‘మంచి ప్ర‌భుత్వం’ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదే!

ఇటీవ‌ల చంద్ర‌బాబు స‌ర్కార్ వంద రోజుల పాల‌న పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మి నాయ‌కులు ఇంటింటికి వెళ్లి వంద రోజుల్లో చేసిన ప‌నుల గురించి వివ‌రించాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చెప్పారు.…

ఇటీవ‌ల చంద్ర‌బాబు స‌ర్కార్ వంద రోజుల పాల‌న పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మి నాయ‌కులు ఇంటింటికి వెళ్లి వంద రోజుల్లో చేసిన ప‌నుల గురించి వివ‌రించాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చెప్పారు. ఈ నెల 26వ తేదీ వ‌ర‌కు ఏడు రోజుల పాటు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని సీఎం ఆదేశాలు ఇచ్చారు. అయితే టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ నాయ‌కులు ఇంటింటికి వెళుతున్న దాఖ‌లాలు లేవు.

ఎందుకంటే, ప్ర‌జ‌లు కోరుకుంటున్న‌దేంటో, ప్ర‌భుత్వం చేసిందేంటో నాయ‌కుల‌కు బాగా తెలుసు. అంతెందుకు, మంచి ప్ర‌భుత్వ‌మంటూ వంద రోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా ప్ర‌భుత్వం ఇచ్చిన వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో ఉచిత ఇసుకకు స్థానం లేదు. దీన్నిబ‌ట్టి తాను చెబుతున్న‌దానికి, ఆచ‌ర‌ణ‌కు తేడా ఏంటో ప్ర‌భుత్వ‌మే ప్ర‌క‌టించుకున్న‌ట్టైంది. మంచి ప్ర‌భుత్వంపై కాద‌నుకుండా, అక్క‌డ‌క్క‌డ స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తూ మ‌మ అనిపిస్తున్నారు.

మ‌రీ ముఖ్యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడే త‌న వంద రోజుల పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌కూడ‌ద‌ని అనుకున్నారేమో అనే అనుమానం క‌లుగుతోంది. అందుకే ఆయ‌న తిరుమ‌ల ప్ర‌సాదంపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశార‌నే ప్ర‌చారం కూడా లేక‌పోలేదు.

మంచి ప్ర‌భుత్వ‌మ‌ని కూట‌మి స‌ర్కార్ మీడియాకు చెప్పుకోవ‌డం త‌ప్ప‌, ప్ర‌జ‌ల నుంచి ఆ ర‌క‌మైన ప్ర‌శంస‌లు రావ‌డం లేదు. కూట‌మి స‌ర్కార్ ఏం చేసింది? అనే ప్రశ్న సామాన్య ప్ర‌జానీకం నుంచి వ‌స్తోంది.

19 Replies to “‘మంచి ప్ర‌భుత్వం’ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదే!”

  1. 1. మంచి గురించీ మాట్లాడే నైతిక హక్కు మనకి లేదు. ప్రశ్నించిన ప్రజల పై ఎన్ని కేసు లు పెట్టం మనం

    2. ఇసుక గురించి దిగజారి మాట్లాడటం సబాబు కాదు GA. మనం వొడిపోవటానికి ఇసుక కూడా ఒక కారణం

    3. లడ్డు ప్రసాదాన్ని కూడా మనం నాకేశం ఇంకా ఏమి ఉంది చెప్పుకోవటానికి నారాయణ

    అనవసర ప్రయాసలు మని మానవ సమూహంలో కలుద్దాం ఇకనైనా

  2. మంచి గురించీ మాట్లాడే నైతిక హక్కు మనకి లేదు. ప్రశ్నించిన ప్రజల పై ఎన్ని కేసు లు పెట్టం మనం

  3. ఇసుక గురించి దిగజారి మాట్లాడటం సబాబు కాదు GA. మనం వొడిపోవటానికి ఇసుక కూడా ఒక కారణం

  4. గత 5 ఏళ్లలో నీచుడు జగన్ రెడ్డి లాగ హత్యలు , దోపిడీ , అవినీతి , కిడ్నపులు , అప్పు చేసి దోచుకోవటం అస్సలు లేవు

  5. మీకు మంచి జరిగితే వోట్ వెయ్యమన్నాడు అన్న .. అందుకే 11 .గత ఐదేళ్ల నువు వాయించిన చిడతలు, ఇక్కడ బానిసల భజనలు అబ్బో .. ఈసారి అన్న కొట్టే దెబ్బ మములగా ఉండదు అన్నారు అసెంబ్లీ లో .. ఏమైంది .. అసెంబ్లీ కి వెళ్ళాలి అంటే ఒణుకు .. ఇంకా మార్పు లేదు.. ఎడవండి .. మీ పాపాలు ఒకోటి పండి పార్టీ ముసేసుకోవడమే…

Comments are closed.