నీహారిక నిర్మాతగా రెండో సినిమా

తన పరిచయాలు అన్నీ ఉపయోగించి సినిమాకు మంచి పబ్లిసిటీ చేసుకున్నారు. ఇప్పుడు రెండో ప్రాజెక్ట్ కు శ్రీకారం చుడుతున్నారు.

నాగబాబు తనయ నీహారిక కొణిదెల పూర్తి స్థాయి నిర్మాతగా అందించిన సినిమా కమిటీ కుర్రాళ్లు. దాదాపు అంతా కొత్తవారితో నిర్మించిన ఈ చిన్న సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది. డబ్బులు కూడా వచ్చాయి. ఇప్పుడు రెండో సినిమా నిర్మాణానికి సన్నాహాలు చేసుకుంటున్నారు నీహారిక.

తన ప్రాజెక్ట్ లతో చిరకాలంగా అసోసియేట్ అయి వున్న మానస శర్మ కు అవకాశం ఇస్తున్నారు. ఆమె దర్శకత్వంలో రెండో సినిమా నిర్మాణాన్ని ప్రారంభించబోతున్నారు.

మానస శర్మ గతంలో నీహారిక దగ్గరే క్రియేటివ్ డైరక్టర్ గా వుంటూ వస్తున్నారు. ఒక చిన్న ఫ్యామిలీ వెబ్ సిరీస్, బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ చేసారు. సినిమా చేయడం ఇదే తొలిసారి.

కమిటీ కుర్రాళ్ల సినిమా మేకింగ్ విషయంలో, ప్రొడెక్ట్ ను లాంచ్ చేసే విషయంలో నీహారిక చాలా చురుగ్గా వ్యవహరించారు. తన పరిచయాలు అన్నీ ఉపయోగించి సినిమాకు మంచి పబ్లిసిటీ చేసుకున్నారు. ఇప్పుడు రెండో ప్రాజెక్ట్ కు శ్రీకారం చుడుతున్నారు.

5 Replies to “నీహారిక నిర్మాతగా రెండో సినిమా”

Comments are closed.