ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చాలా హామీలిచ్చారు. సూపర్ సిక్స్ అంటూ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల్ని అందిస్తానని జనంలోకి వెళ్లారు. బాబు హామీల్ని జనం నమ్మారు. బాబు ఇచ్చిన హామీల్లో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఇది కాంగ్రెస్ పథకం. కర్నాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో వెంటనే ఉచిత ప్రయాణం కల్పిస్తారని అనుకున్నారు. కానీ అనుకున్నదొకటి, అవుతున్నది మరొకటి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్న కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో రవాణాశాఖ ఉన్నతాధికారులు పర్యటించి అధ్యయనం చేశారు. ఆ రాష్ట్రాల్లో అమలు తీరును ప్రభుత్వానికి వివరించారు. దీంతో ఇక పథకాన్ని అమలు చేయడమే తరువాయి అని అంతా అనుకున్నారు.
కానీ అమలుకు నోచుకోవడం లేదు. తాజాగా ఈ పథకానికి సంబంధించి మరో ట్విస్ట్. మహిళలకు ఉచిత బస్సు అమలవుతున్న రాష్ట్రాల్లో పర్యటించడానికి మంత్రుల కమిటీ ఏర్పాటైంది. రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చైర్మన్‌గా, హోం, మహిళా శిశుసంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రులు కమిటీ సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవహరించనున్నారు.
సాధ్యమైనంత త్వరగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉన్న రాష్ట్రాల్లో పర్యటించి, నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా ఏపీలో అమలు చేస్తామని ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి ఆరు నెలల తర్వాత తీరిగ్గా …అధ్యయనం పేరుతో చక్కగా కాలయాపన చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. నిజంగా ప్రభుత్వానికి ఈ స్కీమ్‌ను అమలు చేయాలనే మంచి ఉద్దేశమే వుంటే, ఇలా దాగుడుమూతలు ఆడాల్సిన పనేంటనే ప్రశ్న కూడా లేకపోలేదు.
హైడ్రా కూల్చివేతల సమయంలో రేవంత్ రెడ్డికి ఆడవాళ్లు పెట్టినట్టు ఎవరైనా ఏపీ ప్రభుత్వానికి ఉచిత బస్సు లేదని శాపనార్థాలు పెట్టారా? లేదు
అంటే అదొకటి అమలవుతుందని మహిళలు ఆశించకుండా ఓటేశారని భావించాలా?
Free bus tickets valla bus seats kosam mahilalu kotukuntaru Hyderabad lo kuda idhe paristhithi manaa andhra lo yelaaa