తన తాతయ్య ఎక్కడికెళ్లాడు? అని అడిగిన నారా దేవాన్ష్ కు వేరే దేశాలకు వెళ్లాడంటూ.. ఆ పసిమనసుపై తన తాత జైలు కెళ్లాడనే ముద్ర పడకుండా కాపాడుకున్నట్టుగా ఒక రకమైన నవ్వుతో నారా భువనేశ్వరి వివరించిన వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది! మరి పిల్లలకు అబద్ధాలు చెప్పకూడదనేది పెద్దలె చెప్పే మాట! సరే.. చంద్రబాబు అవినీతి ఆరోపణలతో జైలు కెళ్లాడని చెప్పడానికి నారా భువనేశ్వరికి ఇబ్బంది కలిగి ఉండొచ్చు. అందుకే మనవడికి అబద్ధం చెప్పి ఉండొచ్చు!
అయితే డయపర్లు వేసుకునే రోజుల్లోనే.. దేవాన్ష్ ను ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు కీర్తించారు! మాటలు రాని రోజుల్లోనే అతడిని కాబోయే ముఖ్యమంత్రి అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి వారు దివాళాకోరు ప్రకటనలు చేశారు! మహానాడు రాజకీయంలోకి కూడా దేవాన్ష్ ను తీసుకొచ్చిన దగుల్బాజీతనం తెలుగుదేశం పార్టీది!
ఇక ఒకానొక సమయంలో.. నారా లోకేషుడు తన తనయుడి రాజకీయ జ్ఞానం గురించి కూడా వివరించారు. ఏబీఎన్ రాధాకృష్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ.. తన తనయుడు ఉదయం లేవగానే పేపర్లను తిరగేస్తాడని చెప్పుకొచ్చాడు. అప్పుడు దేవాన్ష్ కు ఏ మూడు నాలుగేళ్లో ఉంటాయి.
అప్పట్లోనే ఉదయం లేవగానే పేపర్లు తిరగేస్తూ.. మోడీ తాతయ్య, చంద్రబాబు తాతయ్య.. అంటూ ఫొటోలను చూసి చెప్పేవాడట! అప్పట్లో మోడీగారు దేవాన్ష్ కు తాతగారి వరస. ఆ తర్వాత జగన్ మోడీ రెడ్డి అంటూ లోకేష్ తన వాక్పటిమను ప్రదర్శించాడనుకోండి! అంతా బాగున్నప్పుడు తాతయ్య, లేకపోతే ఇంకోటి!
మరి మూడు నాలుగేళ్ల వయసులోనే పేపర్లను చదివేంత జ్ఞాని దేవాన్ష్ అని ఆ పసిపిల్లాడిని కూడా రాజకీయంలోకి లాగి, డయపర్ల వయసులోనే అతడిని కాబోయే ముఖ్యమంత్రిని చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇప్పుడు ఆ అపరజ్ఞానికి అబద్ధాలు చెబుతున్నాడా! ఈ మధ్యనే నారా బ్రహ్మణి కూడా సెలవిచ్చారు.. తన కొడుక్కుచూపించిన సీఐడీ చార్జిషీట్ ను చదివేసి, అందులో సాక్షాలు ఏవీ లేవని తేల్చేస్తాడని చెప్పారు కదా! మరి చార్జిషీట్ చూడాల్సిన వాడికి అబద్ధాలు చెప్పి బజ్జోబెడుతున్నారా! ఇదేం విడ్డూరం!