వర్మకు మొండిచెయ్యి.. పవన్‌కే అవమానం!

తనకోసం పనిచేసిన వర్మ విషయం పట్టించుకోకపోవడం.. అది తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం అన్నట్టుగా ఊరుకోవడం కరెక్టు కాదనేది పలువురి వాదన.

ఈసారి గ్యారంటీ అని అంతా అనుకున్నారు గానీ.. కొందరు మాత్రం.. చంద్రబాబునుంచి ఫైనల్ డెసిషన్ వచ్చేదాకా వేచిచూద్దాం అని అనుమానంగానే ఉన్నారు. అనుమానించిన వారు కొందరే. కానీ వారి అనుమానమే నిజమైంది. పిఠాపురం నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ పనిచేసినప్పటికీ, జనసేనాని పవన్ కల్యాణ్ కోసం 2024 ఎన్నికల్లో ఆ సీటును త్యాగంచేసి.. ఆయన విజయం కోసం పనిచేసిన వర్మకు ఎమ్మెల్సీ సీటు దక్కలేదు. అయితే.. చంద్రబాబునాయుడు తీసుకున్న ఈ నిర్ణయం పవన్ కల్యాణ్ కే అవమానం అవుతుందనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

పిఠాపురం సీటునుంచి పవన్ కల్యాణ్ పోటీచేస్తారనే సంగతి గత ఎన్నికల్లో నామినేషన్ల పర్వం వరకు తేలలేదు. 2019లో ఓడిపోయిన నాటినుంచి ఆ నియోజకవర్గంలో వర్మ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా కష్టపడి పనిచేసుకుంటూ వచ్చారు. పార్టీ కేడర్ ను కూడా బలంగా తయారుచేసుకుని, 24లో ఖచ్చితంగా గెలుస్తాం అనే వాతావరణం ఏర్పాటుచేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో పవన్ పిఠాపురాన్నే కోరుకోవడంతో.. వర్మకు షాక్ తగిలింది. ఆయన ఇండిపెండెంటుగా నామినేషన్ వేయదలచుకున్నప్పటికీ.. చంద్రబాబు బుజ్జగించి, తొలివిడతలో ఎమ్మెల్సీ చేస్తానని హామీ ఇచ్చి.. పవన్ కు సహకరించేలా ఏర్పాటుచేశారు.

తీరా ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో అయిదు ఎమ్మెల్సీ పదవులు భర్తీ అవుతుండగా.. తెలుగుదేశానికి నాలుగు అనుకున్నారు. చివరి నిమిషంలో బిజెపి- తమకు కూడా కావాలని పట్టుపట్టడంతో మూడు మిగిలాయి. ఆ మూడు స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించేశారు. వర్మకు అవకాశం దక్కలేదు.

జనసేనతో పొత్తులు ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నారు గనుక.. ఆ ప్రకారం చూసినప్పుడు పవన్ కల్యాణ్ ఎప్పటికీ అదేస్థానంలో కొనసాగుతారు గనుక.. పిఠాపురం ఇక వర్మతో తమకు అవసరం లేదని చంద్రబాబునాయుడు భావిస్తుండవచ్చు. కానీ.. తన సీటుకోసం త్యాగం చేసిన వ్యక్తిని, తన గెలుపుకోసం పాటుపడిన వ్యక్తిని పట్టించుకోవడం పవన్ కల్యాణ్ కనీస ధర్మం కదా.. అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.

జనసేనాని చంద్రబాబునాయుడు వద్ద మాట చెప్పగల స్థితిలోనే ఉన్నారు. ఆయన తన పార్టీకి ఒక సీటు పుచ్చుకుని తన సోదరుడు నాగబాబును మండలికి పంపుతున్నారు తప్ప.. తనకోసం పనిచేసిన వర్మ విషయం పట్టించుకోకపోవడం.. అది తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం అన్నట్టుగా ఊరుకోవడం కరెక్టు కాదనేది పలువురి వాదన.

తన నియోజకవర్గంలో పిఠాపురంలో తాను తప్ప మరొక అధికార కేంద్రం ఉండకూదనే ఉద్దేశంతోనే పవన్ పిఠాపురం వర్మకు ఎమ్మెల్సీ సీటు దక్కకుండా మోకాలడ్డుతూ ఉండవచ్చునని అనేక విమర్శలు, అనుమానాలు ఉన్నాయి. అలాంటివి తప్పు అని నిరూపించాలంటే.. వర్మ విషయంలో పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకుని ఉండాల్సిందని పలువురు భావిస్తున్నారు.

17 Replies to “వర్మకు మొండిచెయ్యి.. పవన్‌కే అవమానం!”

  1. Kastapadi kattukunna rajakiya jeevitam antha everiko kattapetti malli Naku evvandi ante everu estaru sir meku.enni years nundi rajakiyam lo unnaru ga rajakiyam lo ecchina matanilapettukuru ani meku inka theliyaledhu sir meku.eppatikina indipendent ga nilapadi Mee rajakiyani Mee medha unna prajala nammakayani nilapettandi sir.

  2. GA , Varma in TDP , not in JSP

    టీడీపీ బాద్యత అది పవన్ గారిది కాదు. వాళ్ళు ఇస్తే తీసుకుంటాడు ఇందులో పవన్ బాద్యత ఏమి ఉండదు.

    టీడీపీ లో ఇంకా సీనియర్స్ , పార్టీ కోసం కష్టపడినోళ్లు చాలామంది ఉన్నారు ఎవరికోసమైనా ఆర్టికల్ రాసావా ? yenduku రాయలేదు అనేది నీకు telusu kadaa !!

    Sollu aapi , jaglak gaadiki dabbakottuko

  3. మర్రి రాజశేఖర్, ఆళ్ల రామకృష్ణ లకి అన్న చేసిన ప్రమాణాల సంగతి ఏంటి… మొన్న మీరే రాసారు అన్న చెప్పిన పదవి ఇవ్వని సంగతి… అంతకు ముందు మీరే రాసారు వేమిరెడ్డి ఎందుకు వెళ్లిపోయారో…

    1. ఆ రోజు అవసరానికి వర్మ చేతులు పెట్టుకున్నాము.

      ఈ రోజు పుల్ల పెట్టి అది టీడీపీ వాళ్ళ వ్యవహారం అని ఇరికించాము.

      బోడి కుర్మ కి ఏరు దాటినాక …తిక్క కుదిరింది.

  4. GA venkat reddy, 11 reddy chellelu ku ye padavi raaledu. 11 reddy Cm ayyaadu. okarojaina article raasaavaa? varma nee brother ayinattu rojuku 5 articles vaduluthunnaavu

    1. బ్రో ఈమాట మొన్న ఎలక్షన్ ముందు అన్నట్లైతే

      నిజంగా మీ పావలా పవన్ బొంగులో వుండే వాడు… అయినా వాడుకొని వదిలివేయడం టిడిపి కి అలవాటగా…

    2. బ్రో ఈ గా గాడు ఈ ఆర్టికల్ రాయడం లో సక్సెస్ అయినట్టు గానే కనబడుతుంది. మీలాంటి అతిగా రియాక్ట్ ఉన్నారని వాళ్ళను ఎలా రెచ్చగొట్టాలో తెలిసినవాడు కాబట్టే వాడు ఇలాంటి ఆర్టికల్స్ తో రెచ్చి పోతూ ఉంటాడు. వర్మ పీకే కి సహాయమే చేసాడు. మీరేమో బొంగులో అంటూ చులకనగా అనేసారు. టీడీపీ వాళ్లు మిమ్మల్ని తిడతారు మళ్ళీ మీరు వాళ్ళని. ఈ బొంగులో గా గాడికి కావలసింది కూడా అదే.so ప్లీజ్ restrain from this sort of రియాక్షన్

    3. ఆ రోజు అవసరానికి వర్మ చేతులు పెట్టుకున్నాము.

      ఈ రోజు పుల్ల పెట్టి అది టీడీపీ వాళ్ళ వ్యవహారం అని ఇరికించాము.

      బోడి కుర్మ కి ఏరు దాటినాక …తిక్క కుదిరింది.

  5. గోదావరి జిల్లాలో రాజులు క్షత్రియుల్లా బ్రతికేవోళ్ళు అని చెప్పుకునే రోజులు వచ్చాయి.

  6. Varma vishiyamulo mata echindhi tdp, pawan kalyan garu kadhu ra sangati reddy so ekada pawan kalyan ki avamanam emi jaragaledhu nuvu eni dhikumalena articles pawan kalyan medha rasina ayana eeka kuda pekaleru

Comments are closed.