సమర్పించాడు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా మీడియాలో వార్తలను వక్రీకరించారని అఫిడవిట్ లో పేర్కొన్నాడు. కానీ ఈయన ఏ ధైర్యంతో అఫిడవిట్ లో ఇంత పచ్చి అబద్దం చెప్పాడో అర్ధం కావడంలేదు.
అఫిడవిట్ అంటే ప్రమాణపత్రం. అంటే అందులో నిజమే చెప్పాలి. కానీ మహీపాల్ రెడ్డి వాస్తవాన్ని మరుగుపరిచాడు. తాను పార్టీ ఫిరాయించలేదని చెబుతున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పుతున్న ఫోటోలు అన్ని పత్రికల్లో వచ్చాయి. ఇంటర్నెట్ లో కూడా ఉన్నాయి. టీవీల్లో వచ్చిన వీడియోలు ఉన్నాయి.
గులాబీ పార్టీ వీటిని సాక్ష్యాలుగా సమర్పిస్తుంది కదా. మరి అలాటప్పుడు మహీపాల్ రెడ్డి తాను పార్టీ మారలేదని బల్ల గుద్ది ఎలా చెబుతున్నాడో అర్థం కావడంలేదు. తాను 2018, 2023 ఎన్నికల్లో గెలిచానని చెప్పాడు. గత ఎన్నికల్లో గెలిచిన తరువాత వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని, కానీ మీడియాలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రచారం చేశారని అఫిడవిట్ లో పేర్కొన్నాడు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కొంతకాలానికే ఆయన యూటర్న్ తీసుకున్నాడు. కాంగ్రెస్‌లో అనధికారికంగా కొనసాగుతున్నప్పటికీ.. పలు సందర్భాల్లో బీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు.
అంతెందుకు పటాన్‌చెరులోని తన క్యాంపు కార్యాలయంలో కూడా కేసీఆర్ ఫొటోనే పెట్టుకున్నాడు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించినప్పటికీ.. బరాబర్ కేసీఆర్ ఫొటో ఉంచుకుంటానని స్పష్టం చేశాడు. పదేండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో సహకరించారని గుర్తుచేశాడు. క్యాంపు కార్యాలయం తన నివాసమని, ఇక్కడ కేసీఆర్ ఫోటో పెట్టుకోవడంలో తప్పేమిటని ప్రశ్నించాడు. ఇప్పుడేమో సుప్రీం కోర్టుకు అఫిడవిట్ సమర్పించాడు. మరి సుప్రీం కోర్టు దీన్ని పరిగణనలోకి తీసుకుంటుందా?
వాళ్లంతా సీఎం ని మర్యాదపూర్వకంగా కలిశారు , మొన్నామధ్య చంద్ర చూద్ కూడా మోడీ ని కలిసాడు తర్వాత తీర్పులు చాల మటుకు బీజేపీ కి అనుకూలంగా వచ్చాయి అన్నారు ప్రజలు అలాంటివాటికే ఠికానా లేదు
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Avunu kadha